ఫాల్గుణపౌర్ణమి శ్రీ లక్ష్మీదేవి జయంతి🌹🙏

 🕉️⚜️🚩ఫాల్గుణపౌర్ణమి శ్రీ లక్ష్మీదేవి జయంతి🌹🙏


లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం

దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం

శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం


🌹కమలాలను రెండు చేతులతో ధరించి,

అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ,

గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది.

మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి.

ఐశ్వర్య ప్రదాయిని.

అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి.


⚜️🚩 ఫాల్గుణమాసంలో ఉత్తరఫల్గుణి నక్షత్రం వచ్చే రోజున లక్ష్మీజయంతి.

భృగుమహర్షి భార్య ఖ్యాతి.

ఆమె పత్రికా సంతానం కోసం తపస్సుచేస్తే ఆదిపరాశక్తి అంశతో భార్గవిగా జన్మించింది. 


⚜️🚩లక్ష్మీదేవి దివ్య అవతారం

ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు.

అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి,

భృగువు, ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది.

ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెండ్లి చేశాడు.

కనుక లక్ష్మీదేవిని "భార్గవి" అని కూడా అంటారు.


⚜️🚩తరువాత ఒకసారి దూర్వాసుని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదలి పాల సముద్రంలో నివసించింది.

అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగా చేయడం ప్రారంభించారు.

ఆ సమయంలో పాలసముద్రం నుండి కామదేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది.

పాలసముద్రంలో నుండి పుట్టింది కనుక ఆమె "సముద్రరాజ కుమార్తె" అయ్యింది.

ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మీకి సోదరుడయ్యాడు.

ధనాధి దేవత అయిన ఈ దేవిని శ్రీమహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు.

                     ⚜️🌺⚜️🌺⚜️🌺⚜️


⚜️🚩#అగస్త్య_కృత_లక్ష్మీ_స్తోత్రం🌹🙏


మాతర్నమామి కమలే కమలాయతాక్షి

శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాతః

క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ

లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే || 1 ||


త్వం శ్రీ రుపేంద్ర సదనే మదనైకమాతః

జ్యోత్స్నాసి చంద్రమసి చంద్ర మనోహరాస్యే

సూర్యే ప్రభాసి చ జగత్త్రితయే ప్రభాసి

లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే || 2 ||


త్వం జాతవేదసి సదా దహనాత్మ శక్తిః

వేధా స్త్వయా జగదిదం వివిధం విదధ్యాత్

విశ్వంభరోపి భిభ్రుభయాదఖిలం భవత్యా

లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే || 3 ||


త్వత్త్యక్తమేతదమలే హరతే హరోపి

త్వంపాసి హంసి విదధాసి పరావరాసి

ఈడ్యో బభూవ హరిరప్యమలే త్వదాప్త్యా

లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే || 4 ||


శూరః శ ఏవ శ గుణీ శ బుధః శ ధన్యో

మాన్యః శ ఏవ కులశీల కళాకలాపైః

ఏకః శుచిః స హి పుమాన్ సకలేపి లోకే

యత్రాపతేత్తవ శుభే కరుణా కటాక్షః || 5 ||


యస్మిన్ వసేః క్షణమహో పురుషే గజేశ్వే

స్త్రైణే తృణే సరసి దేవకులే గృహేన్నే

రత్నే పతత్త్రిణి పశౌ శయనే ధరాయాం

శ శ్రీకమేవ సకలే తదిహాస్తి నాన్యత్ || 6 ||


త్వ త్స్ప్రుష్టమేవ శకలం శుచితాం లభేత

త్వత్త్యక్త మేవ శకలం త్వశుచీహ లక్ష్మి

త్వ న్నామ యత్ర చ సుమంగళమేవ తత్ర

శ్రీ విష్ణు పత్ని కమలే కమలాలయేపి || 7 ||


లక్ష్మీ శ్రియంచ కమలం కమలాలయాంచ

పద్మాం రమాం నళినయుగ్మకరాం చ మాం చ

క్షీరోదజామమృత కుంభ కరామిరాంచ

విష్ణుప్రియా మితి సదా జపతాం క్వ దుఃఖం || 8 ||


⚜️🚩ఈ స్తోత్రమును భక్తితో పఠించు వారికి సంతాపము, దారిద్ర్యము, ప్రియ వియోగము, సంపత్తి క్షయము ఉండవు.

                        ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏