🌷💥సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం💥🌷

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః🌹🙏


💥మంత్రము అందరూ చేయలేరు. బీజాక్షరాలు అందరూ  చేయలేరు అని  మంత్రములలో ఉండే సమస్త సారాన్ని స్తోత్రముల క్రింద ఇచ్చారు మన పెద్దలు.


సాధారణంగా ఋషులు, జగద్గురువులు చేసిన స్తోత్రములు శక్తి వంతములు అయి ఉంటాయి.


ఈ స్తోత్రం దేవతలు అందరూ వైకుంఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి వారికి కనపడిన రూపాలలో చేసిన స్తోత్రం. ఇది చాలా అద్భుతమైన స్తోత్రం.


కనీసం 41 రోజులు క్రమం తప్పకుండా పారాయణం చేసి ప్రతి శుక్రవారం ఆవుపాలతో చేసిన పరమాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే సమస్త సంపదలు కలుగుతాయని.. వివాహానికి ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయని పండితులు చెబుతారు. 


ఇది చదవడం వలన అపారమైన ఐశ్వర్యం కలుగుతుంది. భగవంతుని పట్ల అపారమైన భక్తి కలుగుతుంది.  దీనిని సంక్షిప్త కనకధారగా చెప్పవచ్చు.


🌷💥సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం💥🌷


క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే।

శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే॥


ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే।

త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలం।


సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ।

రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః॥


కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా।

స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే॥


వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ।

గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః॥


కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయం।

రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే॥


కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే।

విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ।


పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే।

కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే॥


కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ।

రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే॥


ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా।

రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః॥


ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం।

యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువం॥


అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీం।

సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీం॥


పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం।

అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినం॥


పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినం।

భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియం॥


హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్॥

కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువం॥


సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనం।

హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదం॥


॥ ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణమ్ ॥

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు