💥ఆషాడ ఏకాదశి విశేషం: పండరిపురంలో శ్రీ పాండురంగ స్వామి యాత్ర.

 ⚜️🕉️🚩పాండురంగ విఠ్ఠల జై పండరినాథ విఠ్ఠల🌹🙏


💥ఆషాడ ఏకాదశి విశేషం: పండరిపురంలో శ్రీ పాండురంగ స్వామి యాత్ర.


పండరీపురం... వైష్ణవ ఆలయమైనా దీనికి దక్షిణ కాశీ

అని పేరు. ఇక్కడ భగవంతుడి కన్నా భక్తులకే తొలి

ప్రాధాన్యం. పాండురంగడి ఆలయానికి చేరుకునేముందు

ఆయన భక్తుల్ని దర్శించుకోవాలన్నది నియమం.


వయసుతో సంబంధం లేకుండా వందల కిలోమీటర్లు

నడుస్తూ... విఠోబా, విఠలా, పాండురంగా... అని

ఎలుగెత్తి కీర్తిస్తూ స్వామిని చూసేందుకు ఓ

ఉద్యమంలా కదిలి తొలి ఏకాదశికి ఆలయానికి

చేరుకుంటారు లక్షలాది భక్తులు.


ఏటా ఆషాఢంలో అంగరంగవైభవంగా సాగే ఈ యాత్ర... స్వామి ఇక్కడ కొలువుదీరిన వైనం... నాటి భక్తులకు ప్రత్యేక మందిరాలు ఉండటం... స్వయంగా గర్భగుడి లోపలికి వెళ్లగలగడం... ఇలా పండరీపురంలో ప్రతిదీ ఓ విశేషమే.


పండరిపురం ఆలయంలో ఆషాడ శుద్ధ ఏకాదశికి, కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్సవాలు జరుగుతాయి.


ఆషాఢ శుద్ధ ఏకాదశి మొత్తం ఏకాదశుల్లో తొలిది. అంటే ఇది ప్రథమేకాదశి. ఈనాటి రాత్రి వైష్ణవాలయాల్లో విష్ణు శయన వ్రతాలు ఆచరిస్తారు. విష్ణు విగ్రహాన్ని ఆభరణాదులతో అలంకరించి, జాజిపువ్వులతో పూజిస్తారు. పవళింపు సేవ చేస్తారు. కీర్తనలు పాడతారు. 


చంద్రభాగ నదీ తీరాన పండరిపురంలో (మహారాష్ట్రలో ఉంది) కొలువైన విఠలుని వైభవం తొలి ఏకాదశి నాడే చూడాలి. అక్కడ ఈ తిథి నాడు గొప్ప ఉత్సవం జరుగుతుంది.  సతీ సక్కుబాయి ముక్తి పొందినది ఈ ఏకాదశి నాడే.


💥#శ్రీ_పాండురంగాష్టకం


మహాయోగపీఠే తటే భీమరథ్యా

వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః |

సమాగత్య తిష్ఠంతమానందకందం

పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || 1 ||


తటిద్వాససం నీలమేఘావభాసం

రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్ |

వరం త్విష్టకాయాం సమన్యస్తపాదం

పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || 2 ||


ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం

నితంబః కరాభ్యాం ధృతో యేన తస్మాత్ |

విధాతుర్వసత్యై ధృతో నాభికోశః

పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || 3 ||


స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే

శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసమ్ |

శివం శాంతమీడ్యం వరం లోకపాలం

పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || 4 ||


శరచ్చంద్రబింబాననం చారుహాసం

లసత్కుండలాక్రాంతగండస్థలాంతమ్ |

జపారాగబింబాధరం కంజనేత్రం

పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || 5 ||


కిరీటోజ్జ్వలత్సర్వదిక్ప్రాంతభాగం

సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః |

త్రిభంగాకృతిం బర్హమాల్యావతంసం

పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || 6 ||


విభుం వేణునాదం చరంతం దురంతం

స్వయం లీలయా గోపవేషం దధానమ్ |

గవాం బృందకానందదం చారుహాసం

పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || 7 ||


అజం రుక్మిణీప్రాణసంజీవనం తం

పరం ధామ కైవల్యమేకం తురీయమ్ |

ప్రసన్నం ప్రపన్నార్తిహం దేవదేవం

పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || 8 ||


స్తవం పాండురంగస్య వై పుణ్యదం యే

పఠంత్యేకచిత్తేన భక్త్యా చ నిత్యమ్ |

భవాంభోనిధిం తేఽపి తీర్త్వాంతకాలే

హరేరాలయం శాశ్వతం ప్రాప్నువంతి || 9 ||


🌹ఇతి "శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య" "శ్రీమచ్ఛంకరభగవత్పాదాచార్య" విరచితం శ్రీ పాండురంగాష్టకమ్ |

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు