💥అష్టాదశ శక్తిపీఠ స్తోత్రము💥

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏


యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |

నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమ: ||


💥ఈ సృష్టిలో అణువు అణువు అమ్మవారి ప్రతిరూపమే. ఓంకారం నుండి ఈ సృష్టి ఉద్భవించింది అనుకుంటే ఆ ఓంకారాన్ని సృష్టించిన శక్తే జగన్మాత. అందుకే ఆమె సృష్టి లయకారిణి, జగదేకస్వరూపిణి, సకల చరాచరణిగా భక్తుల పూజలందుకుంటూ జగన్మాతగా విరాజిల్లుతుంది.


జగన్మాత పార్వతి "సతీదేవి" అంశతో పునర్జన్మించిందని పురాణ వర్ణన.


ఆ సతీదేవి ఆత్మార్పణ సందర్భంలో శరీర భాగాలు, ఆభరణాలు పడిన ప్రాంతాలే దివ్యక్షేత్రాలై శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి. శక్తి పీఠాలు గురించి తెలుసుకోవాలంటే ఆ శక్తి పీఠాలు ఏర్పడడానికి కారణమైన ఈ కథ గురించి తెలుసుకోవాలి.


బ్రహ్మ కుమారుడైనా "దక్షప్రజాపతి" ఒకరోజు బృహస్పతి యాగం తలపెట్టాడు. ఆ యజ్ఞానికి త్రిలోకాలలో ఉన్న ప్రసిద్ధులందరిని ఆహ్వానించాడు. కానీ తన కూతురైన సతీదేవినీ, అల్లుడైన శివుడిని మాత్రం పిలువలేదు.


ఎందుకంటే తండ్రి (దక్షుని) మాటని వ్యతిరేకించి శివుడిని పెళ్ళాడింది సతీదేవి. అప్పటి నుండి సతీదేవి మీద కోపంతో ఆమెని చూడటానికి కూడా దక్షప్రజాపతి ఇష్టపడలేదు.


తండ్రి యజ్ఞం తలపెట్టాడని తెలుసుకున్న సతీదేవి పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవడం ఏంటి నేనే వెళతాను అని శివుడు వద్దంటున్న వినకుండా ప్రమాద ఘడియలు వెంటబెట్టుకొని వెళుతుంది.


భర్త మాట కాదని వచ్చిన సతీదేవి అక్కడ అనేక అవమానాలకు గురి అవుతుంది. దక్షప్రజాపతి తననే కాకుండా తన భర్త శివుడిని కూడా అక్కడ ఉన్న వాళ్ళ ముందు లేని పోని నిందలు వేసి అవమానిస్తాడు.


భర్తని అవమానిస్తుంటే తట్టుకోలేక తన కాలి బొటన వేలుని గీటగా ఏర్పడ్డ అగ్నిగుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంటుంది.


విషయం తెలుసుకున్న త్రినేత్రుడు ఆవేశపూరితుడై తన జటాజూటం నుండి వీరభద్రుడిని సృష్టించి తన భార్య అకాల మరణానికి కారణమైన ఆ యజ్ఞాన్ని నాశనం చేస్తాడు.


కానీ సతివియోగ దు:ఖం తీరని శివుడి ఆహుతిలో దగ్ధమైన ఆమె మృతదేహాన్ని తన భుజాన ధరించి మహా ఉగ్రతాండవం చేస్తుంటే ఆ రుద్ర తాండవానికి ముల్లోకాలు కంపించిపోతాయి.


శివుడు తాను చేయవలసినిన కర్తవ్య కార్యక్రమాలను మరచి ఉగ్రతాండవం చేస్తుంటే ఇబ్బందులు పడుతున్న దేవతలు అందరు విష్ణువుని ప్రార్థించగా విష్ణువు ప్రత్యక్షమై శివుడిని శాంతింప చేసి తన సుదర్శన చక్రంతో సతిదేవీ దేహాన్ని ముక్కలుముక్కలుగా చేసి భూమండలంలో వివిధ ప్రదేశాలలో పడేట్లు చేస్తాడు.. 


అలా సతీదేవి శరీర భాగాలూ, ఆభరణాలు పడిన చోట ఒక పుణ్యక్షేత్రంగా వెలిసి శక్తి పీఠాలుగా భక్తుల పూజలందుకొంటు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి.


💥అష్టాదశ శక్తిపీఠ స్తోత్రము💥


లంకాయాం శాంకరీదేవీ కామాక్షీ కాంచికాపురే ।

ప్రద్యుమ్నే శృంఖళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే ॥ 1 ॥


అలంపురే జోగుళాంబా శ్రీశైలే భ్రమరాంబికా ।

కొల్హాపురే మహాలక్ష్మీ ముహుర్యే ఏకవీరా ॥ 2 ॥


ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతికా ।

ఓఢ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటికే ॥ 3 ॥


హరిక్షేత్రే కామరూపీ ప్రయాగే మాధవేశ్వరీ ।

జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగళ్యగౌరికా ॥ 4 ॥


వారణాశ్యాం విశాలాక్షీ కాశ్మీరేతు సరస్వతీ ।

అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్ ॥ 5 ॥


సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనమ్ ।

సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభమ్ ॥ 6 ॥

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥