💥చైత్రపౌర్ణమి.. హనుమద్విజయోత్సవం.
⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏
💥చైత్రపౌర్ణమి.. హనుమద్విజయోత్సవం.
శ్రీరామునికి అత్యంత నమ్మకమైన బంటు హనుమంతుడు.
శ్రీరాముడు సీతను ఎడబాసి మానసిక క్షోభను అనుభవిస్తూ, సీత జాడ వెతుకుతున్న సందర్భ సమయంలో అడవిలో రాముడుకి హనుమంతునితో పరిచయం ఏర్పడినది.
పరిచయం ఏర్పడిన నాటి నుండి శ్రీరామచంద్రున్ని హనుమంతుడు విడిచి ఉండలేదు, రాముడే తన సర్వస్వంగా భావించిన వాయునందనుడు తన ప్రభువైన రాముని మాట ఏనాడు జవదాటలేదు.
హనుమంతుని సహాయంతో సీత జాడను వెతకడం, లంకేశ్వర్వునితో రాముడు పోరాటం చేయుటకు సముద్రంపై వారధి కట్టుటలో హనుమంతునిది ప్రధాన పాత్ర.
లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చి ప్రాణాపాయం నుండి రక్షించండము, ఇలా ఎన్నో సందర్భాలలో హనుమంతుడు తన రాముని కొరకు నిర్వీరామ కృషి చేసాడు.
హనుమంతుని శరీరంలోని రోమ రోమానికి తన రాముని స్మరణ తప్ప వేరే లేదని నిరూపించాడు, తన హృదయాన్ని చీల్చి సీతా రాములను చూపించాడు. ఇలా హనుమంతునికి రామునికి మధ్యన అన్యోనతలు ఎన్నో కనబడతాయి.
చివరికి రాముడు రావణునితో యుద్ధం చేసి సీతను తీసుకుని అయోధ్యకు వచ్చి శ్రీ రామ పట్టాభిషేకం అయిన తర్వాత రామునికి అనిపిస్తుంది..
హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీత తిరిగి వచ్చినది, తిరిగి అయోధ్య నగరంలో రాముని పట్టాభిషేకంతో ప్రజలు ఆనందంగా ఉండడం గ్రహించిన రాముడు..
నాకు అన్ని వేళల హనుమంతుడు సహాయంగా ఉన్నాడు అని, తన విజయమునకు హనుమంతుని సహకారం ఎంతగానో తోడ్పడినది అని రాముడు చైత్ర పౌర్ణమి రోజు హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు.
నాటి నుండి ఆ రాజ్య ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకుని తమ రాజైన రాముడు ఆంజనేయుని ఏ చైత్ర పౌర్ణమి రోజు సన్మానం చేసాడో ప్రతి సంవత్సరం చైత్రపౌర్ణమి రోజు శ్రీ హనుమత్ విజయోత్సవంగా.. నాటి నుండి నేటి వరకు ఘనంగా వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment