💥శ్రీదక్షిణామూర్తి స్తోత్రం💥
⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం |
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ||
💥శివ స్వరూపాలలో విశేషమైంది ధ్యానమూర్తి
"దక్షిణామూర్తి" రూపం. దక్షిణ ముఖంగా ప్రతిష్ఠితమయ్యే శివరూపం ఇది.
దక్షిణ శబ్దానికి ‘కుడివైపు’, ‘సమర్థత’ అనే అర్థాలున్నాయి. సమర్థుని ప్రవర్తనలో అధికమైన వ్యక్తీకరణలు ఉండవు. కేవలం విధి నిర్వహణలు మాత్రమే ఉంటాయి. అందుకే, దక్షిణామూర్తి తత్త్వంలో ఈ ప్రత్యేకతలు కనిపిస్తుంటాయి.
ఈ శివమూర్తి ప్రత్యేకతల్లో మౌనమే ప్రధానం.
మౌనం పరావాక్కు స్వరూపం. పరావాక్కు మూలశక్తికి సంకేతం. అందుకే, దక్షిణామూర్తి స్వరూపమూ మూలశక్తి విధానాన్ని తెలియజేస్తుంది.
ఈ శక్తి దగ్గరగా ఉన్నవారికి ఎలాంటి లోపాలూ వుండవు. అన్ని విషయాల అవగాహన చెప్పకనే తెలుస్తుంది.
కనుకే, సమర్థుడైన దక్షిణామూర్తి తత్త్వం అర్థం చేసుకుంటే అధ్యాత్మిక జీవితం సాఫల్యమవుతుంది.
భౌతిక దేహాన్ని అధిగమించి మనోదేహంపై నిగ్రహం సాధించి, ఆత్మసాధనకోసం ప్రయత్నించడానికి దక్షిణామూర్తి ఉపాసన తప్పనిసరి.
మేధోవికాసం కలుగాలంటే ఈ స్వామి ఉపాసన అనివార్యం. ఆధ్యాత్మిక విద్యలలో పురోగతిని సాధించడానికి ఈ మూర్తితత్త్వాన్ని అర్థం చేసుకోవాలి.
"ఓం నమో భగవతే దక్షిణామూర్తయే" మంత్రాన్ని ఉపాసించడం ద్వారా పరావిద్య సాధన, భవరోగాల నుండి ముక్తి, గురువులకు గురువుగా మిగిలే అవకాశాలు అందరికీ లభ్యమవుతాయని శాస్ర్తాలు చెబుతున్నాయి.
💥శ్రీదక్షిణామూర్తి స్తోత్రం💥
ధ్యానశ్లోకములు:
మౌనవ్యాఖ్యాప్రకటితపరబ్రహ్మతత్త్వం యువానం
వర్షిష్ఠాన్తే వసదృషిగణైఃరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేన్ద్రం కరకలితచిన్ముద్రమానన్దరూపం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే || 1 ||
వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణాం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి || 2 ||
చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః || 3 ||
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః || 4 ||
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే
నిర్మలాయ ప్రశాన్తాయ దక్షిణామూర్తయే నమః || 5 ||
ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వమ్
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై |
తం హ దేవమాత్మబుద్ధిప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే || 6 ||
ఓం శాంతిః శాంతిః శాంతిః
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment