సుబ్రహ్మణ్యుని అష్టకం💥
⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏
అవిద్య మరియు జ్ఞానము, దేవతలు మరియు అసురుల మధ్య జరిగే నిరంతర యుద్ధము, వాటి పరిణామమైన దైవిక శక్తుల విజయం - ఇదే సుబ్రహ్మణ్యుని లీలల సారము.
స్కందుని జననం గురించి శ్రీమద్రామాయణం లో వాల్మీకి మహర్షి వివరంగా చెప్పారు. శివుని తేజస్సు (వీర్య రూపంలో) ఆయన ఆజ్ఞా చక్రమునుండి పెల్లుబుకి స్కందుని రూపము పొందినదట. అందుకనే స్కందుడు జ్ఞాన జ్యోతిగా ప్రతీక. శరవణమను సరస్సులో రెల్లు గడ్డి పెరిగే చోటనున్న ఆరు కమలముల నుండి పార్వతీ దేవి ఈ స్కందుని తీసుకున్నదట.
సర్వోన్నత ఆధ్యాత్మిక అనుభూతి (అపరోక్షానుభూతి) అనేది యోగములో షడ్చక్రముల భేదన ద్వారా కలుగుతుంది. ఈ ఆరు చక్రముల భేదన ద్వారా జీవ శక్తి సహస్రార చక్రమున పూర్ణ యొక స్థితిని అనుభూతి పొందుతుంది. దీనికి సంకేతమైన ఆరు కమలములనుండి ఆవిర్భవించిన స్కందుడు సర్వోన్నత జ్ఞానమునకు, బుద్ధికి ప్రతీకగా నిలిచాడు. అందుకనే స్కందుడు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే (ఈ ప్రపంచములో అజ్ఞాన రూపమైన అసురులను సంహరించే దైవిక శక్తి) పరిపూర్ణ జ్ఞాన స్వరూపముగా కొలవబడుతున్నాడు.
కుమార, కార్తికేయ, సుబ్రహ్మణ్య, షణ్ముఖ మొదలైన నామములతో పిలవబడే స్కందుడు పరమశివుని రెండవ పుత్రుడు. కోడి పుంజు (కుక్కుటం) ఇతని ధ్వజము, నెమలి ఇతని వాహనము. ఈయన శక్తులు (పత్నులు) వల్లి మరియు దేవసేన.
తన తపస్సు చేయుచుండగా భంగము చేయ వచ్చిన మన్మథుని శివుడు తన మూడో నేత్రముతో దగ్ధము చేస్తాడు. ఆ అగ్నిని అగ్నిదేవుడు, వాయుదేవుడు ఆకాశ మార్గమున గంగానదిలో పడవేస్తారు. దాని తేజోశక్తిని భరించలేక గంగాదేవి దానిని ఒడ్డున ఉన్న రెల్లుగడ్డిలోకి నెడుతుంది. ఆ విధముగా పంచ భూతముల శక్తితో శివుని దివ్య తేజము ఏకమై ఆరు ముఖములు గల స్కందునిగా జన్మిస్తాడు.
జ్ఞాన రూపమైన శివుని మూడో నేత్రమునుండి జన్మించిన వాడు కాబట్టి కార్తికేయుడు జ్ఞానావతారునిగా పేరు పొందాడు. ఇతని ఆయుధము శూలము. కేవలము స్కందుడు మాత్రమే అసురులైన శూరపద్ముడు, సింహముఖుడు, తారకుడు సంహరించగలడని బ్రహ్మ తనను వేడుకో వచ్చిన దేవతలకు తెలుపుతాడు. అప్పుడు స్కందుడు దేవతల సేనకు అధిపతి అవుతాడు. అప్పటినుంచి అతను సేనాపతిగా కూడా పిలవబడ్డాడు. స్కందుడు అసురులను జయించే వృత్తాంతాన్ని స్కాందపురాణంలో వివరించ బడింది. ఈ అసురులను జయించే రోజునే స్కంద షష్టిగా పూజించబడుతున్నది.
శ్రీ గాంగేయం వహ్నిగర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం
బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమల గుణం రుద్ర తేజస్వరూపం
సేనాన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాన్యం
సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథ సహితం దేవదేవం నమామి
గంగాదేవి శివుని శక్తిని కొంత సేపు మోసి, శక్తిని భరించ లేక రెల్లు గడ్డిలోకి త్రోయటంవలన గాంగేయుడు అని, అగ్ని శివుని శక్తిని తన వద్ద ఉంచుకొని గంగలో విడుచుట వలన అగ్నిగర్భుడని, జ్ఞాన శక్తి పరబ్రహ్మమని, గుహుడని, అమలమైన గుణము కలవాడని, రుద్రుని తేజస్స్వరూపమని, దేవతల సేనాపతియని, తారకాసురిని చంపిన వాడని, జ్ఞానానికి నిధియై గురు స్వరూపమని, అచలమైన బుద్ధి కలవాడని, రెల్లు గడ్డి నందు పుట్టినందు వలన శరవణ భవుడని, ఆరుముఖములు ఉండుట వలన షడాననుడు అని, నెమలిని అధిరోహించినందు వలన మయూర ధ్వజుడని, రథముని అధిరోహించిన వాడు అని ఈ ధ్యాన శ్లోకము ద్వారా ప్రార్ధించ బడినాడు.
💥 సుబ్రహ్మణ్యుని అష్టకం💥 దీనినే "సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం"గా కూడా పిలుస్తారు.
హే స్వామినాథ కరుణాకర దీనబంధో,
శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో ।
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 1 ॥
దేవాదిదేవనుత దేవగణాధినాథ,
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద ।
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 2 ॥
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ ।
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 3 ॥
క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే ।
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 4 ॥
దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ ।
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 5 ॥
హారాదిరత్నమణియుక్తకిరీటహార,
కేయూరకుండలలసత్కవచాభిరామ ।
హే వీర తారక జయాఽమరబృందవంద్య,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 6 ॥
పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః ।
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 7 ॥
శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ ।
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 8 ॥
సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః ।
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః ।
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి ॥
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment