పున్నమి శోభతో అరుణాచల గిరి.. వైభవంగా కార్తీక పౌర్ణమి దీపోత్సవం..
⚜️🕉️🚩 ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹🙏
💥పున్నమి శోభతో అరుణాచల గిరి.. వైభవంగా కార్తీక పౌర్ణమి దీపోత్సవం..
🔥అగ్ని నక్షత్రం కృత్తిక సమ్మిళితమైన రోజు కార్తిక పౌర్ణమి.
ముందు రోజు అరుణాచలేశ్వరుడి సన్నిధిలో భరణి దీపం
పేరుతో చిరుదివ్వెను వెలిగిస్తారు.
అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3 వేల సంవత్సరాలకన్నా ముందునుంచే జరుగుతోందని భక్తుల నమ్మకం.
కార్తిక పౌర్ణమి రోజున అరుణగిరిపై శాంతిప్రదాయక జ్యోతి పేరిట మహాదీపాన్ని ప్రజ్వలింపజేస్తారు.
ఈ భరణి దీపంతోనే.. పౌర్ణమినాటి బ్రహ్మాండ దీపాన్ని వెలిగిస్తారు.
'కార్తిగై దీపం'గా వ్యవహరించే మహా దీపోత్సవంలో
ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిద రాగితో చేయబడుతుంది.
ఇందులో వత్తిగా వెలిగించే వస్త్రం 600 మీటర్లతో చేయబడుతుంది. ఈ ప్రమిదను, వత్తిని ”జ్యోతి నాడార్ లేక దీప నాడార్” అని పిలువబడే వంశస్తులు మాత్రమే అందజేస్తారు.
ఇక 2500 కిలోల నెయ్యి అరుణాచలానికీ వచ్చే భక్తులు అందజేస్తారు
అరుణాచలేశ్వరుని మహిమగా భావించే జ్యోతి 7 అడుగుల ఎత్తు ఎగసి.. ఉజ్వల కాంతి చుట్టుప్రక్కల 35 కి.మీ.ల వరకూ కనబడుతుంది
ఈ దీపాన్ని దర్శించుకోవాలనీ, గిరి ప్రదక్షిణ చేయాలనీ లక్షల మంది భక్తులు కార్తిక పౌర్ణమి నాడు అరుణాచలం చేరుకుంటారు.
ఆ రోజు అరుణాచలేశ్వరుడి ఉత్సవమూర్తి అయిన పెరియనాయగర్ స్వర్గమయ వృషభ వాహనంపై, అపీత కుచలాంబ, సుబ్రహ్మణ్య సహితంగా ఊరేగుతూ.. గిరి ప్రదర్శన చేస్తాడు.
అరుణాచలం శక్తి సంపన్న క్షేత్రం.
"నమఃశివాయ" అనేది యోగ పంచాక్షరి.
'అరుణాచలం' జ్ఞానపంచాక్షరి.
'శ్రీరమణులు' ధ్యాన పంచాక్షరి.
అరుణాద్రిపై వెలిగే అఖండ దీప తేజస్సు..
నిరుపమాన ఆధ్యాత్మిక దివ్య యశస్సు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
.jpeg)
Comments
Post a Comment