🔱🌹హనుమన్నమస్కారః🌹🔱

 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏


💥హనుమ నామస్మరణం - సర్వ పాప నివారణం💥


శ్రీరామభక్తి పారవశ్యంతో పునీతమైన వాడు హనుమంతుడు.

"రామునికన్నా రామభక్తి గొప్పది" అని నిరూపించిన కపివరుడాయన.


అన్ని శక్తులు తమకున్నా సమయానుకూలంగా ప్రవర్తించే నేర్పు, ఓర్పుతో మానవాళికి ఒక ప్రవర్తనా నియమావళిని నేర్పించినవాడు.


అంజన్న కథలన్నీ ఒకచోట పేరిస్తే దైవ వ్యవహారాల్లోని ప్రతీకల అంతరార్థం మనకు అర్థమవుతుంది.


"#రామాయణం"లో అతిముఖ్యమైన పాత్రగా కనిపించే హనుమంతుడు మానవ మనస్తత్వానికి గొప్ప సంకేతం.


మనిషి అన్నవాడు రూపుదిద్దుకోవడానికి "మూడు అంశాలు" ప్రధానంగా దోహదపడతాయి.


అన్నిటికీ మూల చైతన్యమైన #ఆత్మ,

ఆ శక్తిని స్వీకరించి ప్రచోదన శక్తిగా మారే #మనసు,

పై రెండిటివల్ల చైతన్యమయ్యే #శరీరం!


ఈ మూడూ ఉన్నప్పుడే లోకంలో ‘మానవుడు’గా కొనసాగగలుగుతాడు.

వీటిని రామ-హనుమంతులకూ అనువర్తింప జేయవచ్చు.


రాముడు ‘ఆత్మ’కు ప్రతీక.

అందరం ‘ఆత్మారాముడు’ అంటాం.

‘మనసు’కు ప్రతీక హనుమంతుడు.


ఆత్మశక్తి, చైతన్యం వద్ద ‘మనసు’ తలవంచుతుంది.

కనుకే, మనం చూస్తున్న ప్రతి విగ్రహాదుల్లోనూ రామునిముందు హనుమ ఎప్పుడూ తలెత్తి కనిపించడు. సొంత నిర్ణయాలు తీసుకోడు.

మనసు తత్త్వమూ ఇదే.

తన శక్తి ఎంతో దానికి తెలియదు.

ఎవరివద్ద కూర్చుంటే ‘శక్తి’ వస్తుందో తెలియజెప్పినవాడు హనుమంతుడు.


ఆత్మ దగ్గర, ఆత్మవిధాన పరిధిలో ఉన్న హనుమంతునిలోని గొప్పదనం ‘సుందరకాండ’లో లంకా నగరాన్ని తగుల పెట్టినప్పుడు ప్రదర్శించిన ‘కోతిచేష్ఠల’లో మనకు కనిపిస్తుంది.

ఇదికూడా గంభీరమైన విధానమే.


సాధారణంగా అర్థం చేసుకుంటే, రాముని ఆజ్ఞను మాత్రమే పాలించే హనుమంతుడు, సీతను ‘చూసి రమ్మంటే కాల్చి’ వచ్చాడు.


మన మనసు కూడా సొంత నిర్ణయం తీసుకుంటే శరీరం అనే లంకకు ఇబ్బందే.

మనసు ఆత్మతో కూర్చుంటే శరీరం ఎప్పటికీ ఆనందమయమే.


తన శక్తి తనకు తెలియనివాడు హనుమంతుడు.

మన మనసుకూ తన శక్తి తెలియదు.

మరొకరు ప్రోత్సహించినప్పుడే ముందుకు వెళ్ళడానికి ఉద్యుక్తమవుతుంది.

హనుమంతుడిని కూడా జాంబవంతుడు ఇలాగే ప్రోత్సహించాడు.


‘శరీరం, మనసు, ఆత్మ’ ఇవి మనకు త్రిపురాల వంటివి.

దేహం ‘లోహపురం’ అయితే మనసు ‘రజతపురం’,

ఇక ఆత్మ ‘స్వర్ణపురమే’


శరీరానికి సహజంగా శక్తి ఉండదు.

మనసు ప్రేరణపైనే అది స్పష్టంగా పని చేస్తుంటుంది.

మనసు ఆత్మవద్ద ఉన్నప్పుడు దానికి అపరిమితమైన శక్తి లభిస్తుంది.


శరీర శక్తికే పరిమితమైన మనసు కేవలం ఆ భౌతిక దేహం బతకడానికి మాత్రమే పనికొస్తుంది.

అందుకే, మనసుకు ‘శక్తి’ కావాలి.

అది ఆత్మశక్తి నుండి మాత్రమే లభ్యమవుతుంది.

ఈ అంశాలన్నీ ‘హనుమంతుని చరిత్ర’లో మనకు బోధపడతాయి.


🔱🌹హనుమన్నమస్కారః🌹🔱


గోష్పదీకృతవారీశం మశకీకృతరాక్షసమ్ |

రామాయణమహామాలారత్నం వందేఽనిలాత్మజమ్ || ౧ ||


అంజనానందనంవీరం జానకీశోకనాశనమ్ |

కపీశమక్షహంతారం వందే లంకాభయంకరమ్ || ౨ ||

మహావ్యాకరణాంభోధిమంథమానసమందరమ్ |

కవయంతం రామకీర్త్యా హనుమంతముపాస్మహే || ౩ ||


ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యః శోకవహ్నిం జనకాత్మజాయాః |

ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయమ్ || ౪ ||


మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |

వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి || ౫ ||


ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయవిగ్రహమ్ |

పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనమ్ || ౬ ||


యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |

బాష్పవారిపరిపూర్ణలోచనం మారుతిర్నమత రాక్షసాంతకమ్ || ౭ ||

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం