భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం!
⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏
దుష్టానాం శిక్షణార్థాయ శిష్టానాం రక్షణాయ చ
రామకార్యార్థ సిద్ధ్యర్థం జాతః శ్రీహనుమాన్ శివః //
💥దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు సాక్షాత్తూ పరమశివుడే రామకార్యాన్ని సాధించాలనే సంకల్పంతో హనుమంతుడిగా అవతరించాడని "పరాశర సంహిత" చెబుతోంది.
🔱🌷 భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం!🌷🔱
హనుమ అంటేనే ఓ శక్తి. ఆ పేరే కొండంత ధైర్యం.
గంభీరమైన ఉగ్రతేజం.. అంతేస్థాయిలో మధుర వాక్కు, చిత్త సంస్కారం అనుపమాన దేహదారుడ్యం... అంతేలా సమున్నత బుద్ధిబలం.
అపార శాస్త్ర పాండిత్యం.. అంతే తీక్షణ బ్రహ్మచర్య తేజం. గొప్పదైన ప్రతాపరౌద్రం.. అంతే స్థాయిలో పరమ శాంతచిత్తం...
వాక్యకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, వినయమూర్తి,
రామభక్తాగ్రేసరుడు... అనేక శక్తుల మేలుకలయికగా హనుమ దర్శనమిస్తాడు.
💥మనుస్మృతిలో చెప్పినట్లు ప్రభువు పట్ల అనురాగం, కపటమెరుగని స్థితి, సమర్ధత, జ్ఞానం, దేశ కాల తత్త్వం తెలిసి ఉండటం, మంచి దేహదారుఢ్యం, భయమన్నది లేకపోవటం, వాక్పటుత్వం.. ఈ లక్షణాలన్నీ హనుమలో పుష్కలంగా ఉన్నాయి.
అందుకే శ్రీరాముడి ప్రేమకు పాత్రుడయ్యాడు. అలాంటి హనుమను స్మరిస్తే బుద్ధి, కీర్తి, బలం, ధైర్యం, నిర్భయత్వం, రోగాలు లేకుండా ఉండటం, వాక్పటుత్వం లాంటి మంచి లక్షణాలన్నీ ప్రాప్తిస్తాయి.
💥#ఆంజనేయుని_శ్లోకాలు - #తాత్పర్య_సహితం💥
మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం |
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామ దూతం శరణం ప్రపద్యే ||
💥భావము:-
మనస్సుని జయించినవాడు, గాలి వేగంతో పయనించేవాడు, పంచేంద్రియాలను తన అధీనంలో ఉంచుకున్నవాడు,గొప్ప తెలివిగలిగినవాడు, వానరులలో ముఖ్యుడు, శ్రీరామచంద్రునకు దూత అయిన హనుమంతునికి ప్రణామం చేస్తున్నాను.
యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిం |
భాస్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకం ||
💥భావము:-
దయ్యాల బారి నుండి కాపాడేవాడు, ఎక్కడ శ్రీరాముని పొగిడినా కళ్ళలో నీళ్ళు, రామ భజన చేస్తూ పులకరించిపోయే వాడైన హనుమంతునికి నమస్కారము.
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా |
అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ ||
💥భావము:-
ఎవరైతే హనుమంతున్ని నిత్యం ధ్యానిస్తారో వారు ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరు ప్రఖ్యాతులు, ఙ్ఞానం, వాక్చాతుర్యం తప్పక పొందగలుగుతారు.
అంజనానందం వీరం
జానకీ శోక నాశనం |
కపీషమక్ష హంతారం
వందే లంకాభయంకరం ||
💥భావము:-
అంజనాదేవి కుమార, జానకీ మాతా శోకాన్ని పోగొట్టినవాడా, వానర మూక రాజా, లంక రాజుకు భయం పుట్టించిన వాడా, రావణుని రెండవ కుమారుడైన అక్షను సంహరించిన ఆంజనేయ నీకు వందనాలు.
ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం
యః శోకవహ్నిం జనకాత్మజాయా
ఆదాయ తేనైవ దదాహ లంకాం
నమామి త్వం ప్రాంజలీరాంజనేయం
💥భావము:-
ఎవరైతే సముద్రాన్ని ఆడుతూ పాడుతూ సునాయాసంగా దాటగలిగినాడో, జనకుని కుమార్తె అయిన జానకీమాత శోకాన్ని చూసి తట్టుకోలేక ఆ శోకంతోనే లంకని దహింపజేసిన హనుమా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
గోష్పదీకృత వారాశిం
మశకీకృత రాక్షసం |
రామాయణం మహామాలారత్నం
వందే అనిలాత్మజం ||
💥భావము:-
గోమాత యొక్క పాదాల మధ్య దూరాన్ని దాటినంత సునాయాసంగా సముద్రాన్ని దాటి దోమలను చంపినంత సులభంగా రాక్షసవధ చేసి రామాయణం అనే వజ్రమాలలో ఒక వజ్రంలాగా నిత్యం మెరిసే ఆంజనేయ నీకు నమస్కారము.
అతులిత బలధామం స్వర్ణశైలభ దేహం
దనుజవనక్రుశానుం ఙ్ఞానినాం అగ్రగణ్యం |
సకలగుణ నిధానం వానరాణాం అధీశం
రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి ||
💥భావము:-
ఎవరికీ సమానము రాని శక్తిని సొంతం చేసుకొని, బంగారు వర్ణం కలిగిన కొండంత శరీరం, భూత ప్రేత పిశాచాలకు ఆవేశంతో ఉన్న అగ్నిపర్వతంలా కనబడి, ఙ్ఞానులలో అగ్రగణ్యుడు, అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండి, వానర మూకకు అధిపతి అయి శ్రీరామచంద్రమూర్తికి నమ్మిన బంటు అయిన వాయుపుత్రుడైన హనుమంతునికి నమస్కారాలు.
ఆంజనేయమతిపాటలాలనం
కాంచనాద్రి కమనీయ విగ్రహం |
పారిజాత తరుమూల వాసినం
భావయామి పవమాన నందనం ||
💥భావము:-
అంజనాదేవి కుమారుడు, దుష్టులను సంహరించేవాడు, అందమైన కొండంత బంగారు శరీరం కలిగి, పారిజాత చెట్టును నివాసం చేసుకున్న వాయుపుత్రుడికి నమస్కారాలు.
ఆమూషీకృత మార్తాండం;
గోష్పతీ కృత సాగరం |
తృణీకృత దశగ్రీవం
ఆంజనేయం నమామ్యహం ||
💥భావము:-
సూర్య భగవానుడిని తినాలని అనుకున్నవాడు, గోమాత పాదాల మధ్య దూరాన్ని దాటినంత సునాయాసంగా సముద్రాన్ని దాటినవాడు, రావణుడిని పట్టించుకోని వాడైన ఆంజనేయుడికి నమస్కారము.
అసాధ్య సాధక స్వామిన్
అసాధ్య తవ కింవధ |
రామదూత కృప సింధో
మత్కార్యం సాధ్యప్రభో ||
💥భావము:-
ఓ దేవా! నీకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? ఏమైనా సునాయాసంగా చేయగలవు. రామదూత అయిన నువ్వు కరుణామయుడవు. నా విన్నపమును సాధ్యం చేయు ప్రభు!
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment