⚜️🕉️🚩 ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః
⚜️🕉️🚩 ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః🌹🙏
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥
💥"ఆచార్యేంద్రం" అంటే ఆయన కన్నా ముందు ఆచార్యుడెవరూ లేరు. ఆచార్యులలో ఇంద్రుని వంటివాడు. అనగా శ్రేష్ఠుడు.
ఆచార్యులలో మొదటివాడు దక్షిణామూర్తి. కాబట్టి అందరూ గురు పరంపరను ప్రారంభించేటప్పుడు
''సదాశివ సమారంభాం, శంకరాచార్య మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం, వందే గురుపరంపరం'' అని ప్రార్థిస్తారు.
💥"#కరకలిత_చిన్ముద్రమానందమూర్తిం"అంటే చేతితో చిన్ముద్రను ధరించి, సచ్చిదానంద స్వరూపంగా కళ్ళముందు కనబడుతున్నాడు.
అలా దర్శించారీ బ్రహ్మనిష్ఠులు. ఇంకా ఎలా ఉన్నాడు?
"స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే" --
"#స్వాత్మారామం" అంటే తనలో తాను రమిస్తూ ఉన్నవాడు.
స్వాత్మారాముడు. ఇక్కడ రెండు శబ్దాలున్నాయి. స్వాత్మ, ఆరామ, స్వాత్మారామ.
స్వ ఆత్మారామముగా ఉన్నాడు. తాను తానైన స్థితిలో, తనను తానెరుగక ఉన్నాడు అని అర్థం.
అంతేకానీ జడుడుగా ఉన్నాడని కాదు. పూర్ణము, శూన్యము రెండూ ఒకే రకంగా సూచితమౌతాయి. పూర్ణము అంటే సర్వం. పూర్ణము అంటే శూన్యము కూడా.
కాబట్టి ఈ స్వాత్మారామ స్థితి అంటే తనయందు తాను రమించుతూ తనను తాను గుర్తెరుగక యున్నాడు. అంటే ఎరుక లేక మాయకు అతీతుడై ఉన్నాడు.
తనయందు తాను రమించుచున్నాడు. తనను తాను గుర్తెరుగక ఉన్నాడు. తాననే ఎరుక లేక ఉన్నాడు. బ్రహ్మమనెడి ఎరుక లేక ఉన్నాడు. ఇది స్వాత్మారామం.
"#ముదిత_వదనం" అంటే మందస్మిత వదనారవిందము. ప్రపంచంలో ఏ దేవతా విగ్రహాలైనా మందస్మిత వదనారవిందంతో ఉంటాయి. అదే ముదిత వదనం.
ఆచార్యుల కళ్ళు సూర్యచంద్రులు. కాబట్టి ఆయన ప్రకాశమే స్వరూపంగా కలిగినటువంటివాడు. ఆయన ద్వారా ప్రకాశం ప్రకటితమౌతుంది. ముదితవదనమంటే అర్థం ఇది.
ప్రకాశమే స్వరూపంగా ప్రకటిస్తున్నవాడు, ఆ అమృత స్వరూపుడు ఆ ప్రకాశం అంటే నీవు అమృత స్వరూపుడివి అనే సూచన చేయడమే ఆ ముదిత వదనానికి అర్థం.
సహజ నిర్వికల్ప సమాధి నిష్ఠుడు అయిన మహానుభావుడి యొక్క వదనం ఎలా ఉందట?
ఆయనని చూచిన ప్రతి ఒక్కరికీ తాను అమృత స్వరూపుడనని తోచిందట. అప్పటివరకూ శరీరం నేనుగా, ప్రాణం నేనుగా, మనసు నేనుగా, బుద్ధి నేనుగా సమాజమందు, ప్రపంచయుత సంబంధాలతో కూడిన నేనుగా ప్రతిఫలించిన ప్రతిబింబముగా ఉన్నవాడు. దేశికేంద్రుని యొక్క దర్శనం చేత ఒక స్ఫురణ కలిగింది. ముదిత వదనం వలన ఒక స్ఫురణ కలిగింది. నేను అమృత స్వరూపుణ్ణి అని.
క్యూలో నిలబడి వేంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళినప్పుడు రెండు లిప్తల కాలం మాత్రమే దర్శించడానికి అవుతుంది. అది చాలట. ఆ రెప్పపాటు కాలంలో నేను అమృత స్వరూపుడను, నేను మరణమే లేనివాడను అనే స్ఫురణ నీకు కలుగుతుంది.
మరణం ఎందుకు లేదంటే నేను పుట్టుకే లేనివాడను గనుక.. నేను అమృత స్వరూపుణ్ణి అనే మేలుకొలుపు కలిగిందట. అదీ ముదిత వదనం యొక్క ప్రభావం.
''స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే''
ఆ దక్షిణామూర్తిని దర్శించిన మహానుభావులకు వెంటనే ఒక మేలుకొలుపు వచ్చిందట.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment