💥యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.

 ⚜️🕉️🚩ఓం లక్ష్మీనృసింహాయ నమః🌹🙏


💥యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు..


యాదాద్రి క్షేత్రంలో ఫాల్గుణ మాసంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక  బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ విదియ మొదలు శుద్ధ ద్వాదశి వరకు సశాస్త్రీయంగా, లోకోత్తరంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.


11 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలు.. స్వస్తి వచనంతో మొదలై విష్వక్సేనుడి ఆరాధనతో ఊపందుకుంటాయి.


బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ఎదుర్కోలు, తిరుకల్యాణ మహోత్సవం, దివ్యవిమాన రథోత్సవం, చక్రతీర్థ స్నానం ప్రధానమైనవి. 


నిత్య పూజలు, కైంకర్యాలకు తోడు వేదమంత్రాల ఘోషతో స్వామి వారి సన్నిధి మార్మోగుతుంది. 


పుష్పార్చనలు కొండగాలికి పరిమళం అద్దుతాయి. అలంకారాలు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన సేవలు అబ్బుర పరుస్తాయి. 


పాల్గుణ మాసం తొలిరోజు అంటే మార్చి 11న ఆలయ ఉత్సవాలు స్వస్తి వాచనం, విష్వక్సేన ఆరాధనతో ప్రారంభమై.. ద్వాదశి రోజు మార్చి 21న గర్భాలయంలోని మూలవరులకు చేపట్టే సహస్ర కలశాభిషేకం మహాక్రతువుతో ముగుస్తాయి.


💥బ్రహ్మోత్సవాల వివరాలు...


11వ తేదీ ఉదయం విశ్వక్సేన ఆరాధన, స్వస్తీ వాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణ


12న ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం


13న అలంకార, వాహన సేవలు ప్రారంభం. ఉదయం మత్స్య అలంకారం, సాయంత్రం శేష వాహనం సేవ.


14న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ


15న ఉదయం మురళీ కృష్ణుడి అలంకారం, రాత్రి పొన్న వాహన సేవ


16న ఉదయం గోవర్థనగిరిధారి అలంకారం, రాత్రి సింహ వాహన సేవ


17న ఉదయం జగన్మోహిన అలంకారం, రాత్రి స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం


18న శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై శ్రీస్వామివారి ఊరేగింపు.రాత్రి గజవాహన, శ్రీస్వామి, అమ్మవార్ల తిరు కల్యాణం నిర్వహిస్తారు.


19న ఉదయం శ్రీమహావిష్ణు అలంకార సేవ, గరుఢ వాహనంసేవ, రాత్రి దివ్య విమాన రథోత్సవం.


20న ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థ స్నానం, దోపు ఉత్సవాలు


21న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.


💥#తిరు_కళ్యాణోత్సవం:

బ్రహ్మోత్సవాల్లో 18న రాత్రి శ్రీస్వామి, అమ్మవారల తిరుకల్యాణ మహోత్సవం ఆలయ ఉత్తర ముఖంగా ఉన్న మాడవీధిలో జరగనుంది.


రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలు, తలంబ్రాలను స్వామివారికి అందజేస్తారు.


నరసింహుడు గజవాహనంపై మంటపానికి ఊరేగి రాగా, పూల పల్లకీలో అమ్మవారు తరలి వస్తారు.


సముద్ర దేవుడే స్వయంగా వచ్చి నరకేసరి పాదాలు కడిగి అమ్మవారిని ఆయనకు అప్పగించాడన్న అనుభూతికి లోనై ఈ సందర్భాన్ని భక్తులు తిలకించి తరిస్తారు. 


మాంగల్య ధారణ, తలంబ్రాల ఉత్సవం జరిగినంత సేపూ కల్యాణ మంటపం గోవింద నామస్మరణతో మార్మోగుతుంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏