⚜️🕉️🚩 ఓం నమో భగవతే దక్షిణామూర్తయే🌹🙏
⚜️🕉️🚩 ఓం నమో భగవతే దక్షిణామూర్తయే🌹🙏
దక్షిణామూర్తి స్వరూపము యొక్క భావమును మనం పరిశీలించినట్లయితే ఈ క్రింది విషయములు మనకి బోధపడతాయి...
విశాలమైన వట (మర్రి) వృక్షము – విశాలంగా విస్తరించే ఆ పరమాత్ముని సృష్టిని సూచిస్తుంది.
వట వృక్ష మూలంలో కూర్చొని ఉన్న దక్షిణామూర్తి, ఈ సర్వ సృష్టికి ఆధారభూతుడని సూచిస్తున్నది.
ఇక ఆయన స్వరూపము అష్టమూర్తి తత్త్వముతో కూడినది. అనగా పంచ భూతములు, సూర్య, చంద్రులు, పురుషుడు/ఆత్మ/యజమాని.
కుడిచేతిలో ఉన్న ఢమరుకము - ఆకాశ తత్త్వము- శబ్ద బ్రహ్మ స్వరూపుడైన ఈశ్వరుడు
జటాజూటములు - వాయుతత్త్వము
ఎడమ చేతిలో ఉన్న అగ్ని/జ్యోతి – అగ్ని తత్త్వము
తలపైన ఉన్న గంగ – జల తత్త్వము
మూర్తీభవించిన దక్షిణామూర్తి రూపము – పృథివి తత్త్వము.
శిరస్సుకిరువైపులాఉన్న సూర్య చంద్రులు – సూర్య చంద్రులు
ధ్యానం/మౌనంలో ఆయన స్వరూపము – యజమాని/పురుషుడు/ఆత్మ
ఈ రూపంలో ఉన్న దక్షిణామూర్తి సృష్టి, స్థితి, లయ కారుడైన పరమేశ్వరుడుగా గోచరిస్తాడు.
కుడిచేతిలో ఉన్న ఢమరుకము సృష్టికారకత్వాన్ని తెలియజేస్తుంది.
మద్యలో ఉన్న సూర్య చంద్రులు స్థితికారకత్వాన్ని తెలియజేస్తుంది.
ఎడమ చేతిలో ఉన్న అగ్ని/జ్యోతి – లయకారకత్వాన్ని తెలియజేస్తుంది.
ఇక మిగిలిన రూపవిశేషాలు పరిశీలించినట్లయితే...
పైన ఉన్న కుడి చేతిలో ఢమరుకము, స్ఫటిక అక్షమాల – ఈ సర్వసృష్టికి మూలాధారమైన శబ్ధస్వరూపము, అ నుండి క్ష వరకు సూచించే అక్షమాల.
పైన ఉన్న ఎడమ చేతిలో అగ్ని దివిటీ – అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టే జ్ఞానము. పరమేశ్వరుని సంహార క్రియను సూచించును.
క్రింద ఉన్న ఎడమ చేతిలో తాళపత్రములు/కుశాగ్రములు – జ్ఞాన సంపద, వేదములు సూచిస్తాయి
క్రింద ఉన్న కుడి చేతితో చిన్ముద్ర – అభయముద్ర, జ్ఞానముద్ర,అనుగ్రహము సూచిస్తుంది.
మెడలో సువర్ణాభరణములు, రుద్రాక్షమాలలు – ఇవి వీర్యము, క్షమత, దానము, శీలము, జ్ఞానము మొదలగు గుణములు సూచిస్తాయి.
కుడిచెవికి కుండలము మరియు ఎడమచెవికి తాటంకము – కుడిచెవి కుండలము పురుష తత్త్వము తెలుపగా ఎడమచెవి తాటంకము ప్రకృతి తత్త్వము తెలుపుతున్నది. ఇదియే అర్థనారీశ్వర తత్త్వము.
నుదుటిపై మూడవనేత్రము - జ్ఞానము సూచిస్తుంది
కుడికాలు క్రిందకు వంచి, ఎడమకాలిని కుడి తొడపై ఉంచి కూర్చొనడం – వీరాసనం అంటారు. వీరత్వం, సామర్థ్యత (దక్షత) తెలుపుతున్నది.
తన కుడి మోకాలు క్రిందకు వంచి (లంబక పాదమ్) అపస్మారుడు అనే రాక్షసుణ్ణి తొక్కుతూ ఎడమ మోకాలు కుడి తొడపై ఆనించి (కుంచిత పాదము) కూర్చొని ఉంటారు – అపస్మారుడు అనగా ఆసురీశక్తులు, అజ్ఞానము సూచిస్తుంది.
ఆయన ముందర బ్రహ్మజ్ఞానం తెలుసుకొనుటకై కూర్చొని ఉన్న ఋషులు –
సనక, సనందన, సనాతన, సనత్కుమారులు.
అయితే కొన్ని గ్రంధాలలో ఈ ఋషులను ఈ క్రింది విధంగా కూడా చెప్తారు.
అగస్త్యుడు, పులస్త్యుడు,విశ్వామిత్రుడు, అంగీరసుడు
కౌశిక, కశ్యప, భరద్వాజ, అత్రి.
నారద, వశిష్ఠ, జమదగ్ని, భృగు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment