Posts

💥🌺🌹మంగళగౌరీ నోము🌹🌺💥

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 💥 🌺🌹మంగళగౌరీ నోము 🌹🌺💥 💥"వరలక్ష్మీ వ్రతం" తరువాత శ్రావణ మాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం "మంగళ గౌరీ వ్రతం" దీనిని "శ్రావణ మంగళవార వ్రతం" అని,"మంగళ గౌరీ నోము" అని కూడా పిలుస్తుంటారు. మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తే.. మహిళలు తమ "ఐదవతనం" కలకాలం నిలుస్తుందని కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్ముతారు. అందుకనే శ్రావణ మాసములో ఎన్ని మంగళవారములు వస్తాయో అన్ని మంగళవారాలు వ్రతం ఆచరిస్తూ.. మంగళగౌరిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ మంగళ గౌరీ వ్రతాన్ని పెళ్లి అయిన స్త్రీలు ఐదు సంవత్సరాలు చేస్తారు. వివాహం ఐన మొదటి సంవత్సరము పుట్టినింటిలోనూ.. తరువాత నాలుగేళ్లు అత్తారింటిలోను ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి అని పండితులు చెబుతున్నారు. వ్రత విధానం ఏంటంటే..? శ్రావణ మంగళవారం వ్రతం ఆచరించేవారు మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువులనీ, రెండవ సంవత్సరం పదిమందినీ, మూడో యేడు పదిహేను మందినీ, నాలుగో ఏట ఇరవై మందినీ, అయిదవ సంవత్సరం ఇరవై అయిదు మంది ముత్తయిద...

మహా మృత్యుంజయ మంత్రము

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 మానవుడి ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది మహా మృత్యుంజయ మంత్రం. ఇది శుక్లయజుర్వేద మంత్రం. మహా మృత్యుంజయ మంత్రము ఋగ్వేదం (7.59.12) లోని 7వ మండలం, 59 వ సూత్రంలో 12 వ మంత్రంగా వస్తుంది. దీనినే "త్ర్యంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు.  శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాచరాత్ర దీక్షలో హోమ భస్మధారణ మంత్రంగా చెప్పుకుంటారు. ఈ మంత్రం పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనంలో జనించిన హాలాహలాన్ని పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని విశ్వాసం. ఇది ఒక విధమైన సంజీవని మంత్రం అని చెప్పుకోవచ్చు. ఆపదలు కలిగినపుడు, అనూహ్య సమస్యలు ఎదురైనప్పుడు కూడా దీనిని చదువుకోవచ్చును. ఈ మంత్రానికి సర్వ రోగాలను తగ్గించే శక్తి ఉంది. ఈ మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాల మృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. 💥...

💥లక్ష్మీ ప్రదమైన మాసం "శ్రావణమాసం"

Image
 ⚜️🕉️🚩ఓం నమః శివాయ 🌹🙏 💥 లక్ష్మీ ప్రదమైన మాసం "శ్రావణమాసం " సకల దేవతలకు ప్రీతికరమైనది శ్రావణమాసం. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రము (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు) కావున శ్రావణము. కలియుగదైవం "శ్రీవేంకటేశ్వరుడు" జన్మించిన శ్రావణా నక్షత్రం పేరులో వచ్చే ఈ మాసమంటే శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. స్కాంద పురాణంలో శ్రావణ వైభవాన్ని పరమేశ్వరుడు స్వయంగా ప్రకటించాడు. "ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః" అంటే ‘పన్నెండు నెలల్లో శ్రావణ మాసం శివరూపం, సాక్షాత్తు నేనే శ్రావణ మాసం’ అని సనత్కుమార మహర్షికి చెబుతాడు పరమేశ్వరుడు. మహర్షి కోరిక మేరకు శ్రావణమాస మాహాత్మ్యాన్ని 24 అధ్యాయాలలో వివరించాడు పరమ శివుడు. తన స్వరూపమైన శ్రావణ శోభను చూసి తరించేందుకు నాలుగు ముఖాలతో బ్రహ్మ, వెయ్యి కండ్లతో ఇంద్రుడు సిద్ధంగా ఉంటారని శివుడు పేర్కొన్నాడు. అంతేకాదు, ఆదిశేషుడు వెయ్యి నాలుకలతో మహేశ్వరుడి గొప్పదనాన్ని శ్లాఘిస్తూ ఉంటాడట. వేదాలు శ్రావణాన్ని "నభో" మాసమని పేర్కొన్నాయి. నభస్‌ అంటే ఆకాశమని ...

💥ప్రతి రోజు స్నానానంతరం పఠించాల్సిన సూర్య భగవానుడి స్తోత్రం...

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః 🌹🙏 💥సాక్షాత్తు శ్రీకృష్ణుడి కొడుకైన సాంబుడు సూర్యుడిని ఆరాధించినట్లు ప్రతీతి. ఇతడు శ్రీకృష్ణుడికి జాంబవతి వల్ల పుట్టిన కొడుకు. ముని శాపం వల్ల కుష్టు వ్యాధి గ్రస్థుడయ్యాడు. సూర్యుడిని ఆరాధించి రోగ విముక్తుడయ్యాడు.  కుష్టువ్యాధిగ్రస్థుడైన సాంబుడు సూర్యుడి కోసం పన్నెండేళ్లు కఠోర తపస్సు చేశాడు. సూర్యుడు కరుణించడంతో రోగ విముక్తి పొందాడు. సూర్యసాక్షాత్కారం జరిగిన తర్వాత సూర్య సహస్ర నామాల కంటే మించిన 21 నామాలను సాంబుడికి సూర్యుడు ఉపదేశిస్తాడు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఎదురుగా నిలబడి వీటిని భక్తితో చదివితే వారికి అనారోగ్య సమస్యలు రావు. వచ్చిన వారికి వాటి నుంచి విముక్తి లభిస్తుందని భవిష్యపురాణం పేర్కొంది. 💥ప్రతి రోజు స్నానానంతరం పఠించాల్సిన సూర్య భగవానుడి స్తోత్రం... వికర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవిః లోకప్రకాశకః శ్రీమాన లోక చక్షుర్గ్రహేశ్వరః లోకసాక్షీ త్రిలోకేశః కర్తా హర్తా తమిస్రహా తపన స్తాపనశ్చైవ శుచి స్సప్తాశ్వవాహనః గభస్తిహస్తో బ్రహ్మా చ సర్వదేవనమస్కృతః ఏకవింశతి రిత్యేషస్తవ ఇష్టస్సదా మమ శరీరారోగ్యద శ్చ...

💥దశావతారస్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥"దశావతార స్తోత్రం" శ్రీ మహావిష్ణువును కీర్తించే అద్భుతమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని  విన్నా, చదివినా నారాయణ అనుగ్రహం లభించి ఆయురారోగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయి అని పురాణాలలో చెప్పబడింది. 💥 దశావతారస్తోత్రం 💥 నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే | రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే || వేదోద్ధారవిచారమతే సోమకదానవసంహరణే మీనాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || 1 || రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే | రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే || మంథానాచలధారణహేతో దేవాసుర పరిపాల విభో కూర్మాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || 2 || రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే | రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే || భూచోరకహర పుణ్యమతే క్రీఢోద్ధృతభూదేశహరే క్రోఢాకార శరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || 3 || రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే | రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే || హిరణ్యకశిపుచ్ఛేదనహేతో ప్రహ్లాదాఽభయధారణహేతో నరసింహాచ్యుతరూప నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || 4 || రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే | ...

💥అష్టాదశ శక్తిపీఠ స్తోత్రము💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా | నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమ: || 💥ఈ సృష్టిలో అణువు అణువు అమ్మవారి ప్రతిరూపమే. ఓంకారం నుండి ఈ సృష్టి ఉద్భవించింది అనుకుంటే ఆ ఓంకారాన్ని సృష్టించిన శక్తే జగన్మాత. అందుకే ఆమె సృష్టి లయకారిణి, జగదేకస్వరూపిణి, సకల చరాచరణిగా భక్తుల పూజలందుకుంటూ జగన్మాతగా విరాజిల్లుతుంది. జగన్మాత పార్వతి "సతీదేవి" అంశతో పునర్జన్మించిందని పురాణ వర్ణన. ఆ సతీదేవి ఆత్మార్పణ సందర్భంలో శరీర భాగాలు, ఆభరణాలు పడిన ప్రాంతాలే దివ్యక్షేత్రాలై శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి. శక్తి పీఠాలు గురించి తెలుసుకోవాలంటే ఆ శక్తి పీఠాలు ఏర్పడడానికి కారణమైన ఈ కథ గురించి తెలుసుకోవాలి. బ్రహ్మ కుమారుడైనా "దక్షప్రజాపతి" ఒకరోజు బృహస్పతి యాగం తలపెట్టాడు. ఆ యజ్ఞానికి త్రిలోకాలలో ఉన్న ప్రసిద్ధులందరిని ఆహ్వానించాడు. కానీ తన కూతురైన సతీదేవినీ, అల్లుడైన శివుడిని మాత్రం పిలువలేదు. ఎందుకంటే తండ్రి (దక్షుని) మాటని వ్యతిరేకించి శివుడిని పెళ్ళాడింది సతీదేవి. అప్పటి నుండి సతీదేవి మీద కోపంతో ఆమెని చూడటానికి కూడా దక్షప్రజాపతి ఇష్టపడలేదు. తండ్రి యజ్ఞం తలపె...

⚜️🕉️🚩 ఓం శ్రీ మహలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమామ్ । పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీమ్ ॥  💥"శ్రీ మహాలక్ష్మి" శ్రీమన్నారాయణుని మనోల్లాసిని. మనకు సకల శుభములు కలిగించి సకల సంపదలను ఇచ్చే తల్లి.  ధనము, ధాన్యము, విద్య, ధైర్యము, సంతానము, జ్ఞానము, వైరాగ్యము, ఆరోగ్యము, వీరత్వము మొదలైన సిరులనిచ్చి మన బాగోగులను చూస్తూ మనలను ఐశ్వర్యవంతులను చేసి బ్రోచే విష్ణు వల్లభ. తన తోబుట్టువులైన చంద్రుడు, అమృతముల వలె చల్లదనము, అమృతత్వము మనకి పంచి మనని దివ్యులను చేసే దేవి. శ్రీ పీఠమునలంకరించి సురలచేత పూజించబడే దివ్య. శ్రీ మహాలక్ష్మి మంత్రమూర్తి. ఎల్లప్పుడూ జ్ఞానముతో వెలుగుతూ ఉంటుంది. ఆమె మాహా మాయ కూడాను. ఇక్కడ మాయ అంటే మనచ్ఛక్తి వైష్ణవీ రూపంలో సకల జనులను, చరాచర ప్రపంచమును స్థావర జంగమములను కాచే విష్ణు యువతి మహాలక్ష్మి. మన పాపములన్నిటిని హరించే కరుణా సాంద్ర. ఆమె సర్వజ్ఞురాలు. వరములనిచ్చేది. దుష్టనాశనము చేసి మన దు:ఖములను పోగొడుతుంది. ఆమె సిద్ధి, బుద్ధులను, భక్తి, ముక్తులను ప్రసాదించే తల్లి. శ్రీ మహాలక్ష్మి ఆది అంతములు లేని శాశ్వత. ఆమె మూలశక్తి. ఆమె యోగజ్ఞ. ...