💥అగ్నిరూపం.. నిశ్చలదీపం.. మహిమాన్విత అరుణాచలం..

 ⚜️🕉️🚩ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹🙏


💥అగ్నిరూపం.. నిశ్చలదీపం.. మహిమాన్విత అరుణాచలం..


అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది.

కృత యుగంలో దీన్ని "అగ్ని" పర్వతమని, త్రేతాయుగంలో "స్వర్ణగిరి" అని, ద్వాపరంలో "తామ్ర" శైలమని వ్యవహరించారు.


గౌతముడు, అగస్త్య మహర్షి ఈ గిరిని "శోణాచల"మన్నారు.


43 కోణాల్లో "శ్రీచక్రాకారం"లో ఉండే ఈ పర్వతం "శ్రీచక్రత్తాళ్వార్‌"కు స్థాణువు రూపంగా వైష్ణవాగమాలు ప్రకటించాయి.


జగద్గురువు ఆది శంకరాచార్యులు ఈ కొండను మేరువు గిరి అన్నారు.


భగవద్రామానుజులు అరుణాచలాన్ని మహా సాలగ్రామంగా దర్శించారు.


దర్శనాదభ్రసదసి జననాత్కమలాలయే |

కాశ్యాం తు మరణాన్ముక్తిః స్మరణాదరుణాచలే ||🌹


🌹గత జన్మల పుణ్యం ఉంటేనే కానీ "అరుణాచలం" అనే పదాన్ని కూడా తలవలేమని స్థల పురాణం చెబుతోంది.

ఒక్కసారి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన వారి జీవితంలో అప్పటి వరకూ వారు చేసిన పాపాలు, వారిని వెన్నంటి వచ్చిన గత జన్మల ప్రారబ్ధ, సంచిత పాప కర్మలు సైతం పటా పంచలవుతాయనీ,


ఎవరైనా మరణించి నరకానికి వస్తే, వారి జీవితంలో అరుణాచల గిరి ప్రదక్షిణ చేశారా అని మొట్టమొదటగా యమధర్మరాజు ప్రశ్నిస్తాడటా. 


ఒకవేళ వారి పుణ్యం కొలదీ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినట్లయితే, వారి జీవితాన్ని అరుణాచల గిరి ప్రదక్షిణకు ముందు, అరుణాచల గిరి ప్రదక్షిణ తరువాతగా విభజించి, గిరి ప్రదక్షిణకు ముందు చేసిన పాపం రాశులను లెక్కించరని అరుణాచల క్షేత్ర మహత్యంలో ఉన్నది.


కరుణాపూరితాపాంగం శరణాగతవత్సలం |

తరుణేందుజటామౌలిం స్మరణాదరుణాచలం ||🌹


🌹14 కిలోమీటర్ల "ప్రదక్షిణ" మార్గంలో గిరి చుట్టూ అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనమిస్తాయి.


గిరి ప్రదక్షిణకు ఇంతటి వైభవం ఏర్పడటానికి కారణమైన అద్వైత గురువు.. భగవాన్‌ రమణమహర్షి.


అరుణాచల ప్రదక్షిణం సాక్షాత్తు కైలాసాన కొలువైన శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమైన ఫలితం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.


53 సంవత్సరాల పాటు అరుణాచలాన్నే తన ఆవాసంగా చేసుకున్న మహర్షి.. ఈ క్షేత్రాన్ని "ఇలకైలాసం"గా అభివర్ణించారు.


"అక్షరమణమలై" పేరిట అరుణాచల ఘన యశస్సును కీర్తిస్తూ రమణులు శతకాన్ని రచించారు.

గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో తన మనోభావాలను ‘అరుణాచల అష్టకం’ ద్వారా అవిష్కరించారు. బాల్యంలో అరుణాచలాన్ని దర్శించిన రమణులకు ఈ కొండ ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించింది.


🌹 మహేశ్వరపురాణంలో వేద వ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించారు.

ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి.


"సూర్యుడి" నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనగా చేసుకుని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు. 


అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరతాయని నానుడి. ఇక్కడ రుణాలు తీరడమంటే బంధనాల నుంచి విడివడి ముక్తిమార్గం వైపు పయనించడం. 


కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతుంటాడు.

ఆయన ధ్యానానంతరం కళ్లు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు.

సదాశివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులకితయామినిగా పరిమళిస్తుంది.


అగ్ని లింగమై పరంజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్‌ రూపాన్ని సంతరించుకున్నాడు.


సమస్తజగదాధారం సచ్చిదానందవిగ్రహం |

సహస్రరథసోపేతం స్మరణాదరుణాచలం ||🌹


అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రం.

వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను "#సుదర్శనగిరి"గా వ్యవహరిస్తారు.


విష్ణువు హస్తభూషణమైన "చక్రాయుధం" గిరి రూపంగా భువిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం.


ఆ పర్వతమే ఓ మహాలయం.. పరమ పావనం.


దివ్యశోభితమైన అరుణగిరి.. భక్తులు మహాదేవుడిగా భావించినా.. రమణులు ఆత్మ స్వరూపంగా దర్శించినా ఈ గిరి ఔన్నత్యం అనంతం.


"ఎవరెన్ని మార్గాల్లో సంచరించినా చివరికి అందరి గమ్యం అరుణాచలమే"

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు