💥 తిరుమలలో రథసప్తమి🌹🙏
⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏
💥 తిరుమలలో రథసప్తమి🌹🙏
సకల జీవకోటికి వెలుగు ప్రదాత.. చైతన్య కారకుడైన సూర్యభగవానుడు జనులకు ప్రత్యక్ష నారాయణుడు.. ఆ ఆదిత్యుని జన్మదినమైన సూర్యజయంతి రోజున రథసప్తమి వేడుకలను టీటీడీ నిర్వహించడం ఆనవాయితి.
సూర్యోదయాన సుర్యప్రభ వాహనంతో ప్రారంభమైన గోవిందుడి వాహన సంరంభం రాత్రికి జరిగే చంద్రప్రభ వాహనంతో ముగియనున్నది. శ్రీనివాసుడు ఒక్క రోజే సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల,చంద్రప్రభ వాహనాలపై మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు.
శ్రీవారి వార్షిక రథసప్తమి వేడుకలతో తిరుమల శోభాయమానంగా మారింది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేర్కోనే రథసప్తమి పర్వదినం రోజున శ్రీవారు ఏడు వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులుకు దర్శనమిస్తారు.
ఏటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా 9 రోజులలో శ్రీవారు 16 వాహనాలపై మాడ వీధులలో విహరిస్తూ భక్తులుకు దర్శనమిస్తే… రథ సమప్తమి పర్వదినం రోజున ఒక్కే రోజు శ్రీవారు ఏడు వాహనాలపై మాడ వీధులలో విహరిస్తూ భక్తులుకు దర్శనమిస్తారు.
స్వామివారు తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై దర్శనమిస్తారని పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం ఉంటుందని వివరించారు.
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై దర్శనం ఇస్తారు.
రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై ఊరేగే స్వామివారి కమనీయ రూపాన్ని దర్శించడానికి విచ్చేసే భక్తజన సందోహంతో తిరుమల కోలాహాలంగా ఉంటుంది.
💥సూర్యప్రభ వాహనం:- (ఉదయం 5.30 గం||ల నుండి ఉదయం 8.00 గం||ల వరకు) వాహనసేవలో అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం.
సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు, తన తొలిఉషారేఖలను అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ మలయప్పస్వామిపై ప్రసరించి అంజలి ఘటిస్తాడు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించడానికి వేలాది కన్నులు ఉదయాతూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తూంటాయి.
💥చిన్నశేష వాహనం:- (ఉదయం 9.00 గం||ల నుండి 10.00 గం||ల వరకు) సూర్యప్రభ వాహనంపై శ్రీ సూర్యనారాయణమూర్తి కమనీయ రూపాన్ని తిలకించి పులకించిన భక్తులు అనంతరం స్వామివారి చిద్విలాసాన్ని చిన్నశేష వాహనం తిలకించి తరిస్తారు.
💥గరుడ వాహనం:- (ఉదయం 10.00 గం||ల వరకు 12.00 గం||ల వరకు) స్వామివారికి ఎన్ని వాహనసేవలు ఉన్నా తన ప్రియమైన గరుడ వాహనసేవ లేనిదే సంపూర్ణత చేకూరదు. అలంకారప్రియుడైన స్వామివారు సర్వాలంకార భూషితుడై, పుష్పమాలాలంకృతుడై ఛత్రచామర సార్వభౌమిక మర్యాదలతో, పక్షిరాజు గరుడునిపై రాజఠీవితో తిరు వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తాడు.
💥హనుమంత వాహనం:- (మధ్యాహ్నం 1.00 గం|| నుండి మధ్యాహ్నం 2.00 గం||ల వరకు) భక్తులకు నిజమైన భక్తిరసం, శరణాగతి యొక్క నిర్వచనాన్ని తెలియపరచడానికి స్వామివారు భక్తాగ్రేసరుడైన హనుమంతుని వాహనంపై పుణ్యక్షేత్ర మాడ వీధులలో ఊరేగుతాడు.
💥చక్రస్నానం:- (మధ్యాహ్నం 2.00 గం||ల నుండి మధ్యాహ్నం 3.00 గం||ల వరకు) శ్రీ మలయప్ప స్వామివారు ఆలయాన్ని ప్రవేశించిన పిదప అర్చకస్వాములు శ్రీ సుదర్శన చక్రస్వామిని ఆలయ మాడవీధులలో ఊరేగిస్తూ వరాహస్వామి ఆలయాన్ని చేరుకుంటారు. అనంతరం అర్చకులు ఆలయ ప్రాంగణంలో చక్రత్తాళ్వారుకు పంచామృతాభిషేక స్నానం చేయించి స్వామి పుష్కరిణిలో ముంచి తీర్థస్నానం చేయిస్తారు.
💥కల్పవృక్ష వాహనం:- (సాయంత్రం 4.00 గం||ల నుండి సాయంత్రం 5.00 గం||ల వరకు) సకల కోరికలు ఈడేర్చే దైవ వృక్షం అయిన కల్పవృక్ష వాహనంపై స్వామివారు తన ఉభయదేవేరులతో కూడి తిరువీధులలో ఊరేగుతూ అనుగ్రహిస్తారు.
💥సర్వభూపాల వాహనం:- (సాయంత్రం 6.00 గం||ల నుండి సాయంత్రం 7.00 గం||ల వరకు) పురవీధులలో సకల చరాచర జగత్పాలకుడైన స్వామివారు రాజసం ఉట్టి పడుతుండగా, ప్రౌఢ గాంభీర్యంతో సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి భక్తులకు అభయహస్తాన్ని అనుగ్రహిస్తాడు.
💥చంద్రప్రభ వాహనం:- (రాత్రి 8.00 గం||ల నుండి రాత్రి 9.00 గం||ల వరకు) భానుని నునులేత కిరణాల స్పర్శతో ప్రారంభమైన స్వామివారి సప్త వాహన శోభ వెన్నెల రేడైన చంద్రుని చల్లని చంద్రప్రభ వాహనంపై ఆహ్లాద విహారంతో ముగుస్తుంది.
పిదప స్వామివారు దేవేరులతో కూడి బంగారు పీఠంపై ఆసీనుడై ఆలయ ప్రవేశం చేయడంతో రథసప్తమి వాహన వేడుకలు ఘనంగా పూర్తి అవుతాయి.
ఈ పర్వదినాన స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగిన కారణంగా, \’రథసప్తమి\’ని ఒకరోజు బ్రహ్మోత్సవాలని కూడా వ్యవహరిస్తారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment