💥వైశాఖ పౌర్ణమి... "శ్రీకూర్మ జయంతి"🌹🙏
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹 🙏
💥వైశాఖ పౌర్ణమి... "శ్రీకూర్మ జయంతి"🌹🙏
క్షితిరతి విపులతరే తవ తిష్ఠతి పృష్టే
ధరణి ధరణ కిణ చక్ర గరిష్ఠే
కేశవ! ధృత కచ్ఛప రూప!
జయ జగదీశ హరే!
విశ్వస్య జన్మస్థితిసంయమార్థే కృతావతారస్య
పదాంబుజం తే |
వ్రజేమ సర్వే శరణం యదీశ స్మృతం
ప్రయచ్ఛత్యభయం స్వపుంసామ్ ||
హిందూ ధర్మ పురాణాలలో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో రెండవ అవతారం కూర్మావతారం.
ఇది కృతయుగం లో సంభవించిన అవతారం.
🌹కూర్మ అవతారాన్ని పోతన తన భాగవతంలో ఇలా వర్ణించాడు.
సవరనై లక్ష యోజనముల వెడల్పై కడు గఠోరంబైన కర్పరమున
నదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు
సకల చరాచర జంతురాసులనెల్ల మ్రింగి లోగొనునట్టి మేటి కడుపు
విశ్వంబుపై వేఱు విశ్వంబు పైబడ్డ నాగిన గదలనియట్టి కాళ్ళు
వెలిగి లోనికి జనుదెంచు విపుల తుండ
మంబుజంబుల బోలెడి యక్షియుగము
సుందరంబుగ విష్ణుండు సురలతోడి
కూర్మి చెలువొందనొక మహా కూర్మమయ్యె.
💥అవతార గాథ:
ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి "దేవతలు శక్తిహీనులగుదురు" అని శపించాడు.
అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు.
వారు విష్ణువుతో మొరపెట్టుకోగా "సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి" అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు.
దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమ కంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు.
మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీర సముద్ర మథనం మొదలయ్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది.
అప్పుడు శ్రీ మహావిష్ణువు "కూర్మావతారము"ను ధరించి ఆ కొండను భరించెను. కూర్మ రూపంలో శ్రీహరి అవతరించిన రోజు కాబట్టి దీన్ని "కూర్మ జయంతి" అంటారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment