ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః 💥
⚜️🕉️🚩ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః🌹🙏
శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహన షడాననం
దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటద్వజమ్!!
"సుబ్రహ్మణ్య" అనే పదానికి సంస్కృత భాష లో బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న ఉత్తముడు అని అర్థం.
ఈయనను స్కందుడు, క్రౌంచధారణుడు, కుమారస్వామి, కార్తికేయుడు, శరవణభవుడు మొదలైన నామాలతో కొలుస్తారు.
శతాబ్దాలుగా కొనసాగుతున్న భారతదేశంలోని అనేక సంస్కృతుల కలయికతో ఏర్పడినదే సుబ్రహ్మణ్యారాధన. ఈయనలో శైవ - వైష్ణవ మతాలు మనకు కనిపిస్తాయి.
శైవమత పురాణాల ప్రకారం స్కందుడు శివుని పుత్రుడు. కనుక ఈయన శైవమతానికి చెందిన వాడు. భగవద్గీతలోని విభూతియోగములో శ్రీ కృష్ణుడు "సేనానీ నామ హం స్కన్ద" అనగా "సేనానులలో స్కందుడను నేనే" అని చెప్పడం ద్వారా ఈయన విష్ణాంశ సంభూతు నిగాను, వైష్ణవ మతానికి చెందినవాడు గాను పేర్కొనవచ్చును. శివ కేశవులకు బేధం లేదని చెప్పటానికి సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యక్ష నిదర్శనం.
శ్రీ పరమేశ్వర తేజస్సు షట్‌కృత్తికల గర్భంలో ప్రవేశింపగా, వారు దానిని భరింపలేక గంగాతీరాన విడువగా ఆరు ముఖాలతో, అమితమైన తేజస్సుతో సుబ్రహ్మణ్యుడు ఉద్భవిస్తాడు. అందువలన ఈయనను "షణ్ముఖుడు" అని వ్యవహరిస్తారు.
పరమేశ్వరుడు, పార్వతీదేవి తమతమ శక్తివంతమైన ఆయుధాలను ఈయనకు ప్రసాదిస్తారు. వాటి ప్రభావంతో తారకాసురుని సంహరించి లోకాలను కాపాడతాడు.
దేవతల కోరిక మేరకు స్కందుని దేవతల సేనానిగా పరమేశ్వరుడు నియమిస్తాడు. ఈ శుభ సందర్భంలో దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనతో అతి వైభవంగా వివాహం జరిపిస్తాడు.
సుబ్రహ్మణ్యుడు తాను వలచిన వల్లిదేవిని కూడా వివాహం చేసుకుంటాడు. వల్లిదేవి ఇచ్ఛాశక్తిగాను, దేవ సేన క్రియశక్తిగాను వ్యవహరింపబడతారు.
సుబ్రహ్మణ్యస్వామిలో జ్ఞాన, వైరాగ్య, బల, కీర్తి, సంపద, దైవశక్తి అనే ఆరు లక్షణాలు కనబడతాయి.
స్వామివారి ధ్వజమైన కోడిపుంజు (కుక్కుటము) ఉదయించే జ్ఞానాన్ని, ప్రకాశాన్ని సూచిస్తుంది.
తామస లక్షణాలైన అహంకారం, గర్వం, డాంబికం మొదలైన లక్షణాలకు ప్రతీకయైన నెమలిని అధిరోహంచటం ద్వారా, వాటిని అదుపు చేసే శక్తి సమన్వితుడుగా కొలువబడుతున్నాడు.
కార్తికేయుని మనస్ఫూర్తిగా, భక్తిశ్రద్ధలతో కొలిచేవారి కొంగుబంగారమై, ఏదో ఒక రూపంలో వచ్చి సమస్యలను పరిష్కరిస్తాడు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment