💥🌿బిల్వాష్టకం🌿💥

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


"బిల్వాష్టకం" అనేది మహాశివునికి సంబంధించిన పవిత్ర మంత్రం. బిల్వపత్ర విశిష్ట ధర్మాలను ఇంకా దానిపై శివుడి ప్రేమను ప్రసిద్ధమైన "బిల్వాష్టకం" స్తుతిస్తుంది. 


💥🌿బిల్వాష్టకం🌿💥


త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ ।

త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥


అర్థం -- మూడు దళాలు త్రిగుణముల ఆకారముగా, మూడు నేత్రములు కలవాడు, త్రిశూలము ఆయుధముగా కలవాడు, మూడు జన్మములలోని పాపములను హరించువాడు అయిన శివునికి మూడు ఆకులు గల బిల్వపత్రమును సమర్పించుచున్నాను.


త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః ।

తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్ ॥


అర్థం -- ఓ మహాదేవా! చీలికలు లేని కోమలమైన, శుభప్రదమైన మూడు శాఖలు గల బిల్వపత్రముతో నిన్ను పూజించుచున్నాను.


కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః ।

కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణమ్ ॥


అర్థం -- కోటి కన్యాదానములు, కోటి తిల పర్వతములను,

బంగారు కొండను దానమిచ్చిన ఎట్టి ఫలమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను.


కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనమ్ ।

ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణమ్ ॥


అర్థం -- కాశీ క్షేత్రమునందు నివాసము గల, కాలభైరవుని ధర్శనము, ప్రయాగ క్షేత్రమున మాధవుని ధర్శనము వల్ల ఎట్టి ఫలితము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను.


ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః ।

నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణమ్ ॥


అర్థం -- ప్రతి సోమవారం ఉపవాస వ్రతమాచరించి,

రాత్రి హోమము చేసిన ఎట్టి ఫలితము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను.


రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా ।

తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణమ్ ॥


అర్థం -- రామునిచే ప్రతిష్టించబడ్డ శివ లింగము, వివాహము నిర్వహించుట, ఎన్నో తాటాకము (బావి) త్రవ్వించుట, పుత్ర సంతతి కలిగియుండుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను.


అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనమ్ ।

కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణమ్ ॥


అర్థం -- శివ సహస్రనామ పఠనముతో శివుని అర్చించడం వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను.


ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ ।

భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణమ్ ॥


అర్థం -- పార్వతీ సమేతుడు, నంది వాహనుడు,

భస్మము పూయబడిన శరీరము కలవాడైన శివునికి బిల్వదళమును సమర్పించుచున్నాను.


సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః ।

యజ్ఞ్నకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణమ్ ॥


అర్థం -- బ్రాహ్మణులకు సాలగ్రామములు దానము చేయుట, పది కోట్ల తటాకములు త్రవ్వించుట, వేలకోట్ల యజ్ఞములు చేయుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను.


దంతి కోటి సహస్రేషు అశ్వమేధశతక్రతౌ చ ।

కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణమ్ ॥


అర్థం -- అశ్వమేధముతో పాటు నూరు యజ్ఞములు చేసి, వేల కోట్ల ఏనుగులను దానమిచ్చుట, కోటి మంది కన్యలను దానము చేయట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను.


బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనమ్ ।

అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥


అర్థం -- బిల్వదళము యొక్క దర్శనం పుణ్యం, దానిని తాకినా పాపములు నాశనం, ఆఘూర పాపములను నశింపజేయునట్టి బిల్వ దళమును శివునికి అర్పించుచున్నాను.


సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపనముచ్యతే ।

అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణమ్ ॥


అర్థం -- బ్రహ్మతత్వము స్థాపితమైన వేద పాఠములను వేల సార్లు పఠించుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను.


అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తధా ।

అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణమ్ ॥


అర్థం -- వేలాది మందికి అన్నదానము, వేయి ఉపనయనములు చేయించుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను.

అనేక జన్మలలో చేసిన పాపము నశించును.


బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।

శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణమ్ ॥


అర్థం -- అచంచలమైన భక్తితో శివుని సన్నిధిలో ఈ బిల్వ స్తోత్రమును పఠించినవారికి శివలోకము ప్రాప్తించును.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం