💥ఆదిదేవుని ప్రమధగణాలు

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


💥ఆదిదేవుని ప్రమధగణాలు


రుద్ర సూక్తం లోని ఏకాదశ అనువాకంలో...


"సహస్రాణి సహస్రశో యే రుద్రా అది భూమ్యాం"


అంటే వీరు (ప్రమధ గణాలు) అన్నిచోట్లా వ్యాపించి ఉండే రుద్రశక్తులుగా ప్రార్థించబడ్డారు.


"ప్రమథ" అంటే బాగా మథించగలిగే వారని అర్థం.

వీరు దేవతల కన్నా ఎక్కువ శక్తి గలవారు. దేవతలను కూడా శిక్షించ గలవారు. వీరంటే దేవతలకు భయము, మరియు భక్తి. దేవతలు తప్పు ద్రోవ పడితే వారిని నిగ్రహించే వారు ప్రమథులు. 


మహాభక్తులై శివ లోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుజ్యం పొంది రుద్ర గణాలుగా ఉండి పోతారని ప్రతీతి. 


💥#వీరభద్రుడు:

దక్షయజ్ఞంలో శివాపచారం చేసిన దక్షుణ్ణి, విష్ణ్వాది దేవతలను శిక్షించిన శివ జటోధ్భవుడు.

తిరుగు లేని పరాక్రమవంతుడు.

సాక్షాత్ శివస్వరుపంగా పొగడబడే వాడు. అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి.


💥#ఆదివృషభం:

ధర్మదేవత. శివున్ని మోయగలిగె వరం పొంది, అతని సమీపంలో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభ మూర్తి. విష్ణు బ్రహ్మాదుల సృష్టికి పూర్వమే శివుడు ద్వితీయ శంభునిగా ధర్మ దేవతను వృషభ రూపంలో సృష్టిస్తాడు.


💥#నందీశ్వరుడు:

శైలాదుని పుత్రుడు. అది వృషభం యొక్క అవతారం. శివునికి రక్షగా, ఆంతరంగికునిగా ఉండే గణ మూర్తి. కైలాసానికి ఎవరు వచ్చినా ఇతని అనుమతి పొందితే గానీ శివదర్శనం లభించదు.


💥#భృంగి:

శివుని యొక్క పరమ భక్తుడు. భ్రమరము లాగా శివుని చుట్టూ ప్రదక్షణం చేయడం పనిగా ఉన్న వాడు కాబట్టి భృంగి అని పిలవబడ్డాడు.


కేవలం శివున్ని ఆరాధిస్తూ పార్వతీ దేవిని విస్మరించి శాపగస్తుడై తల్లి వల్ల వచ్చే రక్త, మాంసములను కోల్పోయి పడిపోతే శివుడు మూడవ కాలు ప్రసాదించాడు. 


💥#స్కందుడు:

కుమారస్వామి.. శివకుమారుడు. దేవసేనాధిపతి. బ్రహ్మజ్ఞాని.


💥#కాలాగ్నిరుద్రుడు లేదా కాలభైరవుడు:

బ్రహ్మ ఐదవ తలను తీసేసిన రుద్రుడు. కపాల హస్తుడు. కాశీ పురాధీశుడు.


💥#రిటి:

ఉద్దాలకుని పుత్రుడు. శివకృప చేత పరమ జ్ఞానిగా మారి శివ గణములలో చేరాడు.


💥#బాణుడు:

శివుని పరమభక్తుడు. శివునితోనే యుద్ధం కోరాడు.

తత్సముడైన వానితో నీ అభీష్టం నెరవేరుతుందని వరం పొందాడు. శ్రీ కృష్ణునితోయుద్ధం చేసి సహస్ర బాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరాడు. నర్మదా నదిలో లింగాలు ఇతనికి ఇచ్చిన వరం వల్ల బాణ లింగాలని పిలువ బడతాయి.


💥#చండీశుడు:

ఒక గోప బాలుడు. శివపూజకు గుడిలో అనుమతించరు అని, గొర్రె పెంటికను శివలింగంగా భావించి గొర్రె పాలతో పూజించాడు.


భక్తి తన్మయత్వంలో ఆ పెంటిక శివలింగంపై పడబోతున్న తన తండ్రి కాలినే నరికేసాడు. కైలాసం నుండి శివుడు పరుగున వచ్చి ఆ బాలునికి గణ ఆధిపత్యాన్ని, శివ ఉచ్చిష్టంపై అధికారాన్ని కలిగించాడు. శివ నింద చేసే వారికి అతడు చండశాసనుడు.


ఇలా ఎందరో ప్రమథ నాయకులు.

దదీచి, అగస్త్యుడు, ఉపమన్యుడు, పిప్పలాదుడు, దుర్వాసుడు మొదలైన అనేక మంది ఋషులు కూడా శాంభవ దీక్ష స్వీకరించి గణములలో స్థానం పొందినారు.


అంతే గాక విభూతి, రుద్రాక్షలు, శివలింగాన్ని ధరించి శాంభవ దీక్షలో ఉంటూ సంచరిస్తూ ఉండే ఎంతో మంది శివయోగులు కూడా ప్రమథ కులము వారే.


గణాలలో ఎన్నో రకాల వారు ఉంటారని బసవ పురాణం వివరిస్తుంది. 

వీరి శక్తుల, లీలల గురించి తెలుసుకోవాలంటే పాల్కురికి సోమనాథుని #బసవపురాణం చదవాల్సిందే!!

వీరి పేర్లు తలచుకోవడమే మహా ప్రసాదము.


శంకరస్య చరితామృత శ్రవణం,

చంద్రశేఖర గుణానుకీర్తనం

నీలకంఠ తవ పాదసేవనం,

సంభవంతు మమ జన్మని, జన్మని


         🔱🌹సర్వం పరమేశ్వరార్పణమస్తు🌹🔱

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు