శివశబ్దం ముక్తికారకం
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱
విత్తజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్
మత్తత్వంబు తదంకురం ఐనృతముల్ మాఱాకు లత్యంతదు
ద్వృత్తుల్ పువ్వులుఁ బండ్లు మన్మధముఖా విర్భూతదోషంబులుం
జిత్తాధ్యున్నతనింబభూజమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!
🌹భావము:
శ్రీ కాళహస్తీశ్వరా!
మానవుల చిత్తమునందు వ్యధ చాల ఎత్తగు వేపచెట్టు.
అది మొలకెత్తుటకు పెరుగుటకు విత్తు ఉండవలెను కదా. అజ్ఞానమే ఆ విత్తు.
చిత్తము ఆ విత్తు మొలకెత్తించుటకు చేసిన పాదు.
ఆ చిత్తమునందు కలుగు సంసార విషయకమయిన ఆవేశము ఆ పాదునకు వేసిన గట్టు మరియు ఆ విత్తు మొలకెత్తుటకు కావలసిన నీరు.
అహంకారము ఆ విత్తునుండి వచ్చిన మొలక.
అసత్యములు ఆ మొలకకు మారాకులు.
మానవులాచరించు అత్యంత దుర్వర్తనములు ఆ చెట్టున పూచిన పూవులు.. కామము మొదలగు చిత్తదోషములు ఆ చెట్టున పండిన పండ్లు.
🍁🍁🍁🍁🍁
💥శివశబ్దం ముక్తికారకం
"శివం కరోతి శంకరః"
అంటే శుభాలను కలిగించేవాడు శంకరుడు.
తనను ఆరాధించినవారికీ తనను నమ్మినవారికీ శివుడు ఆలోచించకుండానే వరాలిస్తాడు.
శివుని పూజించిన వారికి లేనిది అంటూ ఏమీ ఉండదు.
నిష్కల్మష మనస్కులై శివుణ్ణి మనసారా స్మరించుకొంటే సంసారసాగరాన్ని అవలీలగా దాటుకొని ప్రాపంచిక బంధాలనుండి విముక్తి పొంది శివసాయుజ్యం తప్పక లభ్యమవుతుంది.
వేదవాఙ్మయం మేఘములు కేశములుగానూ.. మెరుపు రంగుగానూ.. ఉరుము గర్జనగానూ.. ప్రచండవాయువు ప్రళయ స్వరూపంగానూ.. రుద్రుని ఊహించి శివుడిని కపర్ది; వ్యోమకేశుడు, నీలినిఖంటి, వర్షీయుడు అన్న పేర్లతో కీర్తించారు.
శివుడు మంగళస్వరూపుడు.
శివా అని ఒక్కసారి అన్నా శివుడు అన్నివేళలా తన భక్తుని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాడు.
"స్వస్తి శివం కర్మాస్త్వితి"
అనగా కర్మములు శివునిచే కాపాడబడి భద్రంగా ఉంటాయని వేదం చెబుతుంది.
శివుణ్ణి "సంసార గహన తారకమూర్తి" అనీ కీర్తిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు.
కాసిని నీళ్లు శివలింగంపై పోస్తూ శివనామాన్ని జపిస్తే చాలు సకల సంపదలను అనుగ్రహిస్తాడు.
శివలింగానికి ఆద్యంతాలు లేనట్టే శివుని మహిమలకు కూడా అంతులేదు.
శివయ్యకు బిల్వపత్రం అంటే మహా ఇష్టమట. బిల్వపత్రంతో పూజించిన వారు శివస్వరూపులే కాని వేరుకాదు.
బిల్వ ప్రత వీక్షణ, స్పర్శనం కూడా పుణ్యాన్నిస్తాయి.
సాక్షాత్ శివ స్వరూపానికి ప్రతీక బిల్వం.
పరమశివుని బిల్వ పత్రములతో పూజిస్తే దారిద్య్రం కంటి చూపు మేర కనపడదు.
బిల్వములు ముఖ్యంగా మూడు రకాలు.
అవి ఏక బిల్వం, త్రిదళం, పంచదళం.
ఈ మూడింటికి ఒక ప్రత్యేకత ఉంది.
ఏక బిల్వం పరమశివ స్వరూపం.
త్రిదళం శివుని మూడు కన్నులు... పంచదళ బిల్వము శివుని పంచముఖములు అయిన సద్యోజాతము, వామదేవుడు, తత్పురుషుడు, అఘోరుడు, ఈశానుడు అని భావిస్తారు.
శివ శబ్దం కల్యాణకరమైన ముక్తినిచ్చు పదం. శివస్తోత్రం పరమ పావనం.
"శివనామం" అనే దావానలంతో సమస్త పాపరాశులు అనాయాసంగా భస్మమైపోగలవు.
శివనామం స్మరిస్తూ అసువులు బాసిన వ్యక్తి ఎన్నో జన్మలుగా చేసిన ఘోర పాతకముల నుంచి విముక్తి పొంది మోక్షగతిని పొందుతాడన్నది కూడా పురాణాలు పల్కుతున్నాయి. అట్లాంటిమంగళకరుడైన శివుని బిల్వపత్రాలతో పూజిస్తే ఇహపరసుఖాలు లభ్యమవుతాయి.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment