ఓం నమో వేంకటేశాయ 🙏
ఓం నమో వేంకటేశాయ 🙏
ప్రతీరోజు ప్రభాతవేళ శ్రావ్యంగా వినిపించే చరణాలతో ఆ దేవదేవుడినే కాదు సమస్త లోకాలను మేలుకొలుపుతుంది సుప్రభాతం.
కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం
మొత్తం సుప్రభాతం కంఠతా రాకున్నా ఈ రెండు చరణాలు తెలీని భక్తుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడేమో...
సామాన్యులమైన మనమే కాదు సకల దేవతలు కూడా ఈ సుప్రభాతంతో స్వామిని మేల్కొలుపుతారట.
సుందర మనోహరుడు... సర్వజగద్రక్షకుడు🙏 శ్రీనివాసుడిని మేల్కొలిపే ఈ సుప్రభాతాన్ని...
శ్రీవైష్ణవ భక్తాగ్రేసరుడైన ప్రతివాద భయంకర అణ్ణన్ రచించారు.
పూర్వం వేంకటేశ్వరస్వామికి సుప్రభాత వేళ ప్రత్యేకమైన అర్చన అంటూ లేకుండా అర్చక స్వాములచే ప్రబంధ పఠనం మాత్రం జరిగేది.
ఒకసారి "అణ్ణన్" తన గురువు శ్రీరంగం లోని ప్రధాన జీయర్ అయిన శ్రీవరవరముని తో కలిసి తిరుమల సందర్శించారు.
అక్కడ పరిస్థితి చూసిన గురువుగారి ఆదేశం మేరకు అణ్ణన్ అప్పటికప్పుడు ఆశువుగా శ్రీనివాసుని స్తుతిస్తూ...
సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనం పఠించాడు.
అణ్ణన్ పఠించిన ఆ సుప్రభాతమే ఈనాటివరకూ స్వామివారికి బంగారువాకిలి ఎదురుగా "తిరుమామణి మంటపం"లో పఠిస్తున్నారు.
ఈ సుప్రభాతంలోని మొదటి శ్లోకం రామాయణం లోనిది, తొమ్మిది, పది, పదమూడవ శ్లోకాలు "మార్కండేయ పురాణం" లోనివి అని అంటారు.
సుప్రభాతం కీర్తనలో నాలుగు భాగాలున్నాయి.
1) వేంకటేశ్వర సుప్రభాతం
2) వేంకటేశ్వర స్తోత్రం
3) వేంకటేశ్వర ప్రపత్తి
4) వేంకటేశ్వర మంగళాశాసనము
వేంకటేశ్వర సుప్రభాతం
దేవునికి మేలుకొలుపు - 29 శ్లోకాలు.
ఇది ప్రతివాద భయంకర అణ్ణన్ రచించిన భాగం.
శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలను ధరించిన శ్రీమహావిష్ణువు కలియుగంలో శ్రీవేంకటేశ్వరునిగా అవతరించి భక్తులను బ్రోచుచున్నాడని...
ఆ దేవదేవుని కొలిస్తే సకలార్ధ సిద్ధి కలుగుతుందని సుప్రభాత కీర్తనలో సూచింపబడుతున్నది.
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ॥ 1 ॥
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥
మాతస్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే ।
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం ॥ 3 ॥
తవ సుప్రభాతమరవింద లోచనే
భవతు ప్రసన్నముఖ చంద్రమండలే ।
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే
వృశ శైలనాథ దయితే దయానిధే ॥ 4 ॥
అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సంధ్యాం
ఆకాశ సింధు కమలాని మనోహరాణి ।
ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 5 ॥
పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః
త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి ।
భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 6 ॥
ఈశత్-ప్రఫుల్ల సరసీరుహ నారికేళ
పూగద్రుమాది సుమనోహర పాలికానాం ।
ఆవాతి మందమనిలః సహదివ్య గంధైః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 7 ॥
ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః
పాత్రావసిష్ట కదలీ ఫల పాయసాని ।
భుక్త్వాః సలీల మథకేళి శుకాః పఠంతి
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 8 ॥
తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా
గాయత్యనంత చరితం తవ నారదోఽపి ।
భాషా సమగ్ర మసత్-కృతచారు రమ్యం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 9 ॥
భృంగావళీ చ మకరంద రసాను విద్ధ
ఝుంకారగీత నినదైః సహసేవనాయ ।
నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 10 ॥
యోషాగణేన వరదధ్ని విమథ్యమానే
ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః ।
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 11 ॥
పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః ।
భేరీ నినాదమివ భిభ్రతి తీవ్రనాదం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 12 ॥
శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో ।
శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 13 ॥
శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః
శ్రేయార్థినో హరవిరించి సనందనాద్యాః ।
ద్వారే వసంతి వరనేత్ర హతోత్త మాంగాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 14 ॥
శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ।
ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 15 ॥
సేవాపరాః శివ సురేశ కృశానుధర్మ
రక్షోంబునాథ పవమాన ధనాధి నాథాః ।
బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 16 ॥
ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః ।
స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 17 ॥
సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి
స్వర్భానుకేతు దివిశత్-పరిశత్-ప్రధానాః ।
త్వద్దాసదాస చరమావధి దాసదాసాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 18 ॥
తత్-పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః
స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః ।
కల్పాగమా కలనయాఽఽకులతాం లభంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 19 ॥
త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః ।
మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 20 ॥
శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే
దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే ।
శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 21 ॥
శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్ధన చక్రపాణే ।
శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 22 ॥
కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే
కాంతా కుచాంబురుహ కుట్మల లోలదృష్టే ।
కల్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 23 ॥
మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్
స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర ।
శేషాంశరామ యదునందన కల్కిరూప
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 24 ॥
ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం
దివ్యం వియత్సరితు హేమఘటేషు పూర్ణం ।
ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః
తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతం ॥ 25 ॥
భాస్వానుదేతి వికచాని సరోరుహాణి
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః ।
శ్రీవైష్ణవాః సతత మర్థిత మంగళాస్తే
ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతం ॥ 26 ॥
బ్రహ్మాదయా స్సురవరా స్సమహర్షయస్తే
సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః ।
ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్తాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 27 ॥
లక్శ్మీనివాస నిరవద్య గుణైక సింధో
సంసారసాగర సముత్తరణైక సేతో ।
వేదాంత వేద్య నిజవైభవ భక్త భోగ్య
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 28 ॥
ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం
యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః ।
తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం
ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే ॥ 29 ॥
వేంకటేశ్వర స్తోత్రం
భగవంతుని కీర్తన - 11 శ్లోకాలు.
కమలాకుచ చూచుక కుంకుమతో
నియ తారుణి తాతుల నీలతనో
కమలాయత లోచన లోకపతే
విజయీ భవ వేంకటశైల పతే. (1)
స చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రము ఖాఖిలదైవత మౌళిమణే
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృషశైల పతే. (2)
అతి వేలతయా తవ దుర్విషహై
రనువేలకృతైరపరాధ శతైః
భరితం త్వరితం వృషశైలపతే
పరయా కృపయా పరిపాహి హరే. (3)
అధి వేంకటశైల ముదారమతే
ర్జన తాభిమ తాధిక దాన రతాత్
పర దేవతయా కథితా న్నిగమైః
కమలా దయితా న్న పరం కలయే. (4)
కలవేణు రవా వశ గోపవధూ
శతకోటి వృతా త్స్మరకోటి సమాత్
ప్రతిపల్ల వికాభిమతా త్సుఖదాత్
వసుదేవసుతాన్న పరం కలయే. (5)
అభిరామ గుణాకర దాశరథే
జగదేక ధనుర్ధర ధీరమతే
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయాజలధే. (6)
అవనీ తనయా కమనీయకరం
రజనీకర చారు ముఖాంబురుహమ్
రజనీచర రాజ తమోమిహిరం
మహనీయ మహం రఘురామ మయే. (7)
సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుఖాయ మమోఘ శరమ్
అసహాయ రఘూధ్వ మహన్య మహం
న కథంచన కంచన జాతు భజే. (8)
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. (9)
అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ. (10)
అజ్ఞానినా మయా దోషా
నశేషా న్విహితాన్ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం
శేషశైల శిఖామణే. (11)
వేంకటేశ్వర ప్రపత్తి
భగవంతునికి శరణాగతి - 16 శ్లోకాలు.
శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రపత్తి అనేది చాలా ముఖ్యమైన అంశం.
గురువులకు, భగవంతునికి సంపూర్ణంగా శరణాగతులవడం ప్రపత్తి లక్షణం.
ఈశానం జగతోస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీమ్
తద్వక్షస్థ్సల నిత్యవాసర సికాం తత్ క్షాంతి సంవర్థనీమ్
పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్. (1)
శ్రీమన్ కృపాజలనిధే కృతసర్వలోక
సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్
స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. (2)
ఆనూపు రార్చిత సుజాత సుగంధి పుష్ప
సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ
సౌమ్యౌ సదానుభవనే పి నవానుభావ్యౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. (3)
సద్యో వికాసి సముదిత్త్వర సాంద్రరాగ
సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తామ్
సమ్యక్షు సాహస పదేషు విలేలయంతౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. (4)
రేఖామయ ధ్వజ సుధా కలశాత పత్ర
వజ్రాంకుశాంబురహ కల్పక శంఖ చక్రైః
భవ్యై రలంకృత తలౌ పరతత్త్వ చిహ్నైః
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. (5)
తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ
బాహ్మై ర్మహోభి రభిభూత మహేంద్రనీలౌ
ఉద్య న్నఖాంశుభి రుదస్త శశాంకభాసౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. (6)
స ప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం
సంవాహనేపి సపది క్లమ మాదధానౌ
కాంతావవాఙ్మనసగోచర సౌకుమార్యౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. (7)
లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ
నీలాది దివ్య మహిషీ కరపల్లవానామ్
ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్రరాగౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. (8)
నిత్యా నమద్విధి శివాది కిరీటకోటి
ప్రత్యుప్త దీప్త నవరత్న మహః ప్రరోహైః
నీరాజనా విధి ముదార ముపాదధానౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. (9)
విష్ణోః పదే పరమ" ఇత్యుదిత ప్రశంసౌ
యౌ మధ్వఉత్స' ఇతి భోగ్యతయా 7ప్యుపాత్తౌ
భూయ స్తథేతి తవ పాణితలౌ ప్రతిష్ఠౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. (10)
పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ
యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి
భూయోపి మహ్య మిహ తౌ కరదర్శితౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. (11)
మున్మూర్ధ్ని కాళియఫణే వికటాటవీషు
శ్రీ వేంకటాద్రి శిఖరే శిరిసి శ్రుతీనామ్
చిత్తే ప్యనన్య మనసాం సమమాహితౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. (12)
ఆవ్లూన హృష్య దవనీతల కీర్ణ పుష్పౌ
శ్రీ వేంకటాద్రి శిఖరా భరణాయమానౌ
ఆనంది తాఖిల మనోనయనౌ తవైతౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. (13)
ప్రాయః ప్రసన్న జనతా ప్రథమావగాహ్యౌ
మాతుః స్తనావివ శిశో రమృతాయమాణౌ
ప్రాప్తౌ పరస్పర తులా మతులాంతరౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. (14)
సత్త్వోత్తరై స్సతత సేవ్యపదాంబుజేన
సంసార తారక దయార్ద్ర దృగంచలేన
సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. (15)
శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయభావే
ప్రాప్యే త్వయి స్వయముపే యతయా స్ఫురంత్యా
నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం
స్యాం కింకరో వృషగిరీశ నజాతు మహ్యమ్. (16)
వేంకటేశ్వర మంగళాశాసనము
పూజానంతరము జరిపే మంగళము - 14 శ్లోకాలు. ఈ భాగాన్ని "మణవాళ మహాముని" రచించారు అంటారు.
శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్.
లక్ష్మీ సవిభ్రమాలోక సభ్రూ విభ్రమ చక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్.
శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభర ణాంఘ్రయే
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్.
సర్వావయవ సౌందర్య సంపదే సర్వచేతసాం
సదా సమ్మోహనా యాస్తు వేంకటేశాయ మంగళమ్.
నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే
సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్.
స్వత స్సర్వ విదే సర్వశక్తయే సర్వ శేషిణే
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్.
పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్.
కాల తత్త్వ విశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్
అతృప్త్యమృత రూపాయ వేంకటేశాయ మంగళమ్.
ప్రాయః స్వ చరణౌ పుంసాం శరణ్య త్వేన పాణినా
కృపయా దృశ్యతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్.
దయామృత తరంగిణ్యా స్తరంగై రివ శీతలైః
ఆపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్.
స్ర గ్భూషాంబర హేతీనాం సుష మావహ మూర్తయే
సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్.
శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్.
శ్రీమత్సుదరజామాతృ మునిమానస వాసినే
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్.
నమ శ్శ్రీవేంకటేశాయ శుద్ధజ్ఞాన స్వరూపిణే
వాసుదేవాయ శాంతాయ వేంకటేశాయ మంగళమ్.
మంగళా శాసన పరై ర్మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వై రాచార్యై స్సత్కృపాయాస్తు మంగళమ్.
సంసార సాగర సముత్తరణైక సేతో
అన్నట్లుగా...
కుడిహస్తముతో తన పాదములను చూపుతూ, వీటిని శరణువేడితే చాలు, మీ సంసార సాగరాన్ని మోకాళ్ళ లోతు మాత్రమే చేసి సులభముగా దాటిస్తాననే అభయహస్త సందేశం ఇస్తుండగా...
కుడి హస్తంతో, నా పాదాలను శరణువేడితే ఎడమ చేతితో నిను నా అక్కున చేర్చుకుంటానన్న సూచన ఉంది.
-- సత్య వాడపల్లి
Comments
Post a Comment