💥⚜️శ్రీ రామ నామం సర్వ జగద్రక్షా కవచం⚜️💥
⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయ జయ రామ 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️🌼🏵️
హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి నహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ
🌹శివుడికీ, పార్వతికీ, విభీషణుడికీ, శుభకరమగు మంత్రమై
గజేంద్రుడికీ, అహల్యకూ, ద్రౌపదికీ కష్టాలు పోగొట్టిన చుట్టమై అలరారి,
పాపాత్ములను పాప విముక్తులను చేసే గొప్ప మహిమాన్విత మంత్రం - రామ నామమని,
ఆ రామ నామం తన నాలుకపై నటింప జేయుమని భక్త రామదాసు శ్రీరామచంద్రున్ని కోరుతూ ఆ రామ నామ మహిమ వైభవాన్ని ఎంతో మహనీయంగా కొనియాడాడు.
🍁🍁🍁🍁🍁
💥⚜️శ్రీ రామ నామం సర్వ జగద్రక్షా కవచం⚜️💥
ప్రపంచంలో భక్త జనులందరూ సర్వ కాల సర్వావస్థలలో తమను రక్షించమని కోరుతూ...
ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్
- అని శ్రీరామ ధ్యాన శ్లోకాన్ని పలుమార్లు పఠిస్తూ, శ్రీరామానుగ్రహాన్ని సదా పొందుతూ, సకల భీష్టా సిద్ధి పొందుతూ ధన్యులౌతు న్నారు.
'రా' కలుషంబులెల్ల బయలంబడద్రోచిన 'మా'క వాటమై
డీకొనిప్రోవుచునిక్క మనిధీయుతులెన్నఁదదీయ వర్ణముల్
గైకొని భక్తి చే నుడువఁగానరు గాక విపత్పరంపరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ
🌹భావం:
"రామా" అనే నామంలోని ”రా” అనే అక్షరాన్ని ఉచ్చరిస్తే అది దేహంలోని పాపాలన్నింటినీ (నాలుక ద్వారా) బయటకు నెట్టి వేయగా ‘మ’ అనే అక్షరాన్ని ఉచ్ఛరించగానే అది నోటిలో కవాటం వలె అడ్డుపడి బయట ఉన్న పాపాలను తిరిగి లోపలికి ప్రవేశించకుండా నిరోధిస్తుందని భక్త రామదాసు తన "దాశరథీ శతకం"లో ఎంతో రమణీయంగా పారమార్థికంగా పేర్కొన్నాడు.
అట్టి విశేషమైన తారక మంత్రమైన "శ్రీరామ" నామము వైభవాన్ని గూర్చి వాల్మీకి నుండి నేటి వరకు ఎందరో ఋషులు, మహా కవులు ప్రశంసించి కీర్తించడం జరిగింది.
🌹రామా (ర ఆ మా) నామంలో ర అక్షరం రుద్రుని, అ అక్షరం బ్రహ్మను, మ అక్షరం విష్ణువునీ సూచిస్తుందని,
అనగా రామనామం త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మ స్వరూపమని మహర్షులు పేర్కొన్నారు.
🌹ఈ తారక మంత్రాన్నే తారుమారుగా "మరామరా" అని పలికినా తుదకు ”రామా” నామ ధ్యాన తత్పరుడైన ఆ బోయవాడే ”ఆది కవి - వాల్మీకి” యై ”శ్రీ మద్రామాయణ” మహా కావ్య రచన చేసి, తాను తరించుటేకాక, సమస్త లోక వాసులను యుగయుగాలుగా తరింపజేసాడు.
సప్త కోటి మహా మంత్రాలలో మహోత్కృష్టమైనది రెండు అక్షరాల "రామ" నామమని మన మహర్షులు కొనియాడటం విశేషం.
మన తల్లులు కూడా పసిపిల్లలకు స్నానం చేయిస్తూ చివరిలో ‘శ్రీరామ రక్ష’ అని స్మరించి, దీవించటం కూడా గొప్ప విశేషం.
అందుకే సర్వ లోకాలకు ఆ దివ్య శ్రీరామ నామమే సర్వ జగత్తు.
అందుకే అట్టి దివ్య మహిమాన్వితమైనట్టి శ్రీ రామ నామాన్ని సదా ధ్యానించి తరించుదాం!!
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment