💥ఈశ్వర తత్త్వం💥

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

🔱 హర హర మహాదేవ శంభో శంకర🔱


💥ఈశ్వర తత్త్వం💥


పరమేశ్వరుడు ఎంతో సాత్వికుడు, బోళా శంకరుడు.

పిలిస్తే చాలు పలుకుతాడు.

ఆర్తిగా ప్రార్ధిస్తే అక్కున చేర్చుకుంటాడు.

భక్తులను ఇట్టే కరుణిస్తాడు.

ముందూ వెనుకా ఆలోచించకుండా కోరిన వరాలు ఇచ్చేస్తాడు.


నిరాడంబరతకు సంకేతంగా నిలిచే శివుడిని చూసినా, ఆయన నివాసమైన మరుభూమిని తలచుకున్నా మనసులో వైరాగ్యభావం జనిస్తుంది.


పండితులైనా, పామరులైనా, మూగ జీవులైనా, శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, #భక్తి యే ప్రధానం కానీ ఎటువంటి ఆడంబరాలు అవసరం లేదని చాటి చెప్పిన భక్త సులభుడు ఈశ్వరుడు.


అందరిని సమ దృష్టితో చూసే శివుడు అహాన్ని, భేద భావనను సహించడు అని తెలిపే  కధ సంక్షిప్తంగా చూద్దాము.


💥ఒక‌నాడు శంక‌రాచార్యుల‌వారు గంగాన‌దిలో స్నానం చేసి వ‌స్తున్నారు. జ‌నం ఎవ‌రికి వారే మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఇటూ అటూ జ‌రిగి చేతులు మోడ్చుకుని విన‌యంగా దారి ఇచ్చి నిల‌బ‌డ్డారు.


అంద‌రినీ చిరున‌వ్వుతో చూస్తూ ప్ర‌సన్న వ‌ద‌నంతో శంక‌రాచార్యులు ముందుకు న‌డిచారు.


అక్క‌డ మాసి చిరిగిన బ‌ట్ట‌ల‌తో, దుమ్ముతో మ‌లిన‌మైన శ‌రీరంతో, చింపిరి జుట్టుతో చేత క‌ఱ్ఱ‌ ప‌ట్టుకుని ఒక వ్య‌క్తి అడ్డంగా నిల‌బ‌డ్డాడు.


అత‌ని క‌ళ్ళ‌ల్లో నిర్ల‌క్ష్యం. అత‌నికి తోడు అత‌ని వెంట దుర్గంధం వ్యాపింప‌ చేస్తూ నాలుగు కుక్క‌లు కూడా ఉన్నాయి.

అవి కూడా వాటి య‌జ‌మాని స‌ర‌స‌న తోకాడిస్తూ నిలచి ఉన్నాయి.


శంక‌రాచార్యుల‌వారి శిష్యుల‌కి ఆగ్ర‌హం వ‌చ్చింది.

"ఏయ్ ! ఎవ‌రు నువ్వు ? త‌ప్పుకో. ప‌క్క‌కు జ‌రుగు. క‌న్పించ‌డంలా?


మా గురువుగారిని చూసి మ‌హామ‌హులే దారి ఇచ్చారే. నువ్వు మాత్రం క‌ద‌ల‌కుండా అలా నుంచున్నావ్‌.

ఎంత నిర్ల‌క్ష్యం ? జ‌రుగు జ‌రుగు" అన్నారు.

"చూడ‌బోతే ఛండాలుడు లాగా ఉన్నాడు" అని వారు గొణుగుకున్నారు.


శంక‌రాచార్యుల‌ వారు అత‌న్ని చూస్తూ ఆగిపోయారు. అతడిని శిష్యులు ప‌రుషంగా మాట్లాడినందుకు నొచ్చుకుంటున్న‌ట్లుగా నాయ‌నా ! త‌ప్పుకుంటావా ? అని అన్నారు ప్రేమ‌గా.


త‌ప్పుకుంటాను. కాని ముందు ఇది చెప్పు. నువ్వు త‌ప్పుకోమ‌న్న‌ది ఆత్మ‌నా ? ఈ శ‌రీరాన్నా ?


శ‌రీర‌మా ? అంటే ఇది అస్వ‌తంత్రమైన ఒక కీలుబొమ్మ‌. ఆత్మ నా అంటే ఆత్మ అఖండ‌మ‌నీ అద్వితీయ‌మ‌నీ స‌చ్చిదానంద స్వ‌రూప‌మ‌నీ.. నీవే ఉప‌న్యాసాలు ఇస్తున్నావుక‌దా !


నేను బ్రాహ్మ‌ణుడ‌నైనా చండాలుడ‌నైనా అందరిలాగా అన్న‌మ‌య‌మైన దీన్ని గురించి నీకెందుకు ఇంత బేధ‌భావ‌ము ? అహంకారం పూర్తిగా న‌శించ‌నిదే అహం బ్ర‌హ్మాస్మి అని ఎలాబోధిస్తావో నాకు చెప్పు.

నువ్వూ నేనూ వేరా ? అదీ చెప్పు అన్నాడు.


శంక‌రాచార్యుల మ‌దిలో ఆనంద త‌రంగాలు ఉవ్వెత్తున ఎగ‌సిపడ్డాయి.

ఎక్క‌డో గ్రామాల‌కి దూరంగా విద్య‌ల‌కు నాగ‌రిక‌త‌కూ దూరంగా మురికివాడ‌ల‌లో నివ‌సించే మురికి వానిలాగ క‌నిపించే ఈత‌డు మ‌హాజ్ఞాని. ఆత్మ‌విద్య‌ను అవ‌పోస‌న ప‌ట్టిన పునీతుడు. చండాలుడు అయితే అగుగాక‌. ఇత‌డు నా గురుతుల్యుడు అని భావించుకోగానే బ్ర‌హ్మాండ‌మంతా ఒక్క‌టిగా భాసించి అనంద తత్త్వాన్ని అందించిన‌ట్ల‌య్యింది.  


సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి, భ‌క్తి భావంతో  మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు.


శంకరునికి పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు:


"వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి"


ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం