⚜️🕉️🚩 ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః🌹🙏
⚜️🕉️🚩 ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః🌹🙏
💥శక్తి స్వరూపిణి... త్రైలోక్య సంచారిణి... వేదమాత...
అమ్మలగన్నయమ్మ... ముగ్గురమ్మల మూలపుటమ్మ...
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకైన శ్రీ జగదాంబ
సృష్టి, స్థితి, లయల కొరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను
తన ఆధీనం చేసుకుంటూ
షోడశాదశ మంత్రానికి అధిష్టాన దేవతగా,
శ్రీచక్ర నీరాజనాలందుకునే ఏకాదశ శక్తుల సంగ్రహంగా, అపరాజితగా కొలువులందుకునే తల్లి,
పరాశక్తి, మంత్రశక్తి, ప్రాణశక్తి, కళాశక్తి, విశ్వశక్తి, విద్యాశక్తి, వాగ్వైభవశక్తి, సంహారశక్తి, ఆదిపరాశక్తి, ధార్మిక శక్తి, విజయశక్తులు దేవిలో నిండి నిబిడీకృతమై ఉండే దేవతే #గాయత్రీమాత .
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయైు ముఖైస్త్రీ క్షణైః
యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్
గాయత్రీం వరదాభయాం కుశకశా శ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మథారవింద యుగళం హస్తైర్వహంతీం భజే!
💥సకల వేద స్వరూపం గాయత్రీ దేవి.
అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత.
ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన
అయిదు ముఖాలతో, శంఖం , చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది.
ఆది శంకరులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు.
ప్రాత: కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది.
ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.
💥"న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్"
అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము -
అనగా తల్లిని మించిన దైవము లేదు.
గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము.
💥"గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ" అని
ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు.
'గయలు' అనగా ప్రాణములు అని అర్థము.
'త్రాయతే' అనగా రక్షించడం.
కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం.
💥💥గాయత్రీ మంత్రము💥💥
ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్
💥ప్రతి పదార్థం:
గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన.
ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది.
మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి.
ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.
భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).
భువః = చిత్ స్వరూపుడు (జ్ఞాన రూపుడు).
స్వః = ఆనంద స్వరూపుడు (దుఃఖరహితుడు).
తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు.
సవితుః = ఈ సృష్టి కర్త.
వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.
భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).
దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.
ధీమహి = హృదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)
యః = ఆ పరమేశ్వరుడు.
నః ద్యః = మా బుద్ధులను.
ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక.
గాయత్రీ మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలితాన్నిస్తుంది.
ఈ తల్లిని ధ్యానించడం వల్ల మంత్ర సిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి.
పూజించిన వారికి సద్భుద్ధులు కలుగుతాయి.
పాపాలు నశిస్తాయి. అజ్ఞానం తొలగిపోతుంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment