💥🌺🌹మంగళగౌరీ నోము🌹🌺💥
⚜️🕉️🚩ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
💥🌺🌹మంగళగౌరీ నోము🌹🌺💥
💥"వరలక్ష్మీ వ్రతం" తరువాత శ్రావణ మాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం "మంగళ గౌరీ వ్రతం" దీనిని "శ్రావణ మంగళవార వ్రతం" అని,"మంగళ గౌరీ నోము" అని కూడా పిలుస్తుంటారు.
మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తే.. మహిళలు తమ "ఐదవతనం" కలకాలం నిలుస్తుందని కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్ముతారు. అందుకనే శ్రావణ మాసములో ఎన్ని మంగళవారములు వస్తాయో అన్ని మంగళవారాలు వ్రతం ఆచరిస్తూ.. మంగళగౌరిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
ఈ మంగళ గౌరీ వ్రతాన్ని పెళ్లి అయిన స్త్రీలు ఐదు సంవత్సరాలు చేస్తారు. వివాహం ఐన మొదటి సంవత్సరము పుట్టినింటిలోనూ.. తరువాత నాలుగేళ్లు అత్తారింటిలోను ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి అని పండితులు చెబుతున్నారు.
వ్రత విధానం ఏంటంటే..?
శ్రావణ మంగళవారం వ్రతం ఆచరించేవారు మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువులనీ, రెండవ సంవత్సరం పదిమందినీ, మూడో యేడు పదిహేను మందినీ, నాలుగో ఏట ఇరవై మందినీ, అయిదవ సంవత్సరం ఇరవై అయిదు మంది ముత్తయిదువులనూ పిలిచి, పసుపు రాసి, బొట్టు పెట్టి, కాటుకిచ్చి, శనగలూ అరటిపండు, తాంబూలంతో వాయనాలిస్తారు.. కుదిరితే అందరి ముత్తైదువలను ఇంటికి పిలిచి వాయినాలు ఇస్తారు. లేదంటే వారి ఇంటికే వెళ్లి వాయినాలు ఇస్తూ ఉంటారు.
కొత్తగా పెళ్ళైన అమ్మాయి శ్రావణ మంగళవార నోము పట్టి అన్ని మంగళ వారాలు గౌరీ దేవికి పూజలు చేసి నానబోసిన సెనగలు, పళ్ళు తాంబూలంలో పెట్టి ముత్తైదువులకు వాయనమిస్తారు.
పసుపు తోరణాలు తయారు చేసుకొని వాటిని కలశం పై ఉంచి పూజ చేసి మంత్ర విధిగా కట్టుకొంటారు. కుడుములు చేసి నైవేద్యం పెడతారు. ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి తలలో పెట్టుకోవటానికి పూలమాలతో సత్కరించి ఆశీస్సులు అందుకుంటారు.
కత్తికి గంధం రాసి, ఆవునేతితో జ్యోతులు వెలిగించి, పాటపాడుతూ ఆ కత్తి జ్యోతులపై ఉంచి మసిబారేట్లు చేసి, కాటుక తయారు చేసి తాము కళ్ళకు పెట్టుకొని ముత్తైదువులకూ ఇవ్వటం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.
మంగళ గౌరీ వ్రతం మొదలు పెట్టిన తర్వాత అయిదేళ్లు అయ్యాక.. ముప్ఫయి మూడు జతల అరిసెలను ఒక కొత్త కుండలో పెట్టి, ఆ పైన కొత్త రవికెల గుడ్డతో వాసెన గట్టి.. మట్టెలు, మంగళసూత్రాలు, గాజులు, పసుపు, కుంకుమ.. తదితర మంగళకరమైన వస్తువులను పెట్టి.. పెళ్ళి కూతురుకు వాయనమియ్యాలి. పద్ధతి లోపించినా ఫలితం లోపించదు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment