💥శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం💥

 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏


💥అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు...

కోరిన కోర్కెలీడేర్చే దేవుడు..

కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు..

భక్తుల పాలిట కొంగు బంగారం..

కలియుగ ప్రత్యక్ష దైవం... ఆ తిరుమలేశుడు.


పిలిచినంతనే పలికే దేవుడు.. భక్త జనులకు కొండంత అండ ఆయనే..

సకల జనులను నిత్యం కాపాడే గోవిందుడు..

ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడు. 


ఆ కమలనాభుని ఒక్కసారి దర్శించుకుంటే చాలు సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం.


ఒక్క క్షణం ఆ తిరుమలేశుని దర్శనం అయితే చాలు.. సకలం.. సర్వం మరచి.. భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. ఆ వేంకటేశ్వరుని దర్శనం కాగానే... సకల భక్త కోటి అణువణువూ పులకించిపోతుంది.


వేం అంటే పాపాలు, కట అంటే తొలగించే, ఈశ్వరుడు అంటే దేవుడు.

భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వేంకటేశ్వర నామము ప్రసిద్ధి చెందింది.

మానవ జీవితంలో కలిగే ఆపదలను తొలగించే దేవునిగా, ఆపదమొక్కుల వాడిగా జగత్ప్రసిద్ధి.


💥శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం💥


మార్కండేయ ఉవాచ ।


నారాయణం పరబ్రహ్మ సర్వ-కారణ-కారణమ్ ।

ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ ॥ 1 ॥


సహస్ర-శీర్షా పురుషో వేంకటేశ-శ్శిరోఽవతు ।

ప్రాణేశః ప్రాణ-నిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః ॥ 2 ॥


ఆకాశరా-ట్సుతానాథ ఆత్మానం మే సదావతు ।

దేవదేవోత్తమో పాయాద్దేహం మే వేంకటేశ్వరః ॥ 3 ॥


సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా-నిరీశ్వరః ।

పాలయేన్మాం సదా కర్మ-సాఫల్యం నః ప్రయచ్ఛతు ॥ 4 ॥


య ఏత-ద్వజ్రకవచ-మభేద్యం వేంకటేశితుః ।

సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ॥ 5 ॥


ఇతి మార్కండేయ-కృతం శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ-స్తోత్రం సంపూర్ణమ్ ॥

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు