💥అచ్యుతాష్టకం... తాత్పర్యముతో

 ⚜️🕉️🚩 కృష్ణం వందే జగద్గురుం 🌹🙏


💥అచ్యుతాష్టకం... తాత్పర్యముతో


అచ్యుతం కేశవం రామనారాయణం

కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ |

శ్రీధరం మాధవం గోపికా వల్లభం

జానకీనాయకం రామచంద్రం భజే || 1 ||


అచ్యుతం కేశవం సత్యభామాధవం

మాధవం శ్రీధరం రాధికా రాధితమ్ |

ఇందిరామందిరం చేతసా సుందరం

దేవకీనందనం నందజం సందధే || 2 ||


విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే

రుక్మిణీ రాహిణే జానకీ జానయే |

వల్లవీ వల్లభాయార్చితా యాత్మనే

కంస విధ్వంసినే వంశినే తే నమః || 3 ||


కృష్ణ గోవింద హే రామ నారాయణ

శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే |

అచ్యుతానంత హే మాధవాధోక్షజ

ద్వారకానాయక ద్రౌపదీరక్షక || 4 ||


రాక్షస క్షోభితః సీతయా శోభితో

దండకారణ్యభూ పుణ్యతాకారణః |

లక్ష్మణోనాన్వితో వానరైః సేవితో

అగస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ || 5 ||


ధేనుకారిష్టకా‌உనిష్టికృద్-ద్వేషిహా

కేశిహా కంసహృద్-వంశికావాదకః |

పూతనాకోపకః సూరజాఖేలనో

బాలహోపాలకః పాతు మాం సర్వదా || 6 ||


బిద్యుదుద్-యోతవత్-ప్రస్ఫురద్-వాససం

ప్రావృడమ్-భోదవత్-ప్రోల్లసద్-విగ్రహమ్ |

వాన్యయా మాలయా శోభితోరః స్థలం

లోహితాఙ్-ఘిద్వయం వారిజాక్షం భజే || 7 ||


కుంచితైః కుంతలై భ్రాజమానాననం

రత్నమౌళిం లసత్-కుండలం గండయోః |

హారకేయూరకం కంకణ ప్రోజ్జ్వలం

కింకిణీ మంజులం శ్యామలం తం భజే || 8 ||


అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం

ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ |

వృత్తతః సుందరం కర్తృ విశ్వంభరః

తస్య వశ్యో హరి ర్జాయతే సత్వరమ్ || 9 ||

🍁🍁🍁🍁🍁


💥#తాత్పర్యము:


నాశనము లేనివాడు, కేశవుడు, రాముడు, నారాయణుడు, దామోదరుడు, వాసుదేవుడు, హరియు, శ్రీధరుడు, మాధవుడు, గోపికావల్లభుడు జానకీనాయకుడైన రామచంద్రుని భజింతును.


శాశ్వతుడు, అందమైన ముంగురులు కలవాడు, సత్యభామాపతి, మాధవుడు, శ్రీధరుడు, రాధికకు ఆరాధ్యుడు, లక్ష్మీదేవికి నివాసమైనవాడు, వర్ణింపశక్యం కాని మనస్సుందరుడు, దేవకీదేవికి ఆనందము కలుగజేయు ఆశ్రీకృష్ణుని నేను ధ్యానింతును.


సర్వము వ్యాపించినవాడు, జయశీలుడు, శంఖము, చక్రము కలవాడు,రుక్మిణిని రామావతారమున సీతాదేవిని అలరించినవాడు, గోపికా వల్లభుడై వారిచే పూజలందుకొన్నవాడు, కంసుని సంహరించిన వాడు, మురళీనాదము చేయుచూ ఆత్మానంద స్వరూపుడై విరాజిల్లుతున్న ఓ స్వామి నీకు నా వందనములు.


హే కృష్ణా! గో, భూ రక్షణ చేసి గోవిందుడివైతివి, రాముడివైతివి, నారాయణుడివైతివి, లక్ష్మీపతివి, అన్నిటా వశింసువాడవు. అపజయము లేని వాడవు, నాశనము లేనివాడవు, ఆద్యంతములు లేనివాడవు,

మాధవుడవు, ఊర్థ్వరూపుడవు, ద్వారకా నాయకుడవు, ద్రౌపదిని రక్షించినవాడవు.


రాక్షసులను సంహరించినవాడు, సీతతో శోభించిన వాడు, దండకారణ్యం భూమిని పవిత్రం చేసినవాడు లక్ష్మణుడితో కలిసిన వాడు వానరులచే సేవింప బడినవాడు, ఆగస్త్య మహర్షి పూజించబడిన వాడు అగు రాముడు నన్ను రక్షించు గాక.


ధేనుకాసురుని సంహరించిన వాడు, ద్వేషించువారిని నాశనం చేయువాడు, కేశి అనే రాక్షసుని-కంసుని చంపినవాడు వేణుగానం చేయువాడు, పూతను అంతమొందించినవాడు కాళీయుని మర్దించి ఆనందింపచేసిన వాడు ఆ బాలగోపాలుడు నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక.


మెరుపువలె మెరయుచున్న వస్త్రములు ధరించిన వాడు, వర్షాకాలపు మేఘం వలె అందమైన శరీరం కలవాడు, తులసిమాలతో అలంకరింపబడిన వక్షస్థలం కలవాడు, ఎర్రని పాదములు కలవాడు, పద్మ నేత్రుడు అగు దేవుణ్ణి సేవించుచున్నాను


వంకరలు తిరిగిన జుట్టుతో అందమైన ముఖము కలవాడు, సుందరమైన శిరస్సు కలవాడు, చెంపలపై ప్రకాశించు కుండలములు కలవాడు, హారములు - కేయూరములు - కంకణములు - గజ్జెలు ధరించిన వాడు, నల్లనివాడు అగు దేవుణ్ణి సేవించుచున్నాను


ఇష్టములను తీర్చునది, మంచి వృత్తము నందు (స్రగ్విణీ) రచించబడినది, పరమాత్ముని తెలియజేయునది అగు ఈ "అచ్యుతాష్టకము"ను ఎవరైతే భక్తితో ప్రతిదినము పఠించునో వారికి వెంటనే హరి ప్రసన్నుడగును.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️




Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు