ఆషాఢ పూర్ణిమ... గిరిపున్నమి..
⚜️🕉️🚩 ఓం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామినే నమః🌹🙏
💥ఆషాఢ పూర్ణిమ... గిరిపున్నమి..
జయజయ నృసింహ సర్వేశ |
భయహర వీర ప్రహ్లాద వరద ||
"ఆషాఢ పూర్ణిమ"ను సింహాచలంలో "గిరిపున్నమి" అని వ్యవహరిస్తారు. అక్షయ తృతీయ నుంచి నాలుగు విడతలుగా చందన సేవను స్వీకరించిన సింహాద్రి అప్పన్న గిరిపున్నమి నాటికి సంపూర్ణ రూపాన్ని ధరిస్తాడు.
ప్రతిఏటా ఆషాడ మాస శుక్లపక్ష చతుర్దశి రోజున సింహగిరి ప్రదక్షిణ చేసిన భక్తులు పౌర్ణమి రోజున సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం ఆనవాయితీ.
పౌర్ణమి నాడు నిండు చందమామను పోలిన స్వామి పరిపూర్ణ రూపాన్ని దర్శించుకుని మనసులోని కోర్కెను తీర్చాలని వేడుకుంటారు. ప్రధానంగా సంతాన సాఫల్యత కోరుకునే భక్తులు ఈ ప్రదక్షిణ చేయడం సంప్రదాయంగా వస్తోంది.
పున్నమికి ముందురోజు సాయంకాలం నుంచి 32 కిలోమీటర్ల దూరం కాలినడకన సింహాచల గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన వేలాది భక్తులు పున్నమినాడు స్వామి దర్శనం చేసుకుంటారు.
అలనాడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి.
తన తండ్రి, రాక్షసుడైన హిరణ్యకశిపుడు విష్ణువును చూపించమంటూ స్థంభాన్ని పగులగొట్టిన సమయంలో అందులోంచి మహావిష్ణువు నరసింహుడి అవతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని సంహరించాడన్న పురాణ కథ అందరికీ తెలిసిందే.
ఇలా తనకోసం ప్రత్యక్షమైన నరసింహుడి అవతారాన్ని ప్రహ్లాదుడు మొదటగా సింహాచలంలో ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.
అయితే సింహాచలంలోని ఆలయాన్ని మాత్రం పురూరవుడనే రాజు నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి.
పురూరవుడు సింహాచలం ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో ఇక్కడ నేలలో కప్పబడిన నరసింహస్వామి విగ్రహం బయటపడింది.
దాంతో ఆ రాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు.
అలాగే ఈసందర్భంగా ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు స్వామివారిని ఎల్లప్పుడూ చందనం పూతతోనే ఉంచే ఏర్పాటు చేశారు.
అలా ఆనాడు మొదలైన ఆచారమే నేటికీ కొనసాగుతోంది. స్వామివారిని ఏడాదిలో 12 రోజులు తప్ప మిగిలిన రోజులంతా చందనం పూతతోనే దర్శించాల్సి ఉంటుంది.
పరమాత్మ సర్వవ్యాపకుడు. ఈ సందేశాన్ని మనకు అందించినవాడు సింహాచలస్వామి.
వైశాఖ మాసంలో అక్షయ తృతీయ నాడు సింహాచల వరాహలక్ష్మీ నరసింహుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. అప్పటి నుంచి వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాల్లో పూర్ణిమ తిథుల్లో నాలుగు విడతలుగా స్వామికి చందనం సమర్పణ చేస్తారు.
ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి కొండ దిగువన ఉన్న తొలి పావంచా దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు.
అడుగులో అడుగేస్తూ.. అప్పన్న స్వామిని స్మరిస్తూ.. అలసట మరచిపోయి.. 32 కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేస్తారు భక్తులు.
గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు.
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖమ్!
నృసింహం భీషణం భద్రం
మృత్యోర్ మృత్యుం నమామ్యహం!!
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment