💥శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి💥
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ🌹🙏
అనంత స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు కోరుకున్న వారికి కోరినన్ని వరాలను ఇచ్చే దయామయుడు. అందుకే ఆ స్వామిని '#కోటివరాలదేవుడు' అని పిలుస్తున్నారు.
ఆ స్వామి నామస్మరణ సకల శుభకరం.
ఆ స్వామి 'నారాయణ' నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, అన్ని రకాలైన దుఃఖాలను నేలమట్టం చేసి, సకల ఐశ్వర్యాలను ప్రసాదించి, పరమపదానికి చేరుస్తుంది.
విష్ణు సహస్రనామ స్తోత్రం.. విష్ణువే పరమాత్ముడని, పరమేశ్వరుడని, విశ్వరూపుడని, కాలాతీతుడని, సృష్టి స్థితి లయాధిపతియని, దేవదేవుడని కీర్తించింది.
💥శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి💥
ఓం ఓం నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర
వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః || 1 ||
న నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే
దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః || 2 ||
మో మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితమ్
మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః || 3 ||
నా నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే
నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః || 4 ||
రా రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకమ్
కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః || 5 ||
య యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ
యజ్ఞాంగరూపిణే తుభ్యం యకారాయ నమో నమః || 6 ||
ణా ణాకారం లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదమ్
నానాభీష్టప్రదం వందే ణాకారాయ నమో నమః || 7 ||
య యజ్ఞకర్తే యజ్ఞభర్తే యజ్ఞరూపాయ తే నమః
సుజ్ఞానగోచరాయా2స్తు యకారాయ నమో నమః || 8॥
💥“ఒమ్ నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రంలో “ఒమ్” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని, “నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి.
అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేటప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది.
జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. ఇంకా,
“న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే
“ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే
“య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే
“ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే
“న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి. “ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి. “య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు. “ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది.
ఇంతటి శక్తివంతమైన “నారాయణ” అను శబ్దానికి ‘ఒమ్ నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రము)ను జపించటంచే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment