💥శ్రీ కార్తికేయ పంచకం:
⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏
🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺
💥కార్తికేయుడిని ‘మహామతి’గా అభివర్ణిస్తారు.
ఆయన బుద్ధిని ప్రేరేపించే స్వామి.
సుబ్రహ్మణ్య ఆరాధనతో మనోబలం లభిస్తుంది.
బుద్ధి ప్రచోదనం అవుతుంది.
సత్కర్మలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది.
'బుద్ధి శక్తి దేవత’ అని శరవణభవుణ్ని స్తుతిస్తారు.
ఆయన ఉపాసనతో దుష్కర్మలు చేయాలన్న తలంపు తొలగిపోతుంది.
సత్కర్మలు ఆచరించాలన్న బుద్ధి పుడుతుంది.
సజ్జనుల క్షేమం కోసం ఆవిర్భవించిన సుబ్రహ్మణ్యుడు బుద్ధిని ప్రచోదనం చేస్తాడు.
శక్తి కుమారుడికి ఇచ్చిన శూలాన్ని.. జ్ఞానశూలం అనడం వెనుక ఆంతర్యం కూడా ఇదే!
సుబ్రహ్మణ్యస్వామిని సర్పాలకు మూలదేవతగా భావిస్తారు. ఆయన వాహనం నెమలి.
రెండు విరుద్ధ భావనలను, ధర్మాలను ఒక్క తాటిపై సమంగా నిలిపే శక్తి దైవానికి ఉంది.
అందుకే నెమలి వాహనుడైన కుమారస్వామి సర్పాలకు అధిదేవతగా అనుగ్రహిస్తున్నాడు.
అంతేకాదు, సుబ్రహ్మణ్య స్వామిని సంతాన కారకుడిగా, సంపత్తి దాతగా, ఆరోగ్య ప్రదాతగా భావిస్తుంటారు.
స్వామి అనుగ్రహంతో ఇవన్నీ సిద్ధిస్తాయని విశ్వసిస్తారు.
🍁🍁🍁🍁🍁
💥శ్రీ కార్తికేయ పంచకం:
విమలనిజపదాబ్జం వేదవేదాంతవేద్యం
మమ కులగురునాథం వాద్యగానప్రమోదమ్ |
రమణసుగుణజాలం రంగరాడ్భాగినేయం
కమలజనుతపాదం కార్తికేయం నమామి || ౧ ||
శివశరవణజాతం శైవయోగప్రభావం
భవహితగురునాథం భక్తబృందప్రమోదమ్ |
నవరసమృదుపాదం నాథ హ్రీంకారరూపం
కవనమధురసారం కార్తికేయం భజామి || ౨ ||
పాకారాతిసుతాముఖాబ్జమధుపం బాలేందుమౌళీశ్వరం
లోకానుగ్రహకారణం శివసుతం లోకేశతత్త్వప్రదమ్ |
రాకాచంద్రసమానచారువదనం రంభోరువల్లీశ్వరం
హ్రీంకారప్రణవస్వరూపలహరీం శ్రీకార్తికేయం భజే || ౩ ||
మహాదేవాజ్జాతం శరవణభవం మంత్రశరభం
మహత్తత్త్వానందం పరమలహరీ మంత్రమధురమ్ |
మహాదేవాతీతం సురగణయుతం మంత్రవరదం
గుహం వల్లీనాథం మమ హృది భజే గృధ్రగిరిశమ్ || ౪ ||
నిత్యాకారం నిఖిలవరదం నిర్మలం బ్రహ్మతత్త్వం
నిత్యం దేవైర్వినుతచరణం నిర్వికల్పాదియోగమ్ |
నిత్యానందం నిగమవిదితం నిర్గుణం దేవదేవం
నిత్యం వందే మమ గురువరం నిర్మమం కార్తికేయమ్ || ౫ ||
పంచకం కార్తికేయస్య యః పఠేచ్ఛృణుయాదపి |
కార్తికేయ ప్రసాదాత్స సర్వాభీష్టమవాప్నుయాత్ || ౬ ||
ఇతి శ్రీ కార్తికేయ పంచకమ్ ||
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment