జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥

 ⚜️🕉️🚩 ఓం హయగ్రీవాయ నమః🌹🙏

🏵️🌼🏵️🌼🏵️🌼🏵️


💥వేదోద్ధరణ అవతారమే హయగ్రీవుడు...


జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం

ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥


పురాణ ఇతిహాసాలలో దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం శ్రీహరి దాల్చిన అవతారాల్లో ప్రసిద్ధమైనది "హయగ్రీవ" అవతారం ఒకటి.


సమస్త విద్యలను, జ్ఞానాన్ని పాండిత్యాన్ని అనుగ్రహించే శ్రీ గురుమూర్తి హయగ్రీవ స్వామి.

🍁🍁🍁🍁🍁


విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం

విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం

దయానిధిం దేహభృతాం శరణ్యం

దేవం హయగ్రీవమహం ప్రపద్యే ॥🌹


వేదోద్ధరణకై సంభవించిన అవతారమే ఇది. 

మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలిస్తే, విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి, ఆ మధుకైటభులను వధించి... వేదాలను రక్షించాడు. 


గుర్రపు ముఖంతో, నర శరీరంతో, చతుర్భుజుడై శంఖచక్రాలను ధరించి వామాంకంలో లక్ష్మీదేవి సహితంగా ఆవిర్భవించిన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే హయగ్రీవ స్వామి. 


ఆయనలో సకల దేవతలూ కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. 


సూర్యచంద్రులు కళ్లుగా, దేవతలు ఎముకలు గా, అష్టవసువులు పాదాలుగా, అగ్ని నాలుకగా,

సత్యం వాక్కుగా, బ్రహ్మ హృదయంగా... ఇలా ఆయనలోని అణువణువూ దేవతామయమని అంటారు. 


హయగ్రీవున్ని జ్ఞానమునకు, వివేకమునకు, వాక్కుకు, బుద్ధికి, అన్ని విద్యలకు దేవుడుగా భావిస్తారు.

హయగ్రీవ స్వామిని చదువుల దేవుడు గా పూజిస్తారు.


నరసింహ స్వరూపం వలే వైకుంఠ నాథుడు హయగ్రీవ ధారియైనారు.


'హయ’ అనగా విజ్ఞానం. ‘గ్రీవ’ అనగా కంఠం.

అన్ని విద్యలూ కంఠస్థమై ఉన్న సర్వ విద్యా రూపమే హయగ్రీవ మూర్తి.

🔸🔹🔸🔹🔸


🌹"దేవీ భాగవతం" ప్రకారం ఒకానొక సమయాన మహా విష్ణువు రాక్షసులతో పదివేల ఏళ్ళు భీకర యుద్ధం చేసి అలసి పోయి, అల్లెత్రాడు గట్టిగా బిగించి ఉన్న ధనుస్సును నేల మీద నిలబెట్టి,

దాని కోపుమీద తమ గడ్డాన్ని ఆనించి, నిలబడే నిద్ర పోయారు.


విష్ణువును వెదకుతూ వచ్చిన దేవతలు, నిద్ర లేపడానికి భయ పడి, బ్రహ్మ దేవుడు ఒక చెద పురుగును సృష్టించి, వింటి నారిని కొరకమని చెబుతారు.


పురుగు కొరకడంతో ధనుస్సు విసురుగా తుళ్ళి, వింటికి ఉన్న బాణం కొన విష్ణువు మెడకు తగిలి, ఆయన శిరస్సు తెగి, ఎగిరిపోయింది.


దేవతలంతా మహాదేవిని ప్రార్ధించగా, ఆమె ప్రత్యక్షమై సూచించిన విధంగా గుర్రాన్ని వధించి, దాని తలను తెచ్చి దేవశిల్పి యైన త్వష్ట ద్వారా విష్ణువు మొండానికి అతికించారు.

బ్రహ్మ ప్రాణం పోయగా, హయగ్రీవులైనారు.


🌹మధు కైటభులనే అసురులు, బ్రహ్మ నుండి వేద విద్యను దొంగిలించి, రసాతలానికి పారిపోయారు. 


హయగ్రీవ రూపంలోని శక్తితో మాత్రమే తాను మరణించునట్లు, హయగ్రీవుడనే రాక్షసుడు, బ్రహ్మ ద్వారా పొందిన వరం కారణంగా,

దేవి కృప వల్ల హయగ్రీవ అవతారులైన విష్ణు అదే పేరు గలిగిన అసుర సంహారం చేయడంజరిగింది. 


🌹హయగ్రీవ విరాట్‌ స్వరూపాన సత్యలోకం శిర స్సుగా, భూలోకం నాభిగా,

పాతాళం పాదాలుగా, అంతరిక్షం కళ్ళుగా,

సూర్యుడు కంటి గుడ్డుగా, చంద్రుడు గుండెగా, దిక్పాలకులు భుజాలుగా, అగ్ని ముఖంగా,

సముద్రాలు ఉదరంగా, నదులు, పర్వతాలు ఎముకలు, మేఘాలు కేశాలుగా, సర్వ దేవతా స్వరూపులైనారు.


🌹హయగ్రీవుడు తెల్లని శరీరం కలవాడు.

లక్ష్మీదేవిని తొడపై కూర్చోబెట్టుకుని, తెల్లని పద్మాసీనులై ఉంటారు.

కుడిచేతిలో చక్రం, పై ఎడమ చేతిలో శంఖం, కింది ఎడమ చేతిలో పుస్తకం, కింది కుడిచేయి చిన్ముద్ర ధరించి ఉంటారు.


🌹శ్వేత పద్మం సమస్త ఐశ్వర్యాలకు చిహ్నం.

చిన్ముద్ర జ్ఞానానికి, పుస్తకం సకల విద్యలకు,

శంఖం సకల సృష్టికి కారణభూతమైన నాదానికి,

చక్రం అజ్ఞాన సంహారానికి చిహ్నాలు.


🌹హయగ్రీవుని ఉపాసించిన వారికి సకలం కలుగు తాయని విశ్వాసం.

హయగ్రీవ నామాన్ని ఉచ్చరించే వారు శివ స్వరూపులుగా, పలికిన వారు విష్ణు స్వరూపులుగా, విన్నవారు బ్రహ్మ స్వరూపులుగా అవుతారని బ్రహ్మ చెప్పడాన్ని బట్టి హయగ్రీవ నామ ప్రాధాన్యత స్పష్టం అవుతుంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు