కల్లూరు మహాలక్ష్మి అమ్మవారు
⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏
💥🌼💥🌼💥🌼💥
🌹అమ్మ నిజంగా అమ్మే !
బిడ్డ తన దగ్గరికి రాలేకపోతే, తానే స్వయంగా ఆ బిడ్డ దగ్గరికి వెళ్లి, ఆ బిడ్డ ఆశ్చర్యంతో తన వంక అలాగే చూస్తుంటే, చిరునగవులు చిందిస్తూ, కటాక్షాన్ని కురిపిస్తుంది.
అనుగ్రహాన్ని వర్షిస్తుంది.
అమ్మ అంగీకారం గనక దక్కిందా, ఇక నాన్న కూడా తప్పక అంగీకరిస్తారు. అమ్మ వెంటే అనుగ్రహిస్తారు.
ఎవరి గురించి అనుకుంటున్నారా ..!?
ఒక సామాన్య భక్తుని కోసం కదిలి వచ్చిన కనకమహాలక్ష్మి గురించి.
ఈ క్షేత్రం గురించి తెలుసుకుంటే, మరింతగా ఆశ్చర్యపోవడం ఖాయం.
🌹మధ్వ పండితులు శ్రీ లక్ష్మీకాంత ఆచార్యులు లక్ష్మీదేవి ఉపాసకులు.
అమ్మ మీద అమలినమైన ప్రేమ, ఆరాధన ఆయనకీ.
నిత్యం చందనం అరగదీసి అమ్మవారికి లేపనంగా సమర్పించేవారు.
కొల్హాపూర్ లక్ష్మీమాత దర్శనానికి, దసరా నవరాత్రుల్లోని అష్టమి నాడు తప్పకుండా వెళ్లేవారు ఆచార్యులు.
ఆ ఉపాసనా ఆయనకీ నిత్యజీవన వేదం.
కాలం ఎవరికోసమో ఆగదుకదా !
కాలంతోపాటు, ఆచార్యులవారికి వయసు మీదపడింది.
88 ఏళ్ళ వారయ్యారు.
ఆ వయసులో దూరాభారం కొల్హాపూరు వరకూ వెళ్ళాలి.
పైగా ఆర్థిక పరిస్థితికూడా అనుకూలంగా లేదు.
దాంతో ఆచార్యులవారు నవరాత్రి ఉత్సవాలకు వెళ్లలేని పరిస్థితి.
🌹అమ్మ తన బిడ్డల పరిస్థితి తెలుసుకోలేదా?
ఇక, తెల్లవారితే నవమి.
ఆచార్యులవారు చందనం అరగదీస్తున్నారు. మనసులో ఒకటే ఆలోచన.
అమ్మ దర్శనానికి వెళ్లలేకపోయానే అని.
అలాగే అర్చనాదికాలు ముగించారు.
ఆ రాత్రి అమ్మవారు ఆచార్యులవారి కలలో దర్శనమిచ్చారు.
"నాయనా ! నాదగ్గరికి రాలేకపోయానని బాధపడకు.
ఈసారి నవరాత్రులకి నేనే నీదగ్గరికి వస్తాను" అన్నారు అమ్మ.
ఆనందం అవర్ణమయ్యింది ఆచార్యులవారికి.
తెల్లవారు ఝామునే లేచి, స్నానాదికాలు ముగించుకొని, ఆ కలనే మళ్ళీ మళ్ళి తలుచుకుంటూ, అమ్మ నిజంగానే వస్తే బాగుండునని ఆలోచిస్తూ అమ్మకి సమర్పించేందుకు చందనాన్ని రోజూ లాగానే అరగదీస్తున్నారు.
ఆ చందనాన్ని అరగదీసే సానరాయి ఉన్నట్టుండి, దాని మృదుత్వాన్ని కోల్పోయినట్టు అనిపించింది ఆచార్యులవారికి.
🌹రాయిలోని ఆ కాఠిన్యం అంతకంతకూ పెరుగుతూ ఉండడం ఆచార్యులవారు చేతికి తెలుస్తూనే ఉంది. ఏమిటా ఇది ఉన్నట్టుండి ఈ రాయిలో ఆశ్చర్యకరమైన మార్పు కనిపిస్తోంది అనుకొంటూ, పూర్తిగా దానిపైన చందనాన్ని తొలగించి, చక్కగా నీటితో శుభ్రం చేశారు.
అప్పుడు దర్శనమిచ్చింది అమ్మ !
చిరునగవులు చిందిస్తూ, ఆచార్యులవారు కళ్ళలోని ఆశ్చర్యాన్ని అబ్బురంగా అవలోకిస్తూ…!
ఇప్పటికీ అలా స్వయం వ్యక్తమైన లక్ష్మీ మాతని మనం దర్శించుకోవచ్చు.
అదికూడా ఆ అమ్మ మీది ప్రేమతో తపించిన ఆచార్యులవారు ఇంటిలో..!
ప్రస్తుతం రెండో "కొల్హాపూరి"గా ప్రసిద్ధిని పొందింది కల్లూరులో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం.
అమ్మవారి విగ్రహం, సానరాతి మీద స్వయం వ్యక్తమయినట్టుగా, దానిమీద చందనం అరగదీసిన గుర్తులు కూడా మనం ఈనాటికీ గమనించవచ్చు.
ఆ అమ్మ స్వరూపం వర్ణించడానికి వీలులేనిది, దర్శించి తరించాల్సినది.
ఆలయంలో ఎక్కడ నిలబడినా మనవైపే చూస్తూన్నారా అమ్మవారు అన్న భ్రాంతికి లోనవుతాం.
🌹ఆ అమ్మ పక్కనే అయ్యవారు "వేంకటేశ్వరులు" కూడా కొలువై ఉంటారు. ఈయన ఇక్కడికి విచ్చేయడం కూడా ఒక అద్భుతమైన సంఘటనే.
అమ్మవారు విచ్చేసిన మరుసటి సంవత్సరం ఆచార్యుల వారు ఒక గ్రామం గుండా వెళ్తుండగా, ఒక పొలంలో రైతు నాగలి దున్నుతున్నాడు.
ఆ నాగలి ఒక ప్రదేశానికి వచ్చి అక్కడే ఏదో అడ్డుపడ్డట్టు ఆగిపోయింది. తవ్వి చూస్తే, వెంకటేశ్వర స్వామి విగ్రహము బయల్పడింది.
ఆయన దానిని తీసుకొని వచ్చి అమ్మ వారి ప్రక్కనే ప్రతిష్టించారు.
ఇలా వేరు వేరుగా లభ్యమయినా ఆ దంపతులు విశాల నేత్రాలతో, ఒకే శిల్పి మలిచిన మూర్తులేమో అని మనల్ని భ్రమించేలా చేస్తాయి.
వెంకన్న మూలమూర్తి శిలపైనే శ్రీదేవి, భూదేవి కూడా ఉండడం విశేషం.
అలా అమ్మ వారు లక్ష్మీ కాంత్ ఆచార్య వారి సాదరణ గృహంలొనే కొలువై పూజలు అందుకుంటున్నారు.
ఇక్కడ కార్యక్రమాలు అన్ని మధ్వ సంప్రదాయ
ప్రకారంగా జరుగుతాయి.
ఆచార్యులవారి కుటుంబీకులు ఇప్పటికీ అక్కడే ఉంటూ ఆలయ వ్యవహారాలూ చూసుకుంటూ ఉంటారు.
🌹మంత్రాలయం వెళ్లిన వారు వీలు చూసుకొని తప్పకుండా దర్శించాల్సిన దివ్యమైన లక్ష్మీ క్షేత్రం ఈ "కల్లూరు" లక్ష్మీ దేవాలయం.
ఇక్కడ కావాల్సిన కోరికలు చెప్పుకొని భక్తులు కొబ్బరికాయ ముడుపుని ఆలయంలో కడతారు.
ఆ కోరిక తీరాక తిరిగి ఆ కొబ్బరికాయ ముడుపుని విడదీస్తారు.
ఇక్కడ మొక్కుకున్నవారికి ఖచ్చితంగా అమ్మవారి కృపతో వారి వారి కోర్కెలు ఈడేతాయని విశ్వాసం.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment