శ్రీ సూర్యం ప్రణమామ్యహం

 శ్రీ సూర్యం ప్రణమామ్యహం🙏

ఆదిత్యుడు ప్రతిరోజూ ఉదయిస్తాడు. 

లోకయాత్ర సాగిస్తాడు. 

జగత్తుకు వెలుగును ప్రసాదిస్తూ, సమస్త జీవరాశినీ కర్మలకు ప్రేరేపిస్తూ, తాను సాక్షిగా ఉన్నాడు. 

అందుకే ఆయన ‘కర్మసాక్షి


జగత్తుకే నేత్రంగా ఉండడం వల్ల ఆయన జగచ్ఛక్షువు.

లోక బాంధవుడు... ప్రత్యక్ష దైవం...

సమయపాలనా చక్రవర్తి... ఆరోగ్యదాత... అభయప్రదాత.


సృష్టికి పూర్వం నుంచీ ఉండడం వల్ల ఆదిదేవుడు.


ఏకో అశ్వో సప్తమాన

సూర్యుని రథాశ్వం ఒక్కటే.. అదే ‘సప్త’ 

‘సప్త’ అనేది సూర్య రథానికి పేరు. అదే అశ్వం. 

అంతే కాని ఏడు అశ్వాలు లేవన్నది ఒక అభిప్రాయం.

 ఆ సప్తకు ఒకే చక్రం. 

అది సంవత్సరానికి సంకేతం. ఆ చక్రానికి ఉన్న ఆరు ఆకులు... ఆరు ఋతువులకు చిహ్నాలు. 


సూర్యుని కిరణాలలోంచీ ప్రధానంగా ఏడు కిరణాలు వెలువడతాయి. అవి...

సుషుమ్నం, హరికేశం, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాస్యం, విశ్వస్రవ, సర్వాద్వసు.


అసేవా ఆదిత్య ఏషోశ్వః

ఆదిత్యుడే అశ్వమనీ, ఆదిత్య మండలమే రథమనీ భావం.


బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరః

సాయం ధ్యాయే మహా విష్ణుం, త్రయీ మూర్త దివాకరః


సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపం గా, ప్రకృతిలో జీవాన్ని నింపి...

మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టి యొక్క దైవిక వికారాలను రూపు మాపి...

సాయంకాలం విష్ణురూపం గా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ప్రత్యక్షదైవం. 


సూర్య’ అనే పదానికి 

సువతి ప్రేరయతి వ్యాపారేష్యితి సూర్యః 

అని వ్యుత్పత్తి. 

అంటే ‘అందరినీ వారి వారి కర్మలు చేయడానికి ప్రేరేపించేవాడు’ అని అర్థం.

రవి’ అని మరో పేరు. ‘స్తుతింపబడేవాడు’ అని భావం. 

జగత్తుకు చైతన్యస్ఫూర్తిని కలిగించేవాడు సూర్యనారాయణుడు. ఆయన జగదారాధ్యుడు.


ఆదిత్యశ్చ నమస్కారం యే కుర్వంతి దినే దినే

 జన్మాంతర సహస్రేషు దారిద్య్రం నోపజాయతే


ఆదిత్యునికి నమస్కరిస్తే జన్మ జన్మాల పాపాలు పటాపంచలవుతాయి అని అర్థం.


చక్షో సూర్యో అజాయతే

"సాధారణ చక్షువులతో ఇతరులు చూడడానికి వీలుకానివాడు" అని అర్థం.


భగవద్గీత లోని విభూతి యోగంలో 

ఆదిత్యానాం మహా విష్ణుః

అనగా సూర్యుడు సాక్షాత్‌ నారాయణుడు అనీ, 


జ్యోతిషాం రవి రంశుమాన్‌

ప్రకాశించేవారందరిలో ప్రధానుడు అనీ #శ్రీకృష్ణుడు ఆదిత్యుడి మహిమను తెలిపాడు.


శంకర భగవత్పాదులు...

"ఆదిత్యం, అంబికాం, విష్ణు, గణనాథం చ, ఈశ్వరం" అని...పంచాయతన అర్చనా విధానాన్ని ఏర్పరచి, #ప్రభాకరుణ్ణి ప్రధాన దైవంగా పేర్కొన్నారు.

ప్రత్యక్షంగా మన కంటికి కనపడే ఏకైక దైవం.


                 

సూర్యాష్టకం


ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర

దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే


సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం

శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం

మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం

మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ

ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం


బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం

ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం

మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం

మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం

అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్


ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే

సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా


స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే

న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి


ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం.

                                                         -- సత్య వాడపల్లి


             

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు