💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏


శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ దైవంగా, ఏడుకొండల స్వామిగా, అనాధ నాధుడుగా, ఆర్త జన దీక్షాదక్షుడుగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా, శ్రీనివాసుడుగా అన్నింటికీమించి గోవిందుడుగా కొనియాడబడుచూ కొలువబడుతున్నాడు.


పద్మావతీదేవి, అలివేలుమంగ పతిగా, సప్తగిరీశుడుగా, తిరుమలేశుడుగా భక్తకోటికి దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నాడు.


వేంకటాద్రికి సరితూగే స్థానంగాని వేంకటేశ్వరుడికి సమాన దైవంగాని లేరని శాస్త్ర కథనం. 


స్వామివారి పుష్కరిణిలో స్నానం, శ్రీ వరాహస్వామి దర్శనం, కటాహతీర్థపానం - ఈ మూడూ ముల్లోకాలలో దుర్లభాలని స్కాందపురాణం తెలుపుతోంది.


స్వామివారి కృపా వీక్షణాలతో, మూగవాడు మాట్లాడ గలుగుతాడని, కుంటివాడు నడువ గలుగుతాడని భక్తుల విశ్వాసం.


కిఅజ్ఞానినా మయాదోషాన్ అశేషాన్, విహితాన్ హరేః

క్షమస్వతం క్షమస్వతం- శేషశైల శిఖామణే’ అంటూ భక్తులు రెండు చేతులూ జోడించి శ్రీహరి వేంకటేశ్వరుని వేడుకుంటూ ఉంటారు.


💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥


ఓం శ్రీవేంకటేశః శ్రీవాసో లక్ష్మీ పతిరనామయః ।

అమృతాంశో జగద్వంద్యో గోవింద శ్శాశ్వతః ప్రభుః ॥ 1 ॥


శేషాద్రినిలయో దేవః కేశవో మధుసూదనః

అమృతో మాధవః కృష్ణః శ్రీహరిర్ జ్ఞానపంజరః ॥ 2 ॥


శ్రీవత్సవక్షాః సర్వేశో గోపాలః పురుషోత్తమః ।

గోపీశ్వరః పరంజ్యోతి-ర్వైకుంఠపతి-రవ్యయః ॥ 3 ॥


సుధాతను-ర్యాదవేంద్రో నిత్యయౌవనరూపవాన్‌ ।

చతుర్వేదాత్మకో విష్ణు-రచ్యుతః పద్మినీప్రియః ॥ 4 ॥


ధరాపతి-స్సురపతి-ర్నిర్మలో దేవ పూజితః ।

చతుర్భుజ-శ్చక్రధర-స్త్రిధామా త్రిగుణాశ్రయః ॥ 5 ॥


నిర్వికల్పో నిష్కళంకో నిరాంతకో నిరంజనః ।

నిరాభాసో నిత్యతృప్తో నిర్గుణో నిరుపద్రవః ॥ 6 ॥


గదాధర-శ్శార్ఙ్గపాణి-ర్నందకీ శంఖధారకః ।

అనేకమూర్తి-రవ్యక్తః కటిహస్తో వరప్రదః ॥ 7 ॥


అనేకాత్మా దీనబంధు-రార్తలోకాభయప్రదః ।

ఆకాశరాజవరదో యోగిహృత్పద్మమందిరః ॥ 8 ॥


దామోదరో జగత్పాలః పాపఘ్నో భక్తవత్సలః ।

త్రివిక్రమ-శ్శింశుమారో జటామకుటశోభితః ॥ 9 ॥


శంఖమధ్యోల్లసన్మంజు కింకిణాఢ్యకరంఢకః ।

నీలమేఘశ్యామతను-ర్బిల్వపత్రార్చనప్రియః ॥ 10 ॥


జగద్వ్యాపీ జగత్కర్తా జగత్సాక్షీ జగత్పతిః ।

చింతితార్థప్రదో జిష్ణు-ర్దాశార్హో దశరూపవాన్‌ ॥ 11 ॥


దేవకీనందన-శ్శౌరి-ర్హయగ్రీవో జనార్దనః ।

కన్యాశ్రవణతారేజ్యః పీతాంబరధరోఽనఘః ॥ 12 ॥


వనమాలీ పద్మనాభో మృగయాసక్త మానసః ।

అశ్వారూఢః ఖడ్గధారీ ధనార్జన సముత్సుకః ॥ 13 ॥


ఘనసారలసన్మధ్య కస్తూరీ తిలకోజ్జ్వలః ।

సచ్చిదానందరూపశ్చ జగన్మంగళదాయకః ॥ 14 ॥


యజ్ఞరూపో యజ్ఞభోక్తా చిన్మయః పరమేశ్వరః ।

పరమార్థప్రదః శాంతః శ్రీమాన్‌ దోర్దండవిక్రమః ॥ 15 ॥


పరాత్పరః పరంబ్రహ్మ శ్రీవిభు-ర్జగదీశ్వరః ।

ఏవం శ్రీవేంకటేశస్య నామ్నా-మష్టోత్తరం శతమ్ ॥


పఠతాం శృణ్వతాం భక్త్యా సర్వాభీష్టప్రదం శుభమ్ ।

త్రిసంధ్యం యః పఘేన్నిష్యం సర్వాన్‌ కామివాప్ను యాత్‌ ॥


॥ శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు ॥

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం