⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏


💥గణపతిని పూజించకుండా ఎలాంటి శుభ కార్యమూ తలపెట్టం. ఎందుకంటే, ఆయన కృపాకటాక్షాలతో సకల కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయని శాస్త్రవచనం. 


విఘ్న నిర్మూలనకు అవతరించి మంగళస్వరూపుడై సకల మానవాళికి ఆరాధ్యమూర్తియై నిలిచాడు.


గణపతి సర్వ విద్యాధి దేవత, వేదకాలం నుండి ఆరాధనలందుకుంటున్న దైవం. వేదాలలో స్తుతించబడి,

గణాలకు అధిపతియై, శబ్దాలకు రాజుగా, ప్రణవ స్వరూపుడైన శబ్దబ్రహ్మ.


'గ' శబ్దం బుద్ధికి, 'ణ' శబ్దం జ్ఞానానికి ప్రతీక. సమస్త

మంత్రాలలోను శక్తికి కారణాలైన బీజాక్షరాలన్నింటిలోకి

ముందుగా ఉచ్చరించేదే 'ఓంకారం' అందుచేత గణపతిని ఓంకార స్వరూపుడిగా 'గణపత్యథర్వ శీర్షం'లో వర్ణించారు.


గణాలంటే అక్షరాలతో ఏర్పడే ఛందస్సు - గురువు, లఘువు, పూర్ణానుస్వార అర్దానుస్వార రూపమై శబ్దంగా వెలువడే మంత్ర స్వరూపమైన శబ్దాలకి అధిపతే ఈ 'గణపతి '.


అంతేకాకుండా 'బ్రహ్మణస్పతి' అంటే వేదాలకి నాయకుడివి అని కీర్తించారు. సృష్టి ఆదిలో దేవతా గణాల ప్రారంభం కంటే ముందే గణనాథుని తో సృష్టి ప్రారంభించినట్లు గణేశ పురాణం తదితర పురాణాలు మనకి సూచిస్తున్నాయి.


సృష్టి ప్రారంభానికి ముందు ఒకప్పుడు అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేస్తున్నది. ఇంకా మనుషులే పుట్టకముందు అన్నమాట. అమ్మవారు పరమేశ్వరుణ్ణి

తలచుకొన్నది. ఆయన అక్కడ ఉన్నారు. వారి చూపులు

కలసినవి. ఆ చూపుల కలయికకి విఘ్నేశ్వరుడు పుట్టాడు.


అంతటి పూర్వుడాయన. ఆయన పేరు మహాగణపతి. ఆ

మహాగణపతి అవతారాలనే ఇప్పుడు మనం ప్రతి కల్పంలోనూ పూజిస్తున్నాం.


శరీరంలోని షట్చక్రాలలో అన్నిటికన్నా అడుగున ఉండే చక్రం "మూలాధార చక్రం" ఈ మూలాధార చక్రానికి

అధిపతి వినాయకుడు.


దీనిలో ఇంకో రహస్యం కూడా ఉంది.

'మహాశక్తి' అయిన పార్వతీదేవికి 'ద్వారపాలకుడుగా' గణపతిని పెట్టినట్టు మన పురాణగాధ. దీనిలో అంతరార్థం ఏమిటంటే..


మూలాధారంలో కుండలినీశక్తి యోగనిద్రలో ఉంటుంది అని, ఈ కుండలిని శక్తియే మహాశక్తి - ఆ మూలాధారంలో కుండలిని శక్తిని మేల్కొలపడానికి ప్రవేశించే ద్వారం వద్దనే గణపతి కావలిగా ఉన్నాడు.


అంటే గణపతి బీజాక్షరంతో మూలాధారాన్ని చైతన్య వంతం చేస్తే శక్తిని మేల్కొల్పటం సాధ్యపడుతుంది.

మూలాధారంలో మేల్కొన్న కుండలిని శక్తి 'ఇడ', 'పింగళ'

నాడుల ద్వారా షట్చక్రాలను భేదించి సహస్రారం చేరుతుంది.


యోగికి 'సిద్ధి' 'బుద్ధి' కలుగుతుంది. ఈ బుద్ధి, సిద్ధి ఇడా, పింగళ అనే జంటలే సుషుమ్నా నాడిలో నివసించు గణపతికి భార్యలు అని చెప్పబడినాయి.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు