ఓం నమః శివాయ 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


నమోదేవాయ మహతే దేవదేవాయ శూలినే |

త్ర్యంబకాయ త్రినేత్రాయ యోగినాంపతయే నమః | |


నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే |

శంభవే స్థాణవే నిత్యం శివాయ పరమాత్మనే | |


💥పినాకపాణి, వృషధ్వజుడు, విశాలాక్షుడు, సదానందుడు, శ్మశానవాసి, శైలధన్వుడు, శశిశేఖరుడు, కపర్ది అంటూ ఎన్ని పేర్లు పిలిచినా అవన్నీ ఒక్క శంకరునికే చెల్లుతాయి.


అటువంటి కైలాసవాసునకు వారు వీరను తేడాల్లేవు. రాక్షసులు దేవతలు, మనుష్యులు ఎవరైనా ఆయన్ను సేవించేవారే.


రాజు-పేద, ఆడ - మగ, పశువు-పక్షి, పాము- చీమ శివుని పూజించేవారే. శివప్రేమను చూరగొంటే చాలు, శివతత్వం అర్థం చేసుకొంటేచాలు మనం శివునిగానే మారిపోవచ్చు. 


శివపూజకు ఏ షరతుల్లేవు. అవధులూ లేవు. శివా అనని మనుష్యులు ఎవరూ ఉండరేమో అని అన్నా దోషం లేదేమో అనిపించేంతటి అందరినీ ఆకర్షించేంతటి ప్రేమాళువు శివుడు.


'శివ’ శబ్దంలో, ‘శం’ అంటే నిత్య సుఖము, ఆనందము. ‘ఇ’ కారము పరమ పురుషుడు. ‘వ’కారము-అమృత స్వరూపిణి అయిన ‘శక్తి’.


ఈ ముగ్గురి సమ్మేళనమే అనగా ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివ శబ్దార్ధము.


శివుడు నిరాడంబరుడు. స్మశానం ఆయన నివాసం. నాగుపాము ఆయన ఆభరణం. కట్టుకునేవి చర్మాంబరాలు. ఆయన పూసుకునే లేపనం బూడిద. ఇందులోంచే మనిషికి అత్యంత అవసరమైన జీవిత సత్యాన్ని ఎరుక పరుస్తున్నాడు శివుడు.


కాని శివుడిని ఉమ్మెత పూలతో పూజిస్తే పుత్రప్రాప్తి, జాజి పూలతో పూజిస్తే వాహన ప్రాప్తి, తుమ్మి పూలతో పూజిస్తే మోక్ష ప్రాప్తి, నందివర్థనం తో పూజిస్తే సౌందర్య ప్రాప్తి, నువ్వు పూలతో పూజిస్తే యవ్వన ప్రాప్తి, గన్నేరు పూలతో పూజిస్తే శత్రు నాశనం, శిరీష పుష్పాలతో పూజిస్తే సంతోషం కలుగుతుందని త్రయంబకుడు సెలవిచ్చినట్టు శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి.


అపమృత్యు భయంతో బాధపడేవారు పరిశుభ్రమైన నువ్వుల నూనెను శివలింగంపై పోసి, మృత్యుంజయ జపాన్ని చేస్తే ఆ పరమశివుడు అపమృత్యువునుంచి కాపాడతాడని శివపురాణం చెబుతుంది. 


మార్కండేయుని కాపాడిన శివుడు.. శివుణ్ణి తప్ప అన్యమెరుగని వారిని తనకై తాను వచ్చికాపాడుతాడు.


అజ్ఞానానికో, పాపాచరణానికో లేక తమోగుణానికో సాధారణ మానవుడు లొంగే సమయంలో చింత లేదు చెంతనే నేనున్నాననే లింగోద్భవం జరిగింది.


నిశరాత్రివేళ జ్వాలాయమానమైన లోకాల్ని వెలుగులు విరజిమ్మేట్టుగా లింగరూపంలో ఆది అంతంలేని స్వామి వెన్నెల విరితాల్పుగా ఆవిర్భవించాడు.


మహాశివుడు సృష్టి, స్థితి లయ కారకుడు. ఆయుష్షు, ఐశ్వర్యాలకు అధీష్టాన దేవుడు ఆయనే. మనిషిలోని సత్వరజస్తమో గుణాలకి పరమ శివుడే ప్రతీక.


'శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే’ అంటూ శివకేశవులు అభేదులు. శివుని హృదయంలో విష్ణువు; విష్ణువు హృదయంలో శివుడు సుస్థిరమై ఉంటారు 


అందుకే శివరాత్రి వేళ మహావిష్ణువును పూజించినా పరమశివుడు పరమానందంతో అనేక కోట్ల పుణ్యరాశిని మన వశం చేస్తాడని ఐతిహ్యం.


"ఓం నమః శివాయ" అంటే చాలు శివకేశవులిద్దరూ ఆనందచిత్తంతో భక్తులను కాపాడడంలో ముందుంటారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం