💥కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ...
⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏
💥కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ...
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టలాయ మహిమలే తిరుమల కొండ
వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస బుణ్యరాసులేయేరులైనది కొండ
గాదిలి బ్రహ్మాదిలోకములకొనల కొండ
శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ
సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్విదపసులే తరువులై నిలచిన కొండ
పూర్వపుటంజనాద్రి యీ పొడవాటి కొండ
వరములు కొటారుగా వక్కాణించి పెంచేకొండ
పరుగు లక్ష్మీకాంతుసోబనపు గొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దదివో శ్రీవేంకటపు గొండ
🌹#భావము:
అదివో తిరుమల కొండ.
మిక్కిలి ఎదురుగా, అతి దగ్గరగా ఉన్న ఇలపై నిలచిన వైకుంఠము.
చిరకాలముగా నిలచిన పర్వతరాజము.
ఎన్నో మహిమలు మందంగా తెట్టెలు కట్టిన కొండ.
వేదాలే శిలలుగా ఉన్న కొండ.
లెక్ఖలేనన్ని పుణ్యరాశులు ప్రవహిస్తూన్న కొండ.
ఈ పర్వత శ్రేణి కొన భాగాలు బ్రహ్మ మొదలైన లోకాలన్నింటినీ తాకుతున్న కొండ.
లక్ష్మీదేవి భర్త ఉండేటి శేషాచలం ఈ కొండ.
దేవతలంతా అనేక మృగ జాతులుగా మారి తిరుగుతూన్నటువంటి కొండ.
నీటిని ధరించిన మేఘాలు ఈ కొండ చివరలు తాకుతూ వెళ్తాయి.
భూమి మీద గొప్ప తపోసంపన్నులు చెట్లు గా నిలచి ఉన్న కొండ.
పైన చెప్పిన శేషాచలానికి ముందున్న ఈ పొడవాటి కొండ అంజనాద్రి.
లెక్కలేనన్ని వరములు తనలో ఇముడ్చుకుని గొప్ప వైశాల్యాన్ని పొందినదీ కొండ.
లక్ష్మీకాంతుని మంగళప్రదమైన వెలుగులతో ప్రకాశించే కొండ.
ఆ కొండ గుహల్లో సంపదలు కురిసి నిండిపోయిన కొండ (ఇహలోకపు సంపదలు కాదు, ఆ కొండ గుహల్లో ఎంతో మంది తపస్సులు చేసుకుంటూ పుణ్యాల సంపదలు సంపాదించగా వాటితో నిండిపోయినదని)
విస్తృతమైనది, విశ్వమంతా వ్యాపించినది అదిగో శ్రీవేంకటేశుడు నెలవైన కొండ.
పాపములను ఖండించే కొండ.. ఈ తిరుమల కొండ.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment