⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
💥ఒకవేళ ఎప్పుడయినా ఆధ్యాత్మిక ఆలోచన కలిగినా చిత్తచాంచల్యం వల్ల తిరిగి ఐహిక సంపర్కంలో పడిపోతాము.
దానికి ఉదాహరణగా కథ...
ఓ వ్యక్తికి దేని ప్రభావం వల్లో హటాత్తుగా సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసం స్వీకరించాలనే బుద్ది పుట్టింది.
అలా అనుకున్నదే తడవుగా అతడు ఊరికి దూరంగా అడవిలో ఓ కుటీరాన్ని ఏర్పరచుకుని అందులో కౌపీన ధారియై నివసించసాగేడు.
అతడు రెండే రెండు కౌపీనాలు (గోచీలు) మాత్రమే తెచ్చుకున్నాడు. ఒకటి ధరించడానికీ, మరొకటి ఉతికి ఆరేసి మర్నాడు ధరించడానికీ.
అలా ఆరేసిన కౌపీనాన్ని ఎలుకలు కొరికివేయసాగేయి.
ఇలా లాభం లేదని ఎలుకల భయం లేకుండా ఉండడానికి ఓ పిల్లిని తెచ్చి పెంచసాగేడు.
మరి ఆ పిల్లికి ఆహారమో..?
అందుకని దానికి పాల కోసం ఓ గోవును తెచ్చుకున్నాడు.
పిల్లికయితే ఆ ఆవుపాలను పోస్తున్నాడు.
మరి ఆ ఆవుకు మేత ఓ..? దానిని మేతకు తీసుకెళ్లడం, పాలు పితకడం ఇత్యాది పనులు చేయడానికి ఓ కుర్రవాడ్ని పెట్టుకున్నాడు.
మరి ఎక్కడి నుండో వచ్చిన ఆ కుర్రవాడికి భోజనం..? వాడి కోసం వండి వడ్డించే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి.
ఇదంతా ఎందుకని ఏకంగా తనే పెళ్లి చేసేసుకున్నాడు.
చూసేరా..!
"కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపః" అంటే ఇదే.
దీన్నే "మర్కట సన్యాసం" అంటారు.
💥అయితే ఆపద్ధర్మం కోసం సాధువైన ఓ దొంగ నిజంగా సాధువుగా మారిన ఉదంతం కూడా ఉంది...
ఓ దొంగ ఓ రోజు పట్టపగలు రాజభవనంలో కాపలా దారుల కళ్ళు కప్పి దొంగతనం చేసేడు. ఏదో అలికిడి అయి అప్రమత్తమైన కాపలాదార్లు పారిపోతున్న దొంగను చూసి వెంబడించేరు.
ఆ దొంగ పరిగెడుతూ ఇక వాళ్ళ నుండి తప్పించుకోవడం కష్టమని తెలిసి ఆ దొంగిలించిన సొత్తును వాళ్ళ కంట పడకుండా విసిరేసి పోతూ ఊరి చివర స్మశానంలో ఉన్న బూడిదను వంటి నిండా పూసుకుని ఓ చెట్టుక్రింద సాధువేషంలో కూర్చున్నాడు.
రాజభటులు వచ్చి దొంగ ఎక్కడా కనబడక పోయేసరికి తప్పించుకుని పారిపోయి ఉంటాడని అనుకుని అక్కడ చెట్టు క్రింద ఉన్న సాధువును చూసి ధ్యానమగ్నుడై ఉన్నాడని తలచి అతనికి మ్రొక్కేరు.
ఈ వార్త ఊరంతా ప్రాకి ఊరిబయట ఓ సాధు పుంగవుడు ఉన్నాడని తెలిసి జనం అంతా తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుని మ్రొక్కుతూ ఫల పుష్పాదులు సమర్పించుకోసాగేరు.
అప్పుడా దొంగ.. “ఆహా..! నేను సాధువు వేషంలో ఉంటేనే ప్రజలు నన్ను ఇంతగా ఆరాధిస్తున్నారు. అలాంటిది నేను నిజంగా సాధువునైతే భగవంతుడి కృప నాకు లభిస్తుంది.” అని అనుకుని.. ఆ నాటినుండీ ఆ దొంగ నిజమైన సాధువుగా మారిపోయేడు.
చూసేరా..! వేషధారణ ఎంత మార్పు తీసుకువచ్చిందో.
జీవన వాసనా ప్రభావం అటువంటిది...
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment