ఆషాఢ మాసంలో బల్కం పేట ఎల్లమ్మకు బోనాలు

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏


 💥బోనాలు


తొలిబోనం గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి సమర్పించిన తర్వాత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బోనాల సంబరాలకు అంకురార్పణ జరుగుతుందని చెప్పొచ్చు. 


రెండో బోనం బల్కంపేట ఎల్లమ్మకు, మూడోబోనం లష్కర్‌గా పిలిచే సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, నాలుగో బోనం లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవార్లకు సమర్పించటం ఆనవాయితీ.


బల్కంపేట ఎల్లమ్మకు 700 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ తల్లికి బోనం, ఓడి బియ్యం పోసి సారే పెడతారు.


ఇక ఈ అమ్మవారిని కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తూ, వారి కోరికలను తీరుస్తుదంట.


అయితే ఈ దేవత హైదరాబాద్ ఏర్పడక ముందే బల్కంపేట ప్రాంతంలో కొలువుదీరిందంట.


ఓ రైతు తన పొలానికి నీరు సరిపోకపోవడంతో, బావి తవ్వించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆయన బావి తవ్వుతుండగా ఓ బండరాయి అడ్డుగా వచ్చింది. అది ఎంతకు పక్కకు జరగలేదు.


దీంతో ఊరి ప్రజలు కూడా వచ్చి దానిని జరపడానికి ప్రయత్నం చేసినా ఆ రాయి కదలలేదంట. ఇక అప్పుడు గ్రామస్తులు ఇది ఏమిటని ఆలోచించి, ఆరా తీయగా, రేణుక ఎల్లమ్మ తల్లి అని భావించి, విగ్రహం బావిలో ఉండగానే పూజలు చేశారంట.


తర్వాత అక్కడే ఆలయం కూడా నిర్మించారు.1919లో ఆ ప్రాంత సంస్థానాధీశుడుగా ఉన్న రాజా శివరాజ్ బహద్దూర్ ఆలయాన్ని నిర్మించారని సమాచారం.


బల్కంపేట్ ఎల్లమ్మ బావిలో పది అడుగుల లోతున శయన రూపంలో వెలిసింది. బావి పైభాగంలో మహామండపంలో అఖండజ్యోతి నిత్యం వెలుగుతూనే ఉంటుందని పురాణాల ద్వారా తెలుస్తోంది.


అప్పటి నుంచి ప్రజలందరూ బల్కంపేట ఎల్లమ్మ తల్లిని కొలుచుకుంటారు. తల్లిని భక్తితో కొలుచుకున్నా, అమ్మవారి తల వెనుక భాగం నుంచి ప్రవహించే జలధార నీటిని తీసుకొని ఇంటిని శుధ్ది చేసుకున్నా, స్నానం చేసినా ఎంతో మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.


ఆషాఢ మాసంలో  బల్కం పేట ఎల్లమ్మకు బోనాలు చేసి, కళ్యాణం జరిపిస్తారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు