💥జగత్తుకే తొలిగురువు దక్షిణామూర్తి:
⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః🌹🙏
💥జగత్తుకే తొలిగురువు దక్షిణామూర్తి:
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే ।
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ॥
చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే ।
సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః ॥
గురువు ద్వారా ఎంతో కొంత జ్ఞానాన్ని ఆర్జించి, దానిని ఆచరణలో పెట్టినవాడే యోగిగా మారగలడు. కానీ ఎలాంటి గురువూ అవసరం లేకుండానే నిర్వికల్ప స్థితిని సాధించినవాడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే! అందుకనే ఆయనను ఆదియోగిగా కొలుచుకుంటున్నారు.
అలాంటి ఆదియోగి నుంచి జ్ఞానాన్ని పొందుదామనుకుని ఎందరో ప్రయత్నించి విఫలమైనారట. కానీ ఒక ఏడుగురు మాత్రం పట్టు విడువకుండా ఆయన చెంతనే ఉండిపోయారు. తమతో ఆయన ఒక్క మాట మాటలాడకున్నా గానీ సంవత్సరాల తరబడి ఆయన కరుణ కోసం వీక్షిస్తూ తపించిపోయారు.
శివుడు వారి పట్టుదలను పరీక్షించేందుకు దశాబ్దాల తరబడి వారికి ఎటు వంటి బోధా చేయలేదు. అయినా వారి పట్టు సడలనేలేదు. శివుని దివ్య సముఖంలో తపస్సుని ఆచరిస్తూ ఉండిపోయారు.
చివరికి ఒక రోజున వారిని గమనించిన శివుడు, జ్ఞానాన్ని స్వీకరించేంతటి తేజస్సు వారిలో ప్రకాశించడాన్ని గమనించాడు. అటుపై దక్షిణదిక్కుగా కూర్చుని వారికి ఉపదేశాన్ని అందించాడు.
అలా శివుడు దక్షిణా మూర్తిగా, జ్ఞానానికి అధిపతిగా మారాడు. ఆయన నుంచి యోగాన్ని అభ్యసించిన ఆ ఏడుగురూ సప్తర్షులు అయ్యారు.
శివుడు దక్షిణ దిక్కుగా ఎందుకు కూర్చున్నాడు అనడానికి ఒక హేతువు కనిపిస్తుంది. దక్షిణ దిక్కు యమస్థానం! అంటే మృత్యువుకి సంకేతం. ఆ మృత్యువుకి అతీతమైన జ్ఞానాన్ని, సంసార బంధనాలను ఛేదించే యోగాన్ని అందించేందుకే పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా మారాడంటారు పెద్దలు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment