💥ఆంజనేయ స్వామిని ఆశ్రయిస్తే...
⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏
💥ఆంజనేయ స్వామిని ఆశ్రయిస్తే...
🏵️🌼🌸🏵️🌺🌼🌸🏵️🌼
బలం, ధైర్యం, నేర్పు, ఓర్పు, బుద్ధి, శక్తి, సామర్ధ్యం తదితర సుగుణాలతో అనేక ధర్మకార్యాలు చేసిన '#కర్మయోగి' ఆంజనేయుడు.
రామ భక్తిరసంలో మునకలు వేసి దాసోహం అంటూ తనని తాను పరిపూర్ణంగా శ్రీరామచంద్రునికి అర్పించుకొని సోహం స్థితికి (అద్వైతస్థితికి) చేరుకున్న '#భక్తియోగి' ఆంజనేయుడు.
సీతమ్మతల్లి (పరదేవత), రాముని(పరమాత్మ)లచే ఉపదేశములు పొంది, మనల్ని తరింపజేస్తున్న '#జ్ఞానయోగి' ఆంజనేయుడు.
🍁🍁🍁🍁🍁
🌹సీతాన్వేషణకై లంకకు వెళ్ళిన ఆంజనేయునికి విభీషణుడు పరిచయమయ్యెను.
ఆంజనేయునితో సంభాషణము వలన ఎంతయో ప్రభావితుడై, రావణుని కొలువులో హనుమ పక్షమున మాట్లాడి, ధర్మహితం పలికి, తిరస్కరింపబడి అన్నయైన రావణుని వీడి, శ్రీరామచంద్రున్ని శరణుజొచ్చెను.
విభీషణుడుని తమ పక్షమున చేర్చుకొను విషయమందు శరణాగత రక్షణుడు రాముడు నిర్ణయం విని అమితానందంతో విభీషణుడుని రాముని సన్నిధికి చేర్చింది ఆంజనేయుడే.
🌹సముద్రంపై సేతు నిర్మాణము గావించుచున్నప్పుడు హనుమ అసంఖ్యాకములైన పర్వతములను పెకిలించి తెచ్చెను.
ఆ క్రమంలో ఉత్తరమున ఉన్న మరియొక పర్వతమును పెకిలించి తీసుకొస్తుండగా, సేతు నిర్మాణము పూర్తియయ్యెను అన్న సమాచారం అందుకోవడంతో ఆ పర్వతమును అక్కడే వదిలివేచెను.
కానీ, ఆ పర్వతం హనుమను ఇట్లు ప్రార్ధించెను - 'హనుమా! నీ కరకమల స్పర్శను పొందియు కూడా భగవానుని సేవకు దూరము అయిపోవుటకు నేను ఏమి అపరాధము చేసితిని?
నన్ను ఇక్కడ విడనాడవలదు.
నన్ను కొనిపోయి భగవానుని చరణారవింద సన్నిధియందే పడవేయుము, అప్పుడే నాకు సార్ధకత' అని వేదనతో వేడుకోగా;
ఆ మాటలను విన్న హనుమ ఇలా అనెను... 'గిరిరాజా! నీ నిష్టను చూడగా నిను కొనిపోవాలని నాకున్నను ఇక పర్వతములు తేవలదని రాముని ఆదేశం వచ్చినది. కానీ, నీ కోరికను స్వామికి విన్నవించెదను' అని చెప్పి వెడలి,
రాముని సన్నిధికి చేరి ఆ గిరివరుని కోరికను తెలపగా,
రామప్రభువిట్లనెను - 'హనుమా! నీ చేతిస్పర్శచే పునీతుడైన ఆ గిరివరుడు నాకు అత్యంత ప్రేమపాత్రమైనవాడు.
నేను ద్వాపరయుగమందు శ్రీకృష్ణుడనై యవతరించి సప్తదినముల పర్యంతము ఆ గిరివరుని నా చిటికినవ్రేలిపై నిలిపి నాకార్యమునకు వినియోగించుకొందునని పోయి అతనికి తెలుపుము' అని పలుకగా,
హనుమ మరల ఆ గిరివంతుని దరికి కేగి స్వామి సందేశమును తెలిపెను.
హనుమంతుని కృపవలన ఈ విధంగా పరమాత్మానుగ్రహంకు పాత్రమైన ఆ గిరియే గోవర్ధనగిరి.
🌹మహాభక్తుడు గోస్వామి తులసీదాసు నిత్యము రామాయణ ప్రవచనము చేసేవారు.
ఆయన ప్రతిదినము కాలకృత్యముల కొరకు దగ్గరలోనున్న అడవికి పోయి పాత్రలోనున్న శేష జలమును ఓ రావిచెట్టు మొదట్లో పోసెడివారు.
ఆ చెట్టుపైనున్న భూతము ఓ రోజు ప్రత్యక్షమై, 'నాకు విమోచనం కల్గించినందుకు ప్రతిఫలంగా ఏమైనా అడుగు ఇస్తాన'ని అనగా;
మహాభక్తుడు తులసీదాసు "శ్రీరామ దర్శనం" కోరారు.
'ఆపని తనవల్లకాదని, ఓ ఉపాయం చెప్పిందా భూతం. నీ రామాయణ ప్రవచనానికి రోజూ హనుమ వస్తున్నాడు. అందరికన్నా ముందు వచ్చి అందరూ వెళ్ళినతర్వాత వెళ్తాడు.
(యత్ర యత్ర రఘునాధ కీర్తనం / తత్ర తత్ర కృత మస్తకాంజలిం)
కన్నులనీరు కారుతూ వుండగా
(భాష్పవారి పరిపూర్ణ లోచనం) ఆనందంగా రామాయణం వింటూ వుంటాడు. అతన్ని పట్టుకో, నీకు రామదర్శనం అవుతుందని చెప్పింది భూతం.
తన ప్రవచనాన్ని విని చివరిగా వెనక్కి మరలిన హనుమను వెంబడించి ఆయన పాదాలను పట్టుకొని ప్రార్ధించి, హనుమ సాయంతో శ్రీరామదర్శనం చేసుకొనెను తులసీదాసు.
🌹ఆంజనేయున్ని ఆశ్రయిస్తే అపారమైన ఆంజనేయుని అనుగ్రహంతో పాటు శక్తివంతమైన ముక్తిదాయకమైన నామధారి అయిన "శ్రీరామచంద్రుని" అనుగ్రహం అందుతుంది అనీ పై ఘటనల ద్వారా తెలుస్తుంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment