💥 శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం💥

 ⚜️🕉️🚩ఓం నమో వారాహ్యై నమః🌹🙏


💥ఆషాడ గుప్త నవరాత్రులు.. సప్తమి తిధి.. శుక్రవారం శ్రీ మహా వారాహి దేవి.


వింధ్యాచలము పైన సాక్షాత్తు ఆ కాశి విశ్వనాథస్వామి శ్రీ వారాహి అమ్మవారిని ప్రతిష్టించారు.  ఆ అమ్మవారిని స్థానికులు "వింధ్యేశ్వరి"గా  కొలుస్తారు.


వింధ్యాచల ప్రాంతంలో దేవిని  వామాచార విధానంలో ఆరాధించడమూ ఉన్నది. ఈ వింధ్యేశ్వరి స్తోత్రం ఎంతో ప్రభావవంతమైనది.


💥 శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం💥


నిశుంభ-శుంభ మర్దిని ప్రచండ ముండ ఖండినీం

వనే రణే ప్రకాశినీం భజామి వింధ్య వాసినీం ( 1 )


త్రిశూల ముండ ధారిణీం ధరా విఘాత హారిణీం

గృహే గృహే నివాసినీం భజామి వింధ్య వాసినీం ( 2 )


దరిద్ర దుఃఖ హరిణీం సదా విభూతి కారిణీమ్

వియోగ శోక హరిణీం భజామి వింధ్య వాసినీం ( 3 )


లసత్సులోల లోచనం లతాసదే వరప్రదం

కపాల శూల ధారిణీం భజామి వింధ్య వాసినీం ( 4 )


కరేముదా గదాధరీం శివమ్ శివ ప్రదాయినీమ్

వరం వరాననం శుభం భజామి వింధ్య వాసినీం ( 5 )


ఋషీంద్రయామినీ ప్రదం త్రిదా స్వరూపధారిణీం

జలే స్థలే నివాసినీం భజామి వింధ్య వాసినీం ( 6 )


విశిష్ట సృష్టి కారిణీమ్ విశాల రూప ధారిణీం

మహోదరే విలాసినీమ్ భజామి వింధ్య వాసినీం ( 7 )


పురంధరాది సేవితం మురాది వంశ ఖండినీమ్

విశుద్ధ బుద్ది కారిణీమ్ భజామి వింధ్య వాసినీం ( 8 )


ఇతి శ్రీ వింధ్యేశ్వరి (వారాహి దేవి) స్తోత్రం సంపూర్ణం.


💥అమ్మవారి అనుగ్రహం పొందే స్త్రోత్రం ఇది. ప్రతి రోజు పారాయణ  చేస్తే అన్ని శుభాలను ప్రసాదిస్తుంది.


తరచూ అనారోగ్యంతో ఉండే వాళ్ళు ఈ అష్టోత్తరంతో అర్చన చేస్తే మంచిది, ఈమె ఆయుష్షుని వృద్ధి చేస్తుంది, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది, ఈమె రథంలో ఎప్పుడూ ధన్వంతరి (వైద్యుడు), దేవ వైద్యులైన అశ్వినీ దేవతలూ ఉంటారు. 


🌹నమో వారాహి శరణం 🌹

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు