💥శ్రీ సుబ్రహ్మణ్య స్వామి "నిత్య" పూజ లో "అథాంగ పూజ" నామాలు💥

 ⚜️🕉️🚩 ఓం వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః🌹🙏


మయూరాధిరూఢం మహావాక్యగూఢం

మనోహారిదేహం మహచ్చిత్తగేహం।

మహీ దేవదేవం మహావేదభావం

మహాదేవబాలం భజే లోకపాలం॥


భావం:

నెమలినినధిష్టించి యున్నవాడును, వేదాంత మహావాక్యములలో నిగూఢముగా నున్నవాడును, మనోహరమైన దేహము గలవాడును, మహాత్ముల చిత్తమునందు నివసించువాడును, బ్రాహ్మణుల కారాధ్యుడును, వేదములచే ప్రతిపాద్యుడును, మహాదేవుని నందనుడును, లోకపాలకుడు అయిన సుబ్రహ్మణ్యేశ్వరుని సేవించుచున్నాను.


💥శ్రీ సుబ్రహ్మణ్య స్వామి "నిత్య" పూజ లో "అథాంగ పూజ" నామాలు💥


💥#సుబ్రహ్మణ్య_అంగపూజ💥


ఓం వల్మీక భవాయ నమః - పాదౌ పూజయామి |


ఓం జితాసుర సైనికాయ నమః- జానునీ పూజయామి |


ఓం రౌద్రయే నమః - జంగే పూజయామి |


ఓం భయనాశనాయ నమః - ఊరూ పూజయామి


ఓం బాల గ్రహోచ్చాటనాయనమః - కటిం పూజయామి


ఓం భక్త పాలనాయనమః - నాభిం పూజయామి |


ఓం సర్వాభీష్ట ప్రదాయనమః -హృదయం పూజయామి |


ఓం విశాల వక్షసే నమః - వక్షస్థలం పూజయామి!


ఓం అభయ ప్రధాన ప్రశస్త హస్తాయ నమః - బాహూన్ పూజయామి |


ఓం నీలకంఠ తనయాయ నమః - కంఠం పూజయామి |


ఓం పతిత పావనాయ నమః - చుబుకం పూజయామి |


ఓం పురుష శ్రేషాయనమః - నాసికాం పూజయామి |


ఓం పుణ్యమూర్తయే నమః - శ్రవణాని పూజయామి |


ఓం కమల లోచనాయ నమః - నేత్రా పూజయామి |


ఓం కస్తూరీ తిలకాంచిత ఫాలాయ నమః - లలాటం

పూజయామి | 


ఓం వేదవిధుషే నమః - ముఖం పూజయామి |


ఓం త్రిలోక గురవే నమః - శిరః పూజయామి |


ఓం భస్మో ద్దూళిత విగ్రహాయ నమః - సర్వాణ్యం గాని

పూజయామి |


శరవణభవ శరవణభవ శరవణభవ పాహిమాం

శరవణభవ శరవణభవ శరవణభవ రక్షమాం🙏

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు