⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏


నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం

నమత్సురారి నిర్జరం నతాధికాప దుర్ధరమ్ |

సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం

మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ ||


💥ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి పూనుకోగా, ఆయనకు అనేక విఘ్నాలు ఎదురయ్యాయి. 


ఎంత ప్రయత్నించినా ఆయన కార్యం ముందుకు కదల్లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు, పరబ్రహ్మను గురించి తీవ్రమైన తపస్సు చేశాడు.


ఎన్నో దివ్యసంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత, పరబ్రహ్మ వక్రతుండ గణపతిగా సాక్షాత్కరించి, బ్రహ్మదేవుడికి వక్రతుండ మంత్రాన్ని ఉపదేశించారు. 


అంటే భాద్రపద శుద్ధ చవితి నాడు పార్వతీ మాత చేత శ్రీ గణేశుడి సృష్టించబడటానికి పూర్వం నుంచి కూడా ఆయన ఉన్నాడు.


శివపార్వతుల కల్యాణంలో కూడా గణపతిని పూజించారు. అంటే గణపతి ఈనాటి వాడు కాదు. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మము.


అందుకే ఒకనాడు ముద్గల, గర్గ మహర్షులతో కలిసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గణపతిని పరబ్రహ్మంగా స్తుతించిన స్తోత్రం కూడా ఉంది.


సనాతన ధర్మంలోనే శైవం, శాక్తేయం, వైష్ణవం వలె గాణాపత్యం అనే మతం కూడా ఉంది. ఇందులో గణపతిని పరబ్రహ్మంగా, మిగితా దేవీదేవతలంతా ఆయన అంశలుగా భావించి ఉపాసిస్తారు. ఆయనే ఆది మూలంగా ఉపాసిస్తారు.


సంపదలను కలిగించి, పోషించువాడు, నిధులను ఇచ్చువాడు, అన్నసమృద్ధిని ఇచ్చువాడు అంటూ ఆ మంత్రం ఎన్నో రకాలుగా స్వామి వైభావన్ని ప్రకటించి, చివరలో వక్రతుండ షడక్షర మంత్రంతో ముగుస్తుంది. 


బ్రహ్మదేవుడు ఆ మంత్రం మీద ధ్యానం చేసి, ఆ తర్వాత సృష్టి చేయడాన్ని ఆరంభించాడు. అప్పుడు ఆయనకున్న విఘ్నాలన్నీ తొలగి, సృష్టి సజావుగా సాగింది.


ఇదే విషయం ఉమామహేశ్వరుల సంవాదం రూపంలో శ్రీ కృష్ణాయామల తంత్రంలో కనిపిస్తుంది. అందులో 


సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || 


సృష్ట్యాదిలో బ్రహ్మదేవుడు ఎవరినైతే విశేషంగా పూజించి, ఫలసిద్ధిని పొందాడో, అటువంటి పార్వతీ పుత్రుడైన శ్రీ గణనాథుడు నా ఋణములను నాశనం చేయుగాకా అని ఉంది.


ఇప్పుడు మనకొక సందేహం వస్తుంది. బ్రహ్మదేవునకు విఘ్నాలు కలగటం ఏమిటి?....


త్వమేవ కేవలం కర్తాసి అని గణపతి అథర్వశీర్షోపనిషత్తు వర్ణించింది. అంటే ఈ సమస్త సృష్టిలో కేవలం గణపతి మాత్రమే కర్త. మిలిగినవారు అంటే పిపీలికాది బ్రహ్మ ప్రయంతం ఉన్న జీవులంతా పాత్రధారులు మాత్రమే. 


తానే కర్తను అనుకోవడం వల్లనే జీవులకు కర్మఫలం అంటుకుని, జననమరణ చక్రంలో కొట్టుకుపోవలసి వస్తోంది. తాను కర్తను కాదు, భగవంతుడే కర్త, అన్నీ ఆయనే చేస్తున్నాడు, నేను కేవలం పాత్రధారిని మాత్రమేననే భావన కలిగి ఉంటే, మరణానంతరం నేరుగా బ్రహ్మంలో ఐక్యమవుతాము.


దీనికి ప్రధానమైన కారణం అహంకారం. అందుకే అహం నశిస్తే, అన్నీ నశిస్తాయని భగవాన్ రమణ మహర్షి అన్నారు.


బ్రహ్మదేవుడు కూడా తానే ఈ సృష్టికి కర్తను అనుకుని ఉంటాడు. అందుకే ఆయనలో కలిగిన ఆ అహంభావాన్ని తొలగించడానికి పరబ్రహ్మ స్వరూపమైన గణపతి/ విఘ్నాధిపతి/ విఘ్నరాజు విఘ్నాన్ని కలిగించాడు.


ఇది అస్తిత్వంలోకి రాబోయే లోకానికి, జీవులకు ఎంతో ప్రేమతో, కరుణతో వక్రతుండుడు చేసిన తొలి ఉపదేశం. 


దీన్ని ఒక్కదాన్ని జాగ్రత్తగా జీవితంలో పాటించినా, జీవులు త్వరితగతిన ఆ పరబ్రహ్మరూపమైన గణపతిలో ఐక్యమవుతారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం