సికింద్రాబాదులోని "ఉజ్జయిని మహంకాళి" బోనాలు

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏


బోనాలు 


ఆషాడం వచ్చిందంటే చాలు భాగ్యనగరం బోనాలు శోభతో పులకించిపోతుంది. వీధి వాడా ఎటు చూసినా సందడే! ఎటు విన్నా అమ్మవారి నామ స్మరణమే!


గోల్కొండలో బోనాల ఉత్సవం మొదలయిన మూడవ ఆదివారం సికింద్రాబాదులోని "ఉజ్జయిని మహంకాళి"  ఆలయంలోనూ, ఈ పరిసర ప్రాంతాలలోని వందకు పైగా ఆలయాలలోనూ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.


సికింద్రాబాదులోని "ఉజ్జయిని మహంకాళి" ఆలయానికి ఓ చరిత్ర ఉంది. బ్రిటీష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత 1813వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడు.


ఆ సమయంలో భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు. ఆ విషయం తెలుసుకున్న ఆయన సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నాడట.


అక్కడ ఆ వ్యాధి తగ్గితే.. ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం కట్టిస్తానని మొక్కుకున్నారు. ఆ క్షణం నుంచి ఆ వ్యాధి తగ్గిపోయిందట.


ఆ తర్వాత 1815లో తను నగరానికి తిరిగొచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి, ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది.


ఇక్కడ అమ్మవారు ఒక చేతిలో ఖడ్గంతో, మరో చేతిలో భరిణతో దర్శనమిస్తారు. పక్కనే మాణిక్యాంబ దర్శనమిస్తుంది.


ముందు వున్న వేప చెట్టుని అలాగే వుంచి చుట్టూ ఆలయం నిర్మించారు. ఉపాలయంలో ఈశ్వరాంశ సంభూతుడైన వీరభద్రస్వామి చతుర్భుజాలతో ఎదురుగా నందీశ్వరుడితో సహా దర్శనమిస్తాడు.


ఇక్కడ బోనాల మర్నాడు జరిగే రంగం చాలా ప్రసిధ్ధి చెందింది. 

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు