💥శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం💥
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
💥శ్రీ మహేశ్వర పంచరత్న స్తుతి (ఆది శంకరాచార్యులు రచించిన ప్రాతఃకాల శివ స్మరణ) తెలుగు తాత్పర్యం:
శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం (లేదా శ్రీ మహేశ్వర పంచరత్న స్తుతి) అనేది పరమేశ్వరుడైన శివునిపై ఆది శంకరాచార్యులు రచించిన భక్తిభరితమైన అద్భుతమైన స్తోత్రం. ఈ స్తుతిని ప్రతిరోజూ ఉదయాన్నే పఠించడం వల్ల శివానుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం.
💥శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం💥
శ్లోకం 1:
ప్రాతః స్మరామి పరమేశ్వరవక్త్రపద్మం ఫాలాక్షికీలపరిశోషితపంచబాణమ్ |
భస్మత్రిపుండ్రరచితం ఫణికుండలాఢ్యం కుందేందుచందనసుధారసమందహాసమ్ ||
తాత్పర్యం:
ఉదయాన్నే పరమేశ్వరుని ముఖపద్మాన్ని స్మరిస్తున్నాను. ఆ ముఖము ఫాలభాగంలోని అగ్నిచే మన్మథుడిని దహించినది. విభూతి రేఖలతో అలంకరింపబడి, సర్పములను కుండలాలుగా కలిగి, చంద్రుడు, చందనము వలె తెల్లనైన చిరునవ్వుతో ప్రకాశిస్తుంది.
శ్లోకం 2:
ప్రాతర్భజామి పరమేశ్వరబాహుదండాన్ ఖట్వాంగశూలహరిణాహిపినాకయుక్తాన్ |గౌరీకపోలకుచరంజితపత్రరేఖాన్ సౌవర్ణకంకణమణిద్యుతిభాసమానాన్ ||
తాత్పర్యం:
ఉదయాన్నే పరమేశ్వరుని బాహువులను సేవిస్తున్నాను. ఆయన చేతులలో ఖట్వాంగము, శూలము, లేడి, పాము, పిణాకము అనే ఆయుధాలు ఉన్నాయి. ఆ బాహువులు పార్వతీదేవి చెక్కిళ్లపై, కుచాలపై గల పత్రరేఖలచే అలంకరింపబడి, బంగారు కంకణాల కాంతులతో ప్రకాశిస్తున్నాయి.
శ్లోకం 3:
ప్రాతర్నమామి పరమేశ్వరపాదపద్మం
పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసమ్ |
పద్మాక్షనేత్ర సరసీరుహ పూజనీయం
పద్మాంకుశ ధ్వజ సరోరుహ లాంఛనాఢ్యమ్ ||
తాత్పర్యం:
ఉదయాన్నే పరమేశ్వరుని పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. ఆ పాదాలు బ్రహ్మ, దేవతలు, మునీంద్రుల మనస్సులో నివాసముంటాయి. పద్మాక్షునిచే పూజింపబడే ఆ పాదాలకు పద్మము, అంకుశము, ధ్వజము వంటి శుభ లక్షణాలు ఉన్నాయి.
శ్లోకం 4:
ప్రాతస్స్మరామి పరమేశ్వరపుణ్యమూర్తిం
కర్పూర కుంద ధవళం గజచర్మ చేలమ్ |
గంగాధరం ఘనకపర్ది విభాసమానం
కాత్యాయనీ తను విభూషిత వామభాగమ్ ||
తాత్పర్యం:
ఉదయాన్నే పరమేశ్వరుని పుణ్యమూర్తిని స్మరిస్తున్నాను. కర్పూరం వలె తెల్లగా ప్రకాశించే శరీరము, గజచర్మమును ధరించినవాడు, గంగాధరుడు, జటాధారి అయిన ఆ శివుని ఎడమ భాగంలో కాత్యాయనీ దేవి (పార్వతి) అలరారుతోంది.
శ్లోకం 5:
ప్రాతస్స్మరామి పరమేశ్వరపుణ్యనామ
శ్రేయఃప్రదం సకల దుఃఖ వినాశహేతుమ్ |
సౌసారతాప శమనం కలికల్మషఘ్నం
గో కోటిదాన ఫలదం స్మరణేన పుంసామ్ ||
తాత్పర్యం:
ఉదయాన్నే పరమేశ్వరుని పుణ్యనామాలను స్మరిస్తున్నాను. ఆయన నామస్మరణ సకల దుఃఖాలను నశింపజేస్తుంది, సంసార తాపాన్ని తొలగిస్తుంది, కలియుగ పాపాలను హరిస్తుంది. స్మరించినంత మాత్రాన కోటి గోదానాలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది.
ఫలశృతి:
శ్రీ పంచరత్నాని మహేశ్వరస్య భక్త్యా పఠేద్య సుగతిః ప్రభాతే |ఆయుష్యమారోగ్య మనేకభోగాన్ ప్రాప్నోతి కైవల్యపదం దురాసదమ్ ||
తాత్పర్యం:
ప్రతిరోజూ ఉదయమే భక్తితో ఈ శివ పంచరత్న స్తోత్రాన్ని పఠించినవారు ఆయురారోగ్యాలను, సమస్త భోగాలను పొంది, అంత్యమున ముక్తి పదమును పొందుతారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment