ఓం శ్రీ సాయి రామ్ గురు పాదాలు 🌹🙏

🌹ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹

⚜️🚩ఒక వ్యక్తి కొన్నిమాసాలపాటు ఉండటానికని శిరిడీ వచ్చాడు.
రహస్యంగానైనా సాయిమహరాజ్ ఫోటో ఒకటి తీయాలని అతని కోరిక.
ఒకసారి బాబా లెండీకి వెడుతూ సాఠేసాహెబ్ వాడా దగ్గర నిలుచునివున్నారు.
ఆ వ్యక్తి ఎవ్వరికీ తెలియకుండా బాబాను ఫోటో తీసాడు.
'నెగెటివ్' కడిగిచూస్తే బాబాకు దగ్గరగా నిలబడి ఉన్న వ్యక్తులందరూ ఫోటోలో పూర్తిగావచ్చారు కానీ,
బాబా ఉండాల్సినస్థానంలో బాబా పాదాలు మాత్రమే కన్పించాయి!
భక్తులు తమ గురుపాదాల మీదనే తమ దృష్టి నిలపాలని వేదాలలో చెప్పినదానిని ధృవపరుస్తుంది - యీ చక్కటి దృష్టాంతం.
దేహమంతా పాదాలను ఆధారం చేసుకొని నిలుస్తుంది.
అంటే పాదాలు మొత్తం శరీరానికి ఆధారం, ప్రతీక అన్నమాట.
మామూలుగా మన అలవాటు ప్రకారం శరీరాన్ని చూడటం కాక, గురుపాదాలమీదనే మన దృష్టిని నిలపాలి.
నీళ్ళలో నిలబడి చేపలు పడుతున్న జాలరి కాళ్ళ దగ్గరవున్న చేపలు ఎట్లాగైతే వలలో చిక్కుకోవో,
అలాగే భగవంతుని పాదాలను ఆశ్రయించినవారు 'మాయ' యొక్క వలలో చిక్కుపడరు.
🌹 సేకరణ

🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏