💥శ్రీ నృసింహద్వాదశనామ స్తోత్రం

 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహ స్వామినే నమః 🌹🙏


💥యద్భావం తద్భవతి!


‘సంభవిద్భిః ద్రవ్యైః, సంభవిదు పచారైః, సంభవితా నియమేన..’ 


-అంటే, "లభించిన పూజా ద్రవ్యాలతో, అనుకూలమైన ఉపచారాలతో, ఏర్పరుచుకున్న నియమాలతో నాకు ఉన్నంతలో నీ పూజకు సిద్ధమయ్యాను స్వామీ!" అని..


మనసును భగవంతుని మీదే నిలిపి తగిన ఉపచారాలతో, ముందుగానే సమకూర్చుకున్న పూజా ద్రవ్యాలతో అర్చించడమే ‘పూజ’


పూజా విధానంలో  "పంచోపచారాలు" (5 రకాల సేవలు: గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం), 


"షోడశోపచారాలు" (16 రకాల సేవలు: ఆవాహనం, ఆసనం నుంచి నీరాజనం, పునఃపూజ దాకా),


"చతుష్షష్ట్యుపచారాలు’ (64 రకాల సేవలు: విశేష అర్చనలు, వీటిలో నవరత్న ఖచిత సింహాసనం, ఏనుగులు, గుర్రాలు, దుర్గం వంటివి సమర్పించడం) ఇత్యాదులు ఎన్నో ఉంటాయి.


ఇవేకాక జప, తప, దాన, తర్పణ, హోమాది అనేకానేక విధానాలు, అర్చనలు, క్రతువులు ఉంటాయి.

అర్చించేవారి శక్తి సామర్థ్యాలు, వదాన్యతలను బట్టి పూజల హంగులు, ఆర్భాటాలు పెరుగుతుంటాయి.


పేదవాని బీదపూజలు నిరాడంబరంగానే ఉంటాయి.


భక్తిని, శక్తిని బట్టి ఎంత పూజా సామాగ్రినైనా సమకూర్చుకోవచ్చు.


"సత్యనారాయణస్వామి" వ్రత కథలో చంద్రకేతు, ఉల్కాముఖ మహారాజుల పూజలకే కాదు, కట్టెలమ్మేవాని, గొల్లపిల్లల పూజలకు కూడా స్వామి సంతుష్టుడై సమానమైన ఫలాలను ఇవ్వడం గమనించవచ్చు. 


ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల

భాండశుద్ధి లేని పాకమేల

చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా

విశ్వదాభిరామ వినుర వేమ!


💥భావనామాత్ర సంతుష్టుడు భగవంతుడు.

ఆయన అర్చనలో భావనమే ప్రధానం.


"యద్భావం తద్భవతి" అంటే మనస్ఫూర్తిగా తలచిందే జరుగుతుంది...


భగవంతుని మీద పరిపూర్ణమైన విశ్వాసంతో, మనఃపూర్వకంగా అర్చించేవారు కేవలం అక్షితలు వేసి, "నవరత్నాభరణాని సమర్పయామి" అని భావించినా సరిపోతుంది.


"కొండంత దేవుడికి కొండంత పత్రిని సమర్పించగలమా?"


నిర్మల భక్తితో ‘ఏకబిల్వం శివార్పణం’ అని సమర్పించినా చాలు.

మన మనోనిగ్రహం కోసమే విగ్రహారాధన.

సగుణోపాసనలోని ఆంతర్యమిదే.


మనస్సు ఏకాగ్రత కుదిరి నిశ్చల తత్త్వం ఏర్పడిన భక్త యోగులు, తపస్సిద్ధులు నిర్గుణోపాసనతోనే భగవంతుని అర్చించి తరిస్తారు.


💥"శ్రీమద్భాగవతం"లో ప్రహ్లాదుని లాగా...


పానీయంబులు ద్రావుచున్‌ గుడుచుచున్‌ భాషించుచున్‌ హాస లీ

లా నిద్రాదులు సేయుచున్‌ దిరుగుచున్‌ లక్షించుచున్‌ సంతత

శ్రీ నారాయణ పాదపద్మ యుగళీ చింతామృతా స్వాద సం

ధానుండై మఱచెన్‌ సురారి సుతు డేతద్విశ్వమున్‌ భూవరా!


అన్నివేళలా, అన్ని అవస్థల్లో, అంతటా పరమాత్ముని దర్శించి ఆ లీలానుభూతిలోనే మునిగితేలుతారు.

🍁🍁🍁🍁🍁


"శ్రీ నృసింహ స్వామి" వారి "ద్వాదశ నామ" స్తోత్రం మహా మహిమాన్వితం, శక్తివంతం.


ఈ స్తోత్రాన్ని భక్తిగా పఠిస్తే స్వామివారు మనకు రక్షా కవచంలా ఉండి కాపాడతారు.


"బుధవారం" పూట ద్వాదశ నామ స్తోత్రాన్ని పఠిస్తే.. అతి భయంకర వ్యాధులు రుగ్మతులు నశిస్తాయి, భయం తొలగుతుంది. 


💥శ్రీ నృసింహద్వాదశనామ స్తోత్రం:


ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ ।

తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః ॥

 

పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః ।

సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః ॥

 

నవమం ప్రహ్లాద వరదో దశమోऽనంత హస్తకః ।

ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తదా ॥

 

ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః ।

మంత్రరాజ ఇతి జ్ఞాతం సర్వపాప వినాశనమ్ ॥

 

క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం ।

రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే ॥

 

గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్ర చోరామయాదిషు ।

రణేచ మరణేచైవ శమదం పరమం శుభమ్ ॥

 

శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధి బంధనాత్ ।

ఆవర్తయత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ ॥

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥