చతుర్ షష్టి ఉపచారాలతో అంటే (64) ఉపచారాలు
⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏
తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయుగజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపము కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్
గణపతిని పూజించకుండా ఎలాంటి శుభ కార్యము తలపెట్టము. మంగళకరమైన కార్యాలలో వాటిల్లే విఘ్నాలను తొలగించేవాడు కనుక ఈయన విఘ్నేశ్వరుడుగా ఆరాధింపబడుతున్నాడు.
ఆయన కృపాకటాక్షాలతో సకల కార్యాలు నిర్విఘ్నముగా నెరవేరుతాయి. విఘ్ననిర్మూలనముకై అవతరించి మంగళ స్వరూపుడై సకల మానవాళికి ఆరాధ్య మూర్తియై నిలిచాడు.
ఓం గణానాం త్వా గణపతిగ్o హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్!
జ్యేష్టరాజం బ్రహ్మణాo బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ !
మహాగణపతియే నమః ।। ఓం ॥
గణపతి సర్వవిద్యాధి దేవతగా, వేదకాలమునుండి ఆరాధింపబడుతున్న అతి ప్రాచీన దేవత, వేదములలో స్తుతించబడి, గణములకు అధిపతియై, శబ్దములకు రాజుగా, ప్రణవ స్వరూపుడై శబ్దబ్రహ్మగా తెలియబడుచున్నాడు.
"గ" శబ్దం బుద్దికి "ణ " శబ్దం జ్ఞానానికి ప్రతీక. సమస్త మంత్రములలోను శక్తికి కారణములైన బీజాక్షరములన్నింటి లోకి ముందుగా ఉచ్ఛరించబడేదే "ఓంకారము" అందుచేత ఈ గణపతిని ఓంకార స్వరూపుడిగా "గణపత్యధర్వ శీర్షము" లో వర్ణించారు.
గణములు అనగా అక్షరములతో ఏర్పడే ఛందస్సు - గురువు, లఘువు, పూర్ణానుస్వార, అర్ధానుస్వార రూపమై శబ్దంగా వెలువడే మంత్రస్వరూపమైన శబ్దాలకి అధిపతే ఈ "గణపతి " అంతేకాకుండా "బ్రహ్మణస్పతి " అంటే వేదాలకి నాయకుడివి అని కీర్తించారు.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే!
ఇక్కడ వినాయకుడు "విష్ణుం" అని పిలవబడినాడు. విష్ణువుగా చెప్పబడినాడు. విష్ణుం అంటే సర్వ వ్యాపకుడు, స్థితి కారకుడు.
అంతేకాకుండా క్షీర సాగర మధనానికి విఘ్నం కలిగిందని స్వయంగా శ్రీ మహావిష్ణువే దేవతలచే గణపతి పూజ చేయించాడు.
సృష్టి ఆదిలో దేవతా గణముల ప్రారంభం కంటే ముందే గణనాధుని తో సృష్టి ప్రారంభించినట్లు గణేశ పురాణం తదితర పురాణాలు మనకి సూచిస్తున్నాయి.
సృష్టి ప్రారంభానికి ముందు ఒకప్పుడు అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేస్తున్నది. ఇంకా మనుషులే పుట్టకముందు అన్నమాట. అమ్మవారు పరమేశ్వరుణ్ణి తలచుకొన్నది. ఆయన అక్కడ ఉన్నారు. వారి చూపులు కలసినవి. ఆ చూపుల కలయికకి విఘ్నేశ్వరుడు పుట్టాడు. అంతటి పూర్వుడాయన. ఆయన పేరు మహాగణపతి. ఆ మహాగణపతి అవతారాలనే ఇప్పుడు మనం ప్రతి కల్పంలోనూ పూజిస్తున్నాం.
💥వేదనాయకుడైన మన గణనాధునికి వేదాలలో చెప్పిన చతుర్ షష్టి ఉపచారాలతో అంటే (64) ఉపచారాలతో పూజచేద్దాం.
1) ధ్యానం 2) ఆవాహనం 3) ప్రభోధనం 4) మణి మందిరం 5) రత్న మండపం 6) దంత ధావనం 7) సిబికాం 8) రత్న సింహాసనం 9) వితానం 10) పాద్యం 11) అర్ఘ్యం 12) ఆచమనీయం 13) మధుపర్కం 14) అభ్యంగనమ్ 15) ఉద్వర్తనం 16) పంచామృతం 17) ఫలోదకం 18) శుద్దోదకం 19) సమ్మార్జనమ్ 20) వస్త్రం 21) పాదుకాo 22) ఆభరణం 23) కిరీటం 24) కుండలం 25) కవచం 26) యజ్ఞోపవీతం 27) శ్రీ గంధం 28) అక్షతం 29) హరిద్రాచూర్నమ్ 30) కుంకుమ 31) పరిమళ ద్రవ్యం 32) సింధూరం 33) పుష్పాణి 34) దూర్వాదళం 35) ధూపం 36) దీపం 37) కుంభ నీరాజనం 38) నైవేద్యం 39) హస్త ప్రక్షాళనం 40) కరో ద్వర్థనమ్ 41) పానీయం 42) ఫలసమర్పణం 43) తాంబూలం 44) దక్షిణ 45) ఛత్రం 46) చామరం 47) దర్పణం 48) మంగళ నీరాజనం 49) మంత్రపుష్పం 50) ప్రదక్షిణం 51) నమస్కారం 52) తురంగవాహనమ్ 53) మదగజం 54) రధం 55) సైన్యం 56) దుర్గం 57) మూషిక వాహనం 58) ఆయుధం 59) వ్యజవీజనం (వింజామర) 60) నృత్యం 61) వాద్యాని 62) గీత శ్రవణం 63) అభినయం 64) క్షమా ప్రార్ధన.
ఈ 64 ఉపచారాలు ప్రధానమైనవిగా శాస్త్రాలలో చెప్పబడ్డాయి. అత్యంత విశిష్ట మైన ఈ ఉపచారాలతో శ్రీ మహాగణపతిని అర్చించి ఆ స్వామి దివ్యానుగ్రహాన్ని అందరం పొందుదాం.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment